• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

పేదలకు ఇల్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యం

BDK: పేద కుటుంబాలకు గృహ నిర్మాణ పథకాల ద్వారా సొంత ఇంటి కల నెరవేరుతోందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం మణుగూరు మండలం సాంబాయిగూడెం గ్రామంలో లబ్ధిదారులైన జబీనా ఇందిరమ్మ ఇంటి ప్రవేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రతి పేద కుటుంబం సురక్షితమైన నివాసంలో గౌరవప్రదంగా జీవించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నారు.

February 28, 2026 / 11:35 AM IST

బాల్య వివాహాలను అరికట్టాలి: ఎమ్మెల్యే

RR: బాల్య వివాహాలను అరికట్టే విషయంలో బాధ్యతగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. బాల్య వివాహ విముక్త ప్రచార రథయాత్రను షాద్‌నగర్ పట్టణంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లాలో నేటికీ బాల్య వివాహాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయని, వాటి నిర్మూలన కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

February 28, 2026 / 11:33 AM IST

ఘనంగా టైలర్స్ డే వేడుకలు

WGL: నర్సంపేట పట్టణంలో టైలర్స్‌డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ… టైలర్స్ యొక్క సమస్యలను ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించి వారి సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని, సమాజంలో టైలర్స్ పాత్ర కీలకమని అన్నారు. ఈ కార్యక్రమంలో టైలర్స్ అసోసియేషన్ నేతలు పాల్గొన్నారు.

February 28, 2026 / 11:32 AM IST

‘నారాయణఖేడ్ మున్సిపాలిటీ కృషి చేస్తా’

SRD: నారాయణఖేడ్ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని ఛైర్మన్ నగేష్ షెట్కార్ అన్నారు. పట్టణంలో శనివారం ఆయన పర్యటించారు. ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, మురుగు కాలపులు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నామని స్థానికులు ఛైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలు వెంటనే పరిష్కరించేలా చూడాలని అధికారులకు ఆదేశించారు.

February 28, 2026 / 11:30 AM IST

భూదాన్ భూముల బాధితులకు అండగా ఉంటాం: సీపీ

KMM: వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితులకు అండగా ఉంటామని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. బాధితుల నుంచి దోచుకున్న డబ్బును నిందితుల నుంచి రికవరీ చేసి తిరిగి భాదితులకు అప్పగిస్తామని చెప్పారు. ఇప్పటికే పలువురు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొత్తం 13 మందిపై నమోదు కేసుల నమోదు చేసి, నలుగురిని అరెస్ట్ చేశామన్నారు. నిందితులను వదిలేదేలేదన్నారు.

February 28, 2026 / 11:29 AM IST

మాది ఉద్యోగుల సంక్షేమ ప్ర‌భుత్వం: మంత్రి

MLG: మాది ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వమని మంత్రి సీతక్క అన్నారు. పంచాయతీ సెక్రటరీస్ సెంట్రల్ ఫోరం డైరీ & క్యాలెండర్లను నేడు మంత్రి సీతక్క ఆవిష్కరించారు. గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర ఎంతో కీలకమని, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తోందని అన్నారు.

February 28, 2026 / 11:29 AM IST

సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

ADB: ఇచ్చొడ మండలంలోని జామిడి గ్రామంలో రూ. 5లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు ఇవాళ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భూమి పూజ చేశారు. గ్రామస్తులు కోరిన కోరికలను తప్పకుండా నెరవేర్చి గ్రామాన్ని విడతల వారిగా అభివృద్ధి చేసే బాధ్యత నాది అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు నాయకులు ఉన్నారు.

February 28, 2026 / 11:26 AM IST

యాదాద్రి స్వామివారిని దర్శించుకున్న త్రిపుర గవర్నర్

BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని శనివారం త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం తెలిపి, దర్శనానంతరం వేద ఆశీర్వచనం తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

February 28, 2026 / 11:24 AM IST

‘బంజారాల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి’

ADB: బంజారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం, వారి హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని బంజారా జాగృతి మండలి రాష్ట్ర అధ్యక్షుడు భరత్ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సుభాష్ మహారాజ్‌కు ఆయన నియామక పత్రం అందజేశారు. భజన్ మండలి ద్వారా సామాజిక చైతన్యం తీసుకురావాలని, సమాజాభివృద్ధికి నిరంతరం కృషి చేయాలన్నారు.

February 28, 2026 / 11:20 AM IST

మృతులకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే వీరేశం

NLG: నకిరేకల్ పట్టణానికి చెందిన పంతంగి అంజమ్మ, యానాల రమాదేవిలు మృతి చెందారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం ఇవాళ వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయా కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆయనతో పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు ఉన్నారు.

February 28, 2026 / 11:20 AM IST

గాద ఇన్నయ్యకు పితృవియోగం

JN: జఫర్గడ్ మండల కేంద్రానికి చెందిన మాజీ మావోయిస్టు ‘మా ఇల్లు’ ఆశ్రమ నిర్వాహకుడు గాదె ఇన్నయ్య తండ్రి గాదె సాల్మోన్ రెడ్డి (97) శనివారం ఉదయం స్వగృహంలో అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు. అయితే ఇప్పటికే గత నెలలో ఇన్నయ్య తల్లి తేరేజమ్మ మరణించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మావోయిస్టు భావజాల వ్యాప్తి ఆరోపణలతో గాదె ఇన్నయ్య జైలులో ఉన్నారు.

February 28, 2026 / 11:18 AM IST

రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా తొలి స్థానం

ఖమ్మం జిల్లా రాష్ట్రంలో రైతు రిజిస్ట్రీలో తొలి స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 75.21% మంది రైతులు వివరాలు నమోదు చేసుకోగా వారం రోజుల్లో 100% పూర్తి చేయాలని లక్ష్యంగా వ్యవసాయశాఖ కృషి చేస్తోంది. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 53.15% మాత్రమే నమోదై రాష్ట్రంలో 30వ స్థానంలో ఉంది. కేంద్ర పథకాల లబ్ధికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని అధికారులు సూచించారు.

February 28, 2026 / 11:17 AM IST

విడతల వారిగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తా: ఎమ్మెల్యే

ADB: ఇచ్చోడ మండలంలోని జామిడి గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శనివారం హాజరై భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… గ్రామస్తులు కోరిన కోరికలను తప్పకుండా నెరవేర్చి గ్రామాన్ని విడతల వారిగా అభివృద్ధి చేసే బాధ్యత నాది అని అన్నారు. ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు.

February 28, 2026 / 11:16 AM IST

అన్నదాతలకు అందని మద్దతు ధర

జగిత్యాల జిల్లాలో పండే ప్రధాన పంటల్లో ఒకటైన పసుపు పంట రాజకీయ నాయకులకు ఎన్నికల్లో ఓట్ల ఏటీఎం గానే పనిచేస్తుంది. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పిస్తామని ఇచ్చిన నాయకుల హామీలు నీటి మూటలుగానే నిలుస్తున్నాయి. జిల్లాలో సుమారు 10 వేల ఎకరాల్లో పసుపు పంట సాగవుతుండగా, ప్రస్తుతం క్వింటాల్ పసుపు రూ. 9వేల-రూ.14వేల వరకు మాత్రమే ధర పలుకుతుంది.

February 28, 2026 / 11:15 AM IST

న్యాయవగాహన సదస్సు

మహబూబ్నగర్ రూరల్ ధర్మాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. పిఎల్వి శివన్న పంతులు మాట్లాడుతూ.. బాల్యవివాహాలు, డ్రగ్స్, రోడ్డు భద్రత, విద్య, సైబర్ నేరాలు, వరకట్నం, బాల కార్మికులు, తదితర చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఉచిత న్యాయ సహాయం అందించేందుకు న్యాయ సేవా అధికార సంస్థ అండగా ఉంటుందన్నారు.

February 28, 2026 / 11:13 AM IST