MHBD: మరిపెడ మండలంలోని ఆనేపురం గ్రామంలో సవారి లచ్చమ్మ పండుగ వేడుకల్లో ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, పాడిపంటలతో సమృద్ధిగా ఉండాలని అమ్మవారిని కోరినట్లు చెెప్పారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్లాలని విప్ తెలిపారు.
JN: స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలో ఆదివారం భారత ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన “మన్ కీ బాత్” 131వ కార్యక్రమాన్ని BJP రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వెంకటేశ్వర్లు, BJP నాయకులు వీక్షించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. BJP ప్రభుత్వంతోనే దేశ అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో BJP ముఖ్య నేతలు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
KMR: నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి పంట సాగు కోసం ప్రధాన కాలువ ద్వారా 3వ విడతలో భాగంగా ఆదివారం 1,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈఈ అక్షయ్ కుమార్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 13.903 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు రైతులను కోరారు.
HNK: కాకతీయ యూనివర్సిటీ సెనేట్ హాలులో శతావధానం కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ… శతావధానం కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని, కేయూకు ప్రత్యేక చరిత్ర ఉందని, కేయూ అభివృద్ధికి సహకరిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.
WGL: భారత ప్రధాని నరేంద్రమోదీ నిర్వహిస్తున్న “మన్ కీ బాత్” 131వ ఎపిసోడ్ కార్యక్రమాన్ని వరంగల్ తూర్పు 28వ డివిజన్ 105 బూత్‌లో కార్యకర్తలతో బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ వీక్షించారు. రవికుమార్ మాట్లాడుతూ… ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తుందని, బీజేపీకి ప్రజలు అండగా నిలవాలన్నారు.
NGKL: చారకొండ మండలం గోకారం పంచాయతీ ఏడవ వార్డులో సీసీ రోడ్డు పనులను సర్పంచ్ పర్శరాములు ఆదివారం ప్రారంభించారు. గ్రామాభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, ప్రజల సహకారంతో అన్ని వార్డుల్లో మౌలిక వసతులు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి చెన్న కేశవులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
KNR: కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్‌ను తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ తరఫున 100 మంది శ్రీనివాసులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. శ్రీనివాసుల పేరుతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి 2 సంవత్సరాలలో 30వేల మంది శ్రీనివాసులు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రపంచ రికార్డు నమోదు చేశారు.
BDK: ఇల్లందు మండలం రేపల్లెవాడ గ్రామపంచాయతీలో లబ్ధిదారుల నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏప్రిల్ నెలలో మరల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
JGL: బీర్పూర్ మండలం రంగసాగర్ గ్రామంలోని గొల్ల కేతమ్మ ఆలయంలో ఆదివారం మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆయనను సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
MLG: ఏటూరునగారం మండల కేంద్రంలో వీధి కుక్కలకు వైరస్ సోకినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కొన్ని వీధులలో వెంట్రుకలు పూర్తిగా ఊడిపోయి, శరీరంపై గాయాలతో తిరుగుతున్న కుక్కలు కనిపించడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. రేబిస్ వంటి ప్రమాదకరమైన వ్యాధి అయితే ప్రజలకు ప్రాణహాని కలగొచ్చని, అధికారులు తక్షణమే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.
KMM: ఏదులాపురం ఎన్నికల వరకే రాజకీయం గెలిచిన తర్వాత ఏ పార్టీ వారైనా ప్రజా ప్రభుత్వం తరపున పేదవాడికి సేవ చేయాల్సిందేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. పదవి అనేది అధికారం కాదు, బాధ్యత అని గుర్తించాలన్నారు. ఆదివారం పెద్దతండాలోని మున్సిపల్ కార్యాలయంలో నూతన మున్సిపల్ ఛైర్‌పర్సన్ అనిత బాధ్యతల స్వీకరణ మహోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
NZB: ఆర్మూర్‌కు చెందిన డీకే.రాజేష్ లయన్స్ క్లబ్ ఉత్తమ రీజినల్ ఛైర్మన్ అవార్డును అందుకున్నారు. సికింద్రాబాద్లోని లయన్స్ భవనంలో గవర్నర్ లయన్ నగేష్ ఆధ్వర్యంలో జరిగిన అవార్డ్స్ నైట్లో ఈ పురస్కారం ప్రదానం చేశారు. 12 క్లబ్ల పరిధిలో సభ్యత్వ నమోదు, విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు ఆయనను అభినందించారు.
SRPT: అనారోగ్యంతో మృతి చెందిన అడిగోడు మండలం సిరిపురం గ్రామానికి చెందిన కాంపాటి సాయిలు కుటుంబానికి ఆయన బాల్య మిత్రులు అండగా నిలిచారు. ఆదివారం సాయిలు భార్య జానమ్మకు మిత్రబృందం రూ.15,000 ఆర్థిక సాయాన్ని అందజేసి, తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. భవిష్యత్తులోనూ ఆ కుటుంబానికి తోడుగా ఉంటామని వారు హామీ ఇచ్చారు.
BDK: పినపాక పోతిరెడ్డిపల్లి క్రింది గుంపు వాగుపై సుమారు రూ. 65 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పనులను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదివారం పరిశీలించారు. పనుల పురోగతిని స్వయంగా వీక్షించి, నిర్మాణ నాణ్యతపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే స్థానిక గ్రామాల మధ్య రాకపోకలు సులభతరం అవుతుందని తెలిపారు.
ADB: గుడిహత్నూర్ మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయం వద్ద నిర్మించిన శ్రీ సంత్ గాడ్గే బాబా మహరాజ్ మూర్తి ఆవిష్కరణ కార్యక్రమానికి ఆదివారం ముఖ్య అతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరై ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యేను సమాజ సభ్యులు శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో తిరుమల గౌడ్, రవి నాయక్, మాధవ్, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.