• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి’

WGL: గ్రేటర్ వరంగల్ లోని శివనగర్ కాలనీలో ఉన్న శ్రీ శివ భక్త మార్కండేయ ఆలయ ద్వితీయ వార్షిక మహోత్సవాలు రేపు (సోమవారం), ఎల్లుండి (మంగళవారం) ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు మల్లయ్య తెలిపారు. ఇవాళ ఆలయ ప్రాంగణంలో వార్షిక మహోత్సవాల కరపత్రలను ఆవిష్కరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

February 22, 2026 / 07:40 PM IST

ఉమ్మడి జిల్లా నిరుద్యోగులకు శుభవార్త..!

WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో HNK జిల్లా కేంద్రంలో మార్చి 5వ తేదీన ఏటూరునాగారం ITDA ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ITDA PO చిత్ర మిశ్రా ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. అర్హత గల నిరుద్యోగులు ఉదయం 10:00 లోపు గిరిజన భవన్‌కు విద్యఅర్హత పత్రాలతో హాజరుకావాలని ఆమె సూచించారు.

February 22, 2026 / 07:40 PM IST

పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న విప్

SRCL: వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామంలో జరుగుతున్న పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు.

February 22, 2026 / 07:39 PM IST

ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులకు అవగాహన

నారాయణపేట పట్టణంలోని వీర సావర్కర్ చౌరస్తాలో ఆదివారం వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించినట్లు ట్రాఫిక్ ఎస్సై కృష్ణ చైతన్య తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి వాహనదారుడి బాధ్యత అని అన్నారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని, వాహనాలు నడిపే సమయంలో సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించాలని చెప్పారు. అలాగే యువకులు ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదన్నారు.

February 22, 2026 / 07:33 PM IST

గండిగూడెంలో నూతన రామాలయానికి భూమి పూజ

SRD : అమీన్ పూర్ డివిజన్ గండిగూడెం కాలనీలో నూతన శివ పంచాయతం రామాలయం, ఆంజనేయస్వామి దేవాలయాల నిర్మాణాలకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఆయన దేవాలయాల నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నిర్మాణ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

February 22, 2026 / 07:33 PM IST

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఆవుల రాజిరెడ్డి

MDK: శివంపేట మండలం గుండ్లపల్లిలో ఆదివారం ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు నర్సాపూర్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, లబ్ధిదారులను అభినందించారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి అర్హులైన కుటుంబానికి సొంత ఇంటి కలను సాకారం చేయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

February 22, 2026 / 07:32 PM IST

కాంగ్రెస్ పార్టీలో చేరిన కులాస్పూర్ సర్పంచ్

NZB: మోపాల్ మండలం కులాస్పూర్ సర్పంచ్ గుడి జనార్దన్రెడ్డి నిజామాబాద్ రూరల్ MLA రేకులపల్లి డాక్టర్ భూపతి రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముప్ప గంగా రెడ్డి, తాడేం సర్పంచ్ జలేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

February 22, 2026 / 07:32 PM IST

గుర్రపుడెక్కతో నిండిపోవడంతో రైతుల ఆందోళన

PDPL: మంథని పట్టణంలోని బొక్కలవాగు చెక్‌డ్యాం గుర్రపుడెక్క, పిచ్చిమొక్కలతో పూర్తిగా కప్పుకుపోయింది. ఇరువైపులా భారీగా పెరగడంతో నిల్వ నీరు తగ్గిపోతుందని రైతులు చెబుతున్నారు. గుర్రపుడెక్క అధికంగా నీటిని పీల్చుకోవడంతో సాగునీటి సరఫరా దెబ్బతింటుందనే ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణం మొక్కలను తొలగించి చెక్‌డ్యాం పరిసరాలను శుభ్రం చేయాలని కోరుతున్నారు.

February 22, 2026 / 07:31 PM IST

డ్రైనేజ్ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాం: సర్పంచ్

BHPL: మొగుళ్లపల్లి మండలం ముల్కలపల్లి గ్రామంలో ఆదివారం గ్రామ సర్పంచ్ నాంపల్లి శ్రీవాణి రమేష్ ఆధ్వర్యంలో GP సిబ్బంది డ్రైనేజ్ కాలువలోని చెత్తా చెదారాన్ని శుభ్రం చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ.. డ్రైనేజీ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని సర్పంచ్ పేర్కొన్నారు. గ్రామంలో మంచినీటి సరఫరాకు ఆటంకం కలగకుండా పైప్‌లైన్ లీకేజీ మరమ్మతులు చేపట్టినట్లు తెలిపారు.

February 22, 2026 / 07:28 PM IST

మృతుడి కుటుంబానికి అండగా తోటి గల్ఫ్ కార్మికులు

JGL: రాయికల్ మండలంలోని అల్లీపూర్ గ్రామానికి చెందిన కట్ట గంగన్న ఇటీవల సౌదీ దేశంలో మరణించాడు. విషయం తెలుసుకున్న సౌదీ అల్లీపూర్ సంఘం సభ్యులు ఆదివారం అందరు కలిసి గంగన్న భార్యకు రూ. 1,36,830 ఆర్థిక సహాయం అందించారు. గంగన్న కుటుంబానికి ఎల్లవేళలా తోడుగా ఉంటామని వారు భరోసానిచ్చారు. ఈ సందర్భంగా వారిని గ్రామస్థులు అభినందించారు.

February 22, 2026 / 07:26 PM IST

‘అన్ని మతాలను కలుపుకొని కాంగ్రెస్ నడుస్తుంది’

BDK: అశ్వరావుపేట మున్సిపాలిటీ ఎన్నికలలో మున్నూరు కాపు కౌన్సిలర్ల సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదినారాయణ ఆదివారం పాల్గొన్నారు. రానున్న కాలంలో అన్ని కులాలు, మతాలు కలుపుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. వారితోపాటు జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ పసుపులేటి వీరబాబు, మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ జూపల్లి రమేష్ పాల్గొన్నారు.

February 22, 2026 / 07:25 PM IST

మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

వనపర్తి జిల్లా పెద్ద మునగాళ్ చేడ్ గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న మహిళా సమాఖ్య భవన నిర్మాణాలకు ఆదివారం వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి భూమి పూజ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని ఆయన తెలిపారు. ఐదేళ్ల కాలంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే చెప్పారు.

February 22, 2026 / 07:25 PM IST

బీఆర్ఎస్ బలోపేతానికి కార్యకర్తల సమీక్ష

HNK: జిల్లా కాజీపేట మండల కేంద్రంలో ఆదివారం బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని మాజీ డివిజన్ అధ్యక్షులు కుమ్మరి రాజేందర్ ప్రారంభించారు. ఈ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో బూత్ కమిటీల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సభ్యులు చర్చించారు. ఈ సమావేశంలో ముఖ్య నాయకులు పాలు అడుగుల శివకుమార్ పాల్గొన్నారు.

February 22, 2026 / 07:24 PM IST

సర్వీస్ రోడ్డు సమస్యను పరిష్కరించిన కౌన్సిలర్

BHNG:  భువనగిరి 12వ వార్డు పగిడిపల్లిలో గత 15 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సర్వీస్ రోడ్డు సమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది. కడమంచి రాములు ఇంటి వద్ద ఆగిపోయిన రోడ్డు పనుల గురించి ఆదివారం కౌన్సిలర్ తోటకూర విజయలక్ష్మి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఒప్పించారు. గ్రామ పెద్దలు, యువత సహకారంతో అడ్డంకులను తొలగించి సర్వీస్ రోడ్డును క్లియర్ చేశారు.

February 22, 2026 / 07:23 PM IST

‘యూరియా యాప్‌ను రద్దు చేయాలి’

NLG: యూరియా కొరతపై సీపీఎం నల్గొండ పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య ఆందోళన వ్యక్తం చేశారు. పంటలు పొట్టదశలో ఉన్న తరుణంలో రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని, సాంకేతిక అవగాహన లేక యాప్ ద్వారా కొనుగోలు చేయలేకపోతున్నారని పేర్కొన్నారు. రైతులకు ఇబ్బందికరంగా పరిణమించిన యూరియా యాప్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

February 22, 2026 / 07:22 PM IST