• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఫుల్ డిమాండ్

MBNR : జిల్లాలో 16 మండలాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవుల నియామకంపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే నాగర్‌కర్నూల్ జిల్లాలో ఈ ప్రక్రియ పూర్తి కావడంతో, తమ జిల్లా తుది జాబితా ఎప్పుడు విడుదలవుతుందా అని ఆశావాహులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో ఈ పదవులకు భారీగా పోటీ ఏర్పడింది.

April 7, 2026 / 10:51 AM IST

మధిరలో రోడ్డు ప్రమదంలో.. వ్యక్తి మృతి

KMM: మధిర మండలం అంబారపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విషాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో నాగవరపాడు గ్రామానికి చెందిన తోక వెంకయ్య (55) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరొక వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో, సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే స్పందించి బాధితుడిని మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

April 7, 2026 / 10:50 AM IST

జిల్లాలో పోలీసుల అవగాహన సదస్సు

GDWL: జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు మల్డకల్ మండలం బిజ్వారం గ్రామంలో పోలీసు కళాబృందం అవగాహన కార్యక్రమం నిర్వహించింది. సైబర్ నేరాలు, డ్రగ్స్ దుష్ప్రభావాలు, పోక్సో చట్టం మరియు రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. అప్రమత్తతతోనే ఇంటి భద్రత, సమాజ రక్షణ సాధ్యమని ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు వివరించారు.

April 7, 2026 / 10:42 AM IST

నల్ల బ్యాడ్జీలు కార్మికుడు ధరించి విధులకు హాజరు

KMM: స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు టీజీఎస్ ఆర్టిసి పరిరక్షణ దినం బ్యాడ్జిల కార్యక్రమాన్ని మధిర డిపో ఉద్యోగులు ఇవాళ నిర్వహించారు. నల్ల బ్యాడ్జీలు కార్మికులందరూ ధరించి విధులకు హాజరయ్యారు. బస్సు భవన్లోని ఏ బ్లాక్ పై ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని అన్నారు. విద్యుత్ బస్సుల విధానాల మార్పులు చేయాలన్నారు.

April 7, 2026 / 10:41 AM IST

బాటసారులకు ఊరట

సిద్దిపేటలోని పాత బస్టాండ్ సమీపంలో డీసీసీ నాయకుడు షాబుద్దీన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పూజల హరికృష్ణ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండుతున్న ఎండల దృష్ట్యా ప్రజల దాహార్తీని తీర్చేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు.

April 7, 2026 / 10:40 AM IST

‘కో-ఆప్షన్ సభ్యుల నియామకానికి దరఖాస్తు చేసుకోవాలి’

ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో కో-ఆప్షన్ సభ్యుల నియామకానికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ గాజానంద్ తెలిపారు. మొత్తం నలుగురు సభ్యులను నియమించనున్నట్లు చెప్పారు. ప్రత్యేక పరిజ్ఞానం కలిగిన ఇద్దరికి అవకాశం ఉండగా, వారిలో ఒక మహిళకు ప్రాధాన్యం ఇస్తారు. అలాగే మైనారిటీ వర్గానికి చెందిన ఇద్దరిని ఎంపిక చేసి, వారిలో ఒక మహిళకు ప్రాధాన్యం కల్పిస్తారు.

April 7, 2026 / 10:40 AM IST

గోరక్షణ చట్టాలు కఠినంగా అమలు చేయాలి: వీహెచ్పీ

NRPT: గోరక్షణ చట్టాలను కఠినంగా అమలు చేయాలని కోరుతూ వీహెచ్పీ నేతలు తెలంగాణ సీఎస్ రామకృష్ణ రావుకు వినతిపత్రం అందజేశారు. గోవుల అక్రమ రవాణాపై నిఘా పెంచి, సరిహద్దుల్లో తనిఖీలు చేపట్టాలని పగడాకుల బాలస్వామి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీహెచ్పీ, బజరంగ్ దళ్ ప్రతినిధులు పాల్గొని గోవధ నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు.

April 7, 2026 / 10:39 AM IST

‘విద్యుత్ సమస్యను పరిష్కరించాలి’

ADB: బేల మండలంలోని అవల్పూర్ గ్రామంలో నెలకొన్న విద్యుత్తు సమస్యను పరిష్కరించాలని ఎస్సీ కాలనీవాసులు కోరుతున్నారు. కాలనీలో విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు నూతన పరికరాన్ని ఏర్పరిచినప్పటికీ దానికి కనెక్షన్ ఇవ్వకపోవడంతో విద్యుత్తు సరఫరా నిలిచిపోతుందన్నారు. సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

April 7, 2026 / 10:38 AM IST

మైనారిటీ యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు!

వికారాబాద్ జిల్లాలోని నిరుద్యోగ మైనారిటీ యువతీ యువకులకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి రాజేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన ఆసక్తిగల అభ్యర్థులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. మరిన్ని వివరాల కోసం ఈ నంబర్ 7993357103ను సంప్రదించాలన్నారు.

April 7, 2026 / 10:37 AM IST

డోర్నకల్-గద్వాల రైలు లైన్ ముందడుగు

NGKL: డోర్నకల్-గద్వాల ప్రతిపాదిత రైల్వే లైన్ పనులకు కీలక ముందడుగు పడింది. నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి సౌత్ సెంట్రల్ రైల్వే ప్రధాన కార్యాలయంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ వద్ద అలైన్‌మెంట్‌ను స్వీకరించారు. ప్రాజెక్టును తదుపరి దశలకు తీసుకెళ్లేందుకు అవసరమైన పరిపాలనా, సాంకేతిక ప్రక్రియలపై అధికారులు ఎంపీకి వివరాలు అందజేశారు.

April 7, 2026 / 10:35 AM IST

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో డ్రైవర్ మృతి

PDPL: NTPC నుంచి GDK వెళ్తున్న ఓ ఆటోను శారద నగర్ రాజీవ్ రహదారిపై ఇవాళ తెల్లవారుజామున వెనుక నుంచి కారు అతివేగంగా ఢీకొట్టింది. దీంతో ఆటో డ్రైవర్ ఇస్మాయిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోలోని ప్రయాణికురాలు తీవ్రంగా గాయపడింది. వన్ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆటో డ్రైవర్ మృతదేహాన్ని, గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు.

April 7, 2026 / 10:34 AM IST

రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా విద్యార్థులు

KNR: హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో ఈనెల 27, 28 తేదీల్లో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాశాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జిల్లా నుంచి ఎంపికైన విద్యార్థులు అవసరమైన సర్టిఫికెట్లతో 27న హకీంపేటలో రిపోర్ట్ చేయాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9704061725, 9640967943లను సంప్రదించవచ్చని తెలిపారు.

April 7, 2026 / 10:31 AM IST

మరికొద్ది సేపట్లో ములుగు జిల్లాకు చేరుకోనున్న DGP

MLG: జిల్లా దండకారణ్యానికి మరికొద్ది సేపట్‌లో తెలంగాణ DGP శివధర్ రెడ్డి చేరుకుంటారని SP సుధీర్ రామ్నాథ్ తెలిపారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలు, పామునూర్‌లో పోలీసు అవుట్‌బేస్ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. DGPతో పాటు అటవీ శాఖ అధికారులు కర్రెగుట్టల సమీపంలోని జోల్లా, డోలి ప్రాంతాల్లో నిర్మిస్తున్న రహదారుల పనులను పరిశీలించనున్నారు.

April 7, 2026 / 10:31 AM IST

వనపర్తి రోడ్డుపై ప్రమాదాలకు డివైడర్ కారణం

WNP: వనపర్తి–పెబ్బేరు రహదారిలో తెల్లవారుజామున కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాదం తర్వాత జేసీబీ సాయంతో వాహనాన్ని పక్కకు తొలగించడంతో రాకపోకలు సజావుగా సాగాయి. రోడ్డు ఎత్తు పెరగడంతో డివైడర్ కనిపించకుండా పోయిందని, ఇదే ప్రమాదాలకు కారణమని వాహనదారులు ఆరోపిస్తున్నారు. వెంటనే డివైడర్ ఎత్తు పెంచి భద్రతా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

April 7, 2026 / 10:30 AM IST

ఇవాళ నుంచి 3 రోజులపాటు వర్షాలు

KMM: ఇవాళ్టి నుంచి 3 రోజులపాటు వర్షాలు తెలంగాణ ప్రజలకు అలర్ట్. ఇవాళ నుంచి రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని మంగళవారం IMD వెల్లడించింది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కుస్తాయని తెలిపింది.

April 7, 2026 / 10:25 AM IST