KMR: బాన్సువాడలో జనసేన ఇన్‌ఛార్జ్ రవీందర్ చౌహన్ పట్టణంలోని గౌలిగూడ హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు చేసి జనసేన సభ్యత్వాన్ని ప్రారంభించారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి జన సైనికుడికి రూ.ఐదు లక్షలు బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేసి అధికారం దిశగా అడుగులు వేస్తామన్నారు.
BDK: కరకగూడెం మండలంలో ఇవాళ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొంటారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రారంభిస్తారని అలాగే పలు అభివృద్ధి, వివాహ వేడుకల్లో కార్యక్రమాల్లో పాల్గొంటారని అన్నారు. ఎమ్మెల్యే పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.
ADB: పట్టణంలోని రైల్వే స్టేషన్ నుంచి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో సెల్ ఫోన్ లాక్కున్న ఘటనలో ఆరుగురు నిందితులు కేసు నమోదు చేసినట్లు CI నాగరాజు నిన్న తెలియజేశారు. పట్టణానికి చెందిన బాధితుడు కనిష్క్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిని అరెస్టు చేశామన్నారు. అనుమతి లేకుండా షాపు యజమానులు సెల్ ఫోన్లను కొనవద్దని CI సూచించారు.
JN: చిల్పూరు గుట్ట బుగులు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా నేడు స్వామివారి కళ్యాణ మహోత్సవం. ఈ కార్యక్రమాన్ని అంగరంగా వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఛైర్మన్ శ్రీధర్ రావు తెలిపారు. స్వామివారి కళ్యాణానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
KMM: వివాదాస్పద అంశాలతో ఉన్న 8వ తరగతి సామాజిక శాస్త్ర పుస్తకాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్య విజయమని AISF KMM జిల్లా కార్యదర్శి ఇటుకల రామకృష్ణ అన్నారు. కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలను కేంద్రం మానుకోవాలని హితవు పలికారు.
HYD: చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు సౌందరరాజన్ అంత్యక్రియలు ఇవాళ జరుగనున్నాయి. ఆలయం వెనుకభాగంలోని గోశాల పక్కన దహన సంస్కారాలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటలకు అంతిమయాత్ర మొదలవుతుందని తెలిపారు. సౌందరరాజన్ మరణించడంతో చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని శుక్రవారం మధ్యాహ్నం నుంచి మూసివేశారు. ఇవాళ ఆలయం మూసి ఉంటుందని అర్చకులు తెలిపారు.
BHPL: రేగొండ మండల కేంద్రంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు దంపతులు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ హాజరై ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లాలో స్త్రీ నిధి బకాయిలను తక్షణమే రికవరీ చేయాలని డీఆర్డీఓ కాళిందిని సిబ్బందిని ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశం మందిరంలో స్త్రీనిధి సిబ్బందితో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. మార్చి 5లోపు 100% రికవరీ, 100% రుణ ప్రణాళిక పూర్తి చేయాలని తెలిపారు. లేనియెడల వేతనాలు నిలిపివేసి, శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
WGL: పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో మత్తు పదార్థాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్య శారద పోలీస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా నార్కోటిక్ కమిటీ సమావేశంలో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి ఆమె సమీక్షించారు. మత్తు పదార్థాల విక్రయదారులను కనిపెట్టాలాని సూచించారు.
ASF: రోడ్డు భద్రత నియమాలపై ప్రజలకు అవగాహనకై పోలీసులు వినూత్నంగా నాటక ప్రదర్శన చేపట్టారు. రెబ్బెన మండలం నంబల గ్రామంలో నిర్వహించిన కార్యక్రమానికి SP నితిక పంత్ హాజరయ్యారు. అతివేగం, మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల కలిగే అనర్ధాలను కళాకారులు నాటిక రూపంలో కళ్లకు కట్టినట్లు వివరించారు. ఒక్క రోడ్డు ప్రమాదం ఒక నిండు కుటుంబాన్ని రోడ్డపడేస్తుందని SP అన్నారు.
MHBD: అప్రమత్తతోనే ప్రమాదాలకు అడ్డుకట్ట వేయవచ్చని తొర్రూర్ డీఎస్పీ కృష్ణ కిషోర్ అన్నారు. శుక్రవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాహనదారులు హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. అతివేగం, పరిమితికి మించి ప్రయాణికులతో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పువన్నారు.
SRCL: కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో రంజన్ మాసంలో శుక్రవారం ఉపవాసం ఉండి, మజీద్‌లో ప్రార్థనలు చేసి, గ్రామ ప్రజలందరూ బాగుండాలని కోరుకున్నారు. ఉప సర్పంచ్ తిక్కల నవీన్ మాట్లాడుతూ.. రంజన్ రోజా (ఒక్కపొద్దు)లో పాల్గొని సాయంత్రం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లింలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
HNK: వరంగల్ నగర పారిశుద్ధ్య నిర్వహణలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) పాత్ర అత్యంత కీలకమని హనుమకొండ కలెక్టర్, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. శుక్రవారం బల్దియా కార్యాలయంలోని ఐసీసీసీ కేంద్రంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంశంపై అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. శానిటేషన్ ప్రక్రియను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.
ASF: రెబ్బెన మండలం దుర్గాపూర్‌కు చెందిన మడావి అజయ్ (18) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై వెంకట కృష్ణ వివరాలు బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న అజయ్ 2 సంవత్సరాలుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. గత నెల 27న వైద్యం కోసం వెళ్లి పురుగు మందు తాగాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆసుపత్రిలో చికిత్స చేయిస్తుండగా శుక్రవారం రాత్రి మృతి చెందాడు.
VKB: రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా పోలీస్ శాఖ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఘనంగా ప్రారంభించారు. నిన్న పట్టణంలోని సత్యభారతి హాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంటి వైద్య శిబిరం, రోడ్డు భద్రతా అవగాహన సదస్సుకు హాజరై మాట్లాడారు. డ్రైవర్ల కంటి చూపు బాగున్నప్పుడే సురక్షిత ప్రయాణం ఉంటుందన్నారు.