VKB: ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడులను బలోపేతం చేయడమే లక్ష్యమని మర్పల్లి ఎంఈవో అశోక్ గురువారం తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు. తరగతి గదిలో పాఠాలు అర్థమయ్యేలా బోధించడంతో పాటు, విద్యార్థుల నోట్స్‌ను ఎప్పటికప్పుడు సరిచూడాలని సూచించారు.
PDPL: మంథని మున్సిపల్ కార్యాలయంలో ఛైర్మన్ పుట్ట శైలేంద్ర, కమిషనర్ మనోహర్ ఆధ్వర్యంలో ‘ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక’పై సమావేశం నిర్వహించారు. మార్చి 6 నుంచి 99 రోజుల పాటు పారిశుధ్యం, పన్నుల వసూలు, నీటి సరఫరా మరియు దోమల నివారణపై ప్రత్యేక నిఘా పెట్టాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ సహేందర్ రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
JGL: మెట్‌పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026–2027 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు అధికంగా జరిగేలా చూడాలని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. వెంకయ్య సూచించారు. ఆయన ఆధ్వర్యంలో బోధన, బోధనేతర సిబ్బంది కలిసి కళాశాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ప్రిన్సిపాల్ విద్యార్థులు అధిక సంఖ్యలో అడ్మిషన్లు పొందేందుకు సిబ్బంది కృషి చేయాలని హితపూర్వకంగా తెలిపారు.
పట్టణంలోని 35వ వార్డు పందులు, కోతులకు నిలయంగా మారింది. రోడ్లపై పేరుకుపోయిన వ్యర్థాలను తింటూ ఇవి స్థానికులపై దాడులకు తెగబడుతున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి కోతులు, పందుల బెడదను నివారించాలని, పట్టణ ప్రజలు అధికారులను కోరారు.
KNR: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థులుగా ఖరారైన సిటింగ్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిని టీపీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షులు, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వం సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. అంతే కాకుండా గురువారం వారు హైదరాబాద్‌లో నామినేషన్లు దాఖలు చేయగా, ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.
MBNR: జిల్లా వ్యాప్తంగా గురువారం నిర్వహించిన మ్యాథమెటిక్స్, జువాలజీ, హిస్టరీ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు 254 మంది గైర్హాజరైనట్టు జిల్లా ఎగ్జామినేషన్ కమిటీ కన్వీనర్ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. పరీక్షకు మొత్తంగా 10156 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 9902 విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు.
NZB: కమ్మర్ పల్లి మండలం ఉప్లూర్ గ్రామంలో గ్రామ పంచాయితి కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి పథకం లబ్ధిదారులకు కమ్మర్ పల్లి ఎంఆర్వో ప్రసాద్, గ్రామ సర్పంచ్ ఏనుగందుల శైలందర్ చేతుల మీదుగా నేడు చెక్కులను పంపిణి చేసారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాపాలన చేస్తూ నిరుపేద ప్రజలకోసం వారి సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి అహర్నిశలు కృషి చేయడం జరుగుతుంది అన్నారు.
KMR: జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మార్చి 6 నుంచి మార్చి 15వ తేదీ వరకు మున్సిపాలిటీల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు.
WNP: జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగాయని, మొత్తం 169 మంది గైర్హాజరైనట్లు DIEO ఎర్ర అంజయ్య తెలిపారు. జనరల్ విద్యార్థులు 4,077 మందికి 3,950 మంది హాజరయ్యారు. 127 మంది ఆబ్సెంట్ అయినట్లు చెప్పారు. ఒకేషనల్లో 1,305 మందికి 1,263 మంది విద్యార్థులు హాజరు కాగా 42 మంది ఆబ్సెంట్ అయ్యారని తెలిపారు.
SRPT: రైతుబంధు నిధులను వెంటనే ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయాలని సీపీఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గురువారం ధర్మభిక్షం భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యూరియా యాప్‌తో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఎరువులు అందించాలన్నారు. సన్నవడ్లకు హామీ ఇచ్చిన రూ. 500 బోనస్ ఇవ్వాలని అన్నారు.
SDPT: జల్సాలకు అలవాటుపడి జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్దిపేట సీఐ ఉపేందర్ మాట్లాడుతూ.. ఏపీకి చెందిన ఉప్పల జగదీశ్ (23), పీత చెన్నకేశవ నూకరాజు కార్తీక్ (22) అనే నిందితులు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో పలు చోట్ల దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలిపారు. పోలీసులు ఇద్దరి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో కామ్రేడ్ స్టాలిన్ 73వ వర్ధంతి సంస్మరణ కార్యక్రమం కమలానగర్లోని పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గొడుగు యాదగిరిరావు అధ్యక్షత వహించారు. కోమటి రవి, జనార్దన్ రెడ్డి తదితరులు స్టాలిన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అత్యవసర పరీక్ష గది,వృద్ధాప్య వార్డు, పెడియాట్రిక్ వార్డు, ల్యాబొరేటరీ లను పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు.
జనగామ జిల్లా కేంద్రంలోని ఉపాధి కల్పన కార్యాలయం, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో రేపు 6వ తేదీన ఉద్యోగమేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి సాహితీ గురువారం తెలిపారు. ఈ మేళాలో ప్రైవేట్ కంపెనీ శిక్షణ, ఉద్యోగ అవకాశాలు అందిస్తున్నాయి. జాబ్ మేళా కార్యక్రమం జనగామ పురపాలక సంఘం కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతుందని ఆమె తెలిపారు.