• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించిన ఎస్పీ

BHPL: జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో అత్యాధునిక ‘కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా నిఘా పెంచేందుకు, నేరాలను ముందస్తుగా గుర్తించేందుకు ఈ కేంద్రం ఎంతో దోహదపడుతుందన్నారు.

April 8, 2026 / 02:25 PM IST

పీహెచ్‌సీని తనిఖీ చేసిన జిల్లా అధికారి

KNR: శంకరపట్నం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ షాజిదా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఐఎల్ఆర్, వ్యాక్సిన్, టెంపరేచర్ రికార్డులను పరిశీలించారు. అనంతరం HPV వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆయుశ్ డాక్టర్ సంధ్య, ఎంఎల్‌హెచ్‌పీ డాక్టర్ శ్వేత, సూపర్వైజర్ అనిల్, సిబ్బంది పాల్గొన్నారు.

April 8, 2026 / 02:24 PM IST

ఆసుపత్రికి అనుమతి ఇవ్వండి: ఎమ్మెల్యే

WGL: వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో మంజూరైన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన భూమి అనుమతులను వెంటనే మంజూరు చేయాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కోరారు. ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే మెరుగైన వైద్య సేవలు అందుతాయని, పెండింగ్ రెవెన్యూ సమస్యలు పరిష్కరించి పనులు త్వరగా ప్రారంభించాలని కోరారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.

April 8, 2026 / 02:21 PM IST

గ్రామంలో ఆర్థిక అవగాహన కార్యక్రమం

SRD: బెజ్జంకి మండలంలోని తోటపల్లి గ్రామంలో బుధవారం ఆర్థిక అక్షరాస్య కేంద్రం, ఇండియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో ఆర్థిక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు బ్యాంకింగ్ సేవలు, పొదుపు అలవాట్లు, ఇన్సూరెన్స్ పథకాల ప్రాముఖ్యతతో పాటు సైబర్ మోసాలపై జాగ్రత్తలు వివరించారు. కార్యక్రమంలో బ్యాంక్ ఏబీఎం మోహన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

April 8, 2026 / 02:20 PM IST

బెజుగామకు బస్సు సౌకర్యం ప్రారంభం

SDPT: గజ్వేల్ మండలం బెజుగామ గ్రామం నుంచి గజ్వేల్ వరకు కొత్తగా ఏర్పాటు చేసిన బస్సు సౌకర్యాన్ని సిద్దిపేట డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి బుధవారం ప్రారంభించారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి సహకారంతో ఈ సర్వీసు అందుబాటులోకి వచ్చిందని ఆమె తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు, ప్రజల సౌకర్యార్థం ఈ బస్సును ఏర్పాటు చేశామన్నారు.

April 8, 2026 / 02:18 PM IST

వల్మిడి ఆలయ హుండీ లెక్కింపు ఎప్పుడంటే..!

JN: పాలకుర్తి మండలంలోని వల్మిడి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ హుండీ లెక్కింపును ఈ నెల 15న నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) సల్వాది మోహన్ బాబు తెలిపారు. 15న ఉదయం 10 గంటలకు దేవదాయ ధర్మాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ ప్రారంభం కానుందని, భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.

April 8, 2026 / 02:16 PM IST

గురువు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

KMM: ఓ ప్రైవేట్ స్కూల్ పూర్వ విద్యార్థులు గురువుపై ఉన్న గౌరవాన్ని చూపుతూ మానవత్వాన్ని ప్రదర్శించారు. 2009-10 విద్యా సంవత్సరానికి చెందిన విద్యార్థులు, ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన తమ తెలుగు ఉపాధ్యాయుడు సత్యనారాయణ కుటుంబానికి బుధవారం ఆర్థిక సాయం అందించారు. అంతా కలిసి రూ. 40,000 సేకరించి ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు.

April 8, 2026 / 02:12 PM IST

ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన ఎంపీడీవో

MDK: పెద్ద శంకరంపేట మండలం వీరోజిపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ గృహాల నిర్మాణాలను ఎంపీడీవో క్రాంతి కుమార్ పరిశీలించారు. ఇందిరమ్మ పథకంలో మంజూరైన ఇందిరమ్మ గృహాలను వెంటనే సకాలంలో పూర్తి చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారులకు విడతల వారీగా నేరుగా లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ, ఈజీఎస్ అధికారులు పాల్గొన్నారు.

April 8, 2026 / 02:10 PM IST

ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం: MLA

MBNR : అర్హులైన ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. ఇవాళ భూత్పూర్ మండలం రావులపల్లి గ్రామంలో మూస కళమ్మ, చిన్న ఆంజనేయుల నూతన గృహ ప్రవేశ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యం అంటేనే పేదల రాజ్యమని అన్నారు.

April 8, 2026 / 02:10 PM IST

‘ప్రజా సంక్షేమానికి పాటుపడేది కాంగ్రెస్ ప్రభుత్వమే’

MNCL: ప్రజా సంక్షేమానికి పాటుపడేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. బుధవారం జన్నారం మండలంలోని టీజీపల్లి గ్రామానికి చెందిన పెరిక సంఘం నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్‌లో చేరుతున్నారని అన్నారు.

April 8, 2026 / 02:05 PM IST

‘పాత పద్ధతిలోనే ఇసుక రవాణాకు అనుమతించాలి’

SRCL: ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్న ఆన్‌లైన్ విధానంలో కాకుండా పాత పద్ధతిలోనే ఇసుక రవాణా అనుమతించాలని వీర్నపల్లి మండలం పదిర, హరిదాస్ నగర్ గ్రామాల ట్రాక్టర్ యజమానులు తహసీల్దారు సుజాతకు వినతి ఇచ్చారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే ఆన్‌లైన్ విధానంతో రెండు గ్రామాలకు చెందిన ట్రాక్టర్ యజమానులు, 100 మంది డ్రైవర్లు, 400 మంది కూలీలు ఉపాధి కోల్పోతారని చెప్పారు.

April 8, 2026 / 02:05 PM IST

పౌష్టికాహారం ద్వారా తల్లి బిడ్డల ఆరోగ్యం

NLG: చిట్యాలలోని 4వ అంగన్‌వాడీ కేంద్రంలో బుధవారం ‘ఆరోగ్య లక్ష్మి’ కమిటీ సమావేశం జరిగింది. కౌన్సిలర్ షబానా అజీమ్ హాజరై మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు కేంద్రానికి వచ్చి పోషకాహారం తీసుకోవాలని, తద్వారా తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. 3 నుండి 6 ఏళ్ల పిల్లల పేర్లను అంగన్‌వాడీల్లో తప్పనిసరిగా నమోదు చేయించాలని కోరారు.

April 8, 2026 / 02:04 PM IST

దేవాలయానికి నూతన కమిటీ ఎన్నుకోవాలని వినతి

BHNG: సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ పున:ప్రారంభమై 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకోవాలని గ్రామస్తులు సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. దశాబ్ద కాలంగా ఒకరే అధ్యక్షుడిగా ఉన్నారని, ఇకపై అన్ని కులాలకు, యువతకు ప్రాధాన్యతనిస్తూ కొత్త కమిటీ వేయాలని కోరారు.

April 8, 2026 / 02:03 PM IST

పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే

PDPL: సుల్తానాబాద్‌లో నిర్వహించిన ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ విజయరమణారావు పాల్గొన్నారు.పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా హెచ్పీవీ వ్యాక్సిన్ కార్యక్రమం, ఉచిత కంటి చికిత్స శిబిరాన్ని ప్రారంభించారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి బీమా పథకం జూన్ 2న ప్రారంభమవుతుందన్నారు.

April 8, 2026 / 02:02 PM IST

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం..!

NZB: వర్ని మండలం హుమ్నాపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఏఎంసీ ఛైర్మన్ సురేష్ బాబా ప్రారంభించారు. దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో హుమ్నాపూర్ గ్రామ సర్పంచ్ అప్పి రెడ్డి, సొసైటీ మాజీ ఛైర్మన్ కనక రెడ్డి, ఘన్ పూర్ సర్పంచ్ ముత్తకుంట కృష్ణ, రైతులు పాల్గొన్నారు.

April 8, 2026 / 02:01 PM IST