WGL: నర్సంపేట (M) నర్సింగాపురం–ఇటుకలపల్లి GP రైతుల ఆధ్వర్యంలో DC–33 ఎల్‌ఎంసీ కెనాల్ కాలువను ఇవాళ రైతులు పరిశీలించారు. ఈ సందర్భంగా TG రైతు కూలి సంఘం (D) కార్యదర్శి పైడి మాట్లాడుతూ.. దేవాదుల ఎత్తిపోతల పథకం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్యాకేజీలో భాగమైన డీసీ–33 ఎల్‌ఎంసీ కెనాల్ కాల్వ పనులు అధికారుల నిర్లక్ష్యం వలన ఆగిపోయినట్లు పేర్కొన్నారు. అధికారులు స్పందించాలి.
HYD: తార్నాకలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్ర రావును అక్రమంగా అరెస్టు చేయడాన్ని బీజేపీ మేడ్చల్ అధికార ప్రతినిధి పోతగాని గోపాల్ గౌడ్ ఖండించారు. ఉప్పల్ నియోజకవర్గం నాచారంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని గృహ నిర్బంధం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
NGKL: కుమ్మెర గ్రామంలో మహిళపై దాడికి పాల్పడిన దుండగులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు డిమాండ్ చేశారు. స్థానిక నాయకులతో కలిసి కుమ్మెర గ్రామంలో ఆదివారం పర్యటించారు. బాధిత కుటుంబాన్ని కలిసి వివరాలు సేకరించారు. ఆయన మాట్లాడుతూ.. మహిళ అని కూడా చూడకుండా దుర్మార్గంగా దాడి చేసి గాయపరిచారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
KNR: CPI సీనియర్ నాయకుడు, మాజీ జిల్లా కౌన్సిల్ సభ్యుడు శ్రీరాముల రామచంద్రం ప్రమాదవశాత్తు మృతిచెందడం పార్టీకి తీరని లోటని ఆ పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ కార్యదర్శి మర్రి వెంకట స్వామి అన్నారు. ఆదివారం కొండపల్కల గ్రామంలోని రామచంద్రం నివాసానికి చేరుకున్న ఆయన రామచంద్రం మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
KMR: గాంధారిలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మల్లన్న స్వామి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
MBNR: మిడ్జిల్ మండలం వస్పుల హైస్కూల్ 2001-2002 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 24 ఏళ్ల తర్వాత కలుసుకున్న మిత్రులు తమ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా గురువులు సుధాకర్, నర్సోజీ, వెంకటయ్యలను ఘనంగా సన్మానించారు. చెన్నకేశవులు, రాజు, నందం తదితర విద్యార్థులు పాల్గొని సందడి చేశారు.
NRML: ఆదివారం జరిగిన రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలలో నిర్మల్ జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటారు. రిథమిక్ యోగ అండర్-14 సబ్ జూనియర్ బాలుర విభాగంలో మాగం చరణ్ వెండి పతకం సాధించగా, అండర్-25 విభాగంలో దిలీప్ బంగారు పతకం అందుకున్నారు. జిల్లాకు మరిన్ని విజయాలు సాధించిన క్రీడాకారులను అధికారులు అభినందించారు.
SRPT: హుజూర్‌నగర్ మున్సిపాలిటీ చైర్మన్‌గా రెండోసారి ఎన్నికైన దొంతగాని శ్రీనివాస్ గౌడ్‌తో పాటు మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికైన ఏడుగురు గౌడ కౌన్సిలర్లను గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. పట్టణంలోని శ్రీ కంఠమహేశ్వరి సూరమాంబ దేవస్థానం సన్నిధిలో కార్యక్రమం నిర్వహించారు. జై గౌడ సంఘం నాయకులు, గౌడ కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అభినందనలు తెలిపారు.
కరీంనగర్ నగర పాలక సంస్థలో ఎన్నికలు ముగిసిన ప్రతిసారీ డిప్యూటీ మేయర్ ఛాంబర్ కేటాయింపు రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. 2005లో మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా అప్గ్రేడ్ అయినప్పటి నుంచి ఈ వివాదం కొనసాగుతుండటం గమనార్హం. గతంలో డిప్యూటీగా పనిచేసిన తాజా మాజీ మేయర్ సునీల్ రావుకు ఛాంబర్ కేటాయించవద్దనే డిమాండ్ తాజాగా మళ్లీ తెరపైకి వచ్చింది.
MDCL: మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యం అని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. అదివారం బోయినపల్లిలోని తన కార్యాలయంలో కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు సమర్పించిన వినతిపత్రాలను స్వీకరించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీటి సౌకర్యాలు, విద్యుత్ లైన్ల మార్పు, శ్మశానవాటిక పరిరక్షణ వంటి సమస్యలను ప్రస్తావించారు.
SDPT: మద్దూరు మండలం సలాక్పూర్ గ్రామంలో శ్రీ శంభు-రామ దేవాలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు ఘనంగా జరిగాయి. జనగామ MLA డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారికి మొక్కలు చెల్లించుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
MDK: హిందూ ముస్లింల ఐక్యత కోసం ఎంతగానో కృషి చేసిన మహోన్నత వ్యక్తి, విద్యావేత్త మౌలాన అబుల్ కలాం ఆజాద్ అని మున్సిపల్ ఛైర్మన్ కానుగు రాధిక పేర్కొన్నారు. ఆదివారం విద్యావేత్త, భారతరత్న అవార్డు గ్రహీత మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతిని మెదక్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులార్పించారు.
BHNG: విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి, వారికి ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యంగా టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నామని ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజు తెలిపారు. ఆదివారం ఆలేరు మండల కమిటీ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించారు.పదవ తరగతి విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలను రాయాలని రాజు సూచించారు.
NZB: కమ్మర్‌పల్లి మండలంలోని కేసీఆర్ కాలనీ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎర్రోళ్ల లస్మయ్య (75) మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. లస్మయ్య ఎకైల్పై కమ్మర్ పల్లి నుంచి వెళ్తుండగా జాతీయ రహదారి-63పై అతని వాహనం, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లస్మయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.ఎస్సై అనిల్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
JGL: రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిలిచిపోయిన ప్రజావాణి కార్యక్రమం రేపటి నుంచి తిరిగి యథాతథంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజల నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు.