BDK: జాతీయ పంచాయతీ అవార్డులు 2023–24లో భాగంగా పచ్చదనం–పరిశుభ్రత విభాగంలో సుజాతనగర్ మండలం సీతంపేట గ్రామం ఎంపిక కావడం జిల్లా అభినందనీయం అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. సందర్భంగా బుధవారం కలెక్టర్ సీతంపేట గ్రామాన్ని సందర్శించి పారిశుధ్య చర్యలను సమగ్రంగా పరిశీలించారు. గ్రామంలోని పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం కార్యక్రమాలు అభినందనీయం అన్నారు.
VKB: పేదవారి సొంత ఇంటి కల నెరవేర్చేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వమేనని జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ రాజేశ్ రెడ్డి అన్నారు. నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నూతన గృహప్రవేశ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారులను ఆశీర్వదించారు.
WGL: వరంగల్ జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమైనట్లు DIEO శ్రీధర్ సుమన్ తెలిపారు. తొలి రోజు పరీక్షలో జనరల్ మొత్తం 5680 విద్యార్థులకు గాను 5491 హాజరు కాగా 189 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ మొత్తం 767 విద్యార్థులకు గాను 694 హాజరుకాగా 73 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలను డీఈసీ సభ్యులు మాధవరావు, విజయ నిర్మలలు పూర్తిస్థాయిలో పర్యవేక్షించారు.
RR: గోపనపల్లి ప్రాంతంలో సమగ్ర జంతు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయడానికి మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. జీహెచ్ఎంసీ, రామ్కీ ఫౌండేషన్, ఆల్ ఫర్ యానిమల్స్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ కేంద్రాన్ని స్థాపించనున్నాయి. నిరాశ్రయ జంతువులకు ఆశ్రయం, వైద్య సేవలు, శస్త్రచికిత్సలు, టీకాలు, పునరావాస సదుపాయాలు కల్పించేందుకు ఆధునిక సదుపాయాలతో కేంద్రం రూపుదిద్దుకోనుంది.
NZB: జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు అత్యంత పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 19,150 మంది విద్యార్థులకు 18,574(97%) హాజరయ్యారు. పరీక్షల నిర్వహణలో ఎక్కడా లోపాలు తలెత్తకుండా హైపవర్ కమిటీ, సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నిరంతరం పర్యవేక్షించారు.
MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో బుధవారం మాజీ ఎమ్మెల్యే మైనాంపల్లి హనుమంతరావు పర్యటించారు. మున్సిపాలిటీ పరిధిలోని రెండవ వార్డ్ కోమటిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన హనుమాన్ దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమంలో మైనంపల్లి పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
WGL: వర్ధన్నపేట పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌కు రెండు రోజుల ముందు ఓపెన్ జిమ్ పేరుతో శిలాఫలకం ఏర్పాటు చేసి హడావుడి చేశారు. కేవలం ఎన్నికల ప్రచార కోసమేనని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. బుధవారం ఎన్నికలు పూర్తయ్యాక ఆశిలాఫలకాన్ని పక్కకు తొలగించి పాత మున్సిపాలిటీ భవనంలో ఉంచినట్లు స్థానికులు తెలిపారు. ఇట్టి దృశ్యాలు సామాజికమద్యంలో వైరల్ గా మారాయి.
WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సందర్శించారు. కమిషనర్ చాహత్ బాజ్ పాయ్‌తో ఎమ్మెల్యే భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. అనంతరం కార్పొరేటర్లతో ఎమ్మెల్యే సమావేశమై మాట్లాడుతూ.. ప్రతిరోజు సాయంత్రం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు.
MDCL: మల్కాజ్‌గిరి మాజీ కార్పొరేటర్ శ్రవణ్, బలరాం నగర్ వాటర్ వర్క్స్ మేనేజర్ నవీన్‌ను వాజ్పేయి నగర్ కార్యాలయంలో కలిశారు. మంజూరైన భూగర్భ డ్రైనేజీ పనులు వేగంగా పూర్తి చేయాలని కోరారు. పాడైన మాన్ హోల్ కవర్లు తక్షణం బాగుచేయాలని సూచించారు. రాబోయే వేసవిలో మంచినీటి సరఫరా అంతరాయం లేకుండా రిజర్వాయర్ల మోటార్లపై ముందస్తు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
SDPT: గజ్వేల్‌లోని ఎడ్యుకేషన్ హబ్ మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షా కేంద్రాలను గజ్వేల్ ఏసీపీ నర్సింలు, సీఐ రవికుమార్ సందర్శించారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలని, విద్యార్థులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని సూచించారు. పిల్లలు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసి ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షించారు.
BHNG: యాదగిరిగుట్ట మండలం మల్లాపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సంత్ సేవాలాల్ మహరాజ్ బోధనలు సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు.
JN: వెల్దండ రిజర్వాయర్ నుంచి నర్మెట్ట, అమ్మాపురం, అక్కరాజుపల్లి, తరిగొప్పుల గ్రామాలకు కొమురవెల్లి దేవస్థాన కమిటీ చైర్మన్ గంగం నరసింహారెడ్డి నీటిని విడుదల చేశారు. రైతు సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ఆర్థిక ఇబ్బందులు ఉన్న రైతు రుణమాఫీ చేసినట్లు ఛైర్మన్ తెలిపారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.
KNR: ప్రజల ఫిర్యాదుల తక్షణ పరిష్కారమే లక్ష్యంగా కరీంనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన నూతన రిసెప్షన్, గ్రీవెన్స్ సెల్‌ను సిపి గౌష్ ఆలం బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రాఫిక్ ఉల్లంఘనలు, చలాన్లపై వాహనదారులు ఇక్కడ నేరుగా ఫిర్యాదు చేయవచ్చన్నారు. బాధితులకు నిర్ణీత కాలంలో న్యాయం చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
SRCL: గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ రూరల్ మండలం వట్టెంలలో గ్రామపంచాయతీ కార్యాలయ భవన నిర్మాణం పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం పల్లెల్లో మౌలిక సదుపాయాలు కల్పించే అంశంపై ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు.
BDK: అశ్వరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ బుధవారం విస్తృతంగా ప్రకటించారు. ముందుగా స్వయం సహాయక సంఘాల కోసం కమ్యూనిటీ భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన నిర్వహించారు. అనంతరం ఇటీవల ప్రారంభించిన మంచినీటి సరఫరా పథకాన్ని ప్రారంభించారు. మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని అభివృద్ధిలో నడపడమే లక్ష్యం అన్నారు.