• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

స్వర్ణోత్సవాలకు కేయూ సిద్ధం..!

వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయాన్ని 1976లో స్థాపించారు. 50వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా స్వర్ణోత్సవాలకు సిద్ధమవుతోంది. ఉన్నత విద్యను అందిస్తూ NAAC నుంచి A+ గ్రేడ్ గుర్తింపు పొందింది. 27 విభాగాలు, అనేక అనుబంధ కళాశాలలతో ఇంజినీరింగ్, ఫార్మసీ, ఆర్ట్స్, సైన్స్‌లో సుమారు 95+ కోర్సులను అందిస్తోంది.UG, PG, Ph.Dతో పాటు దూరవిద్య కోర్సులు అందిస్తుంది.

February 22, 2026 / 10:02 AM IST

సీఎం రేవంత్ రెడ్డి పర్యటన వివరాలు ఇలా..

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇవాళ CM రేవంత్ రెడ్డి పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యహ్నం 1:30 గం HYD నుంచి MHBD జిల్లాకు రానున్నారు. మ. 2:15 గంగారం మండలం రెడ్యాల గ్రామానికి వెళ్తారు. 3 గం ములుగు జిల్లాకు రానున్నారు. 3:30 దేవాదాల ప్రాజెక్టును పరిశీలించి అక్కడ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. సాయత్రం 5 గంటలకు HYDకి తిరిగి వెళ్తారు.

February 22, 2026 / 10:00 AM IST

‘నీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు’

ఆదిలాబాద్ పట్టణంలో వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి తలెత్తకుండా మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. కెఆర్‌కె కాలనీలో కౌన్సిలర్ రజిత రాము ఆధ్వర్యంలో నిరుపయోగంగా ఉన్న బోరింగులకు మరమ్మతులు చేయించారు. ఆమె మాట్లాడుతూ.. ఎండాకాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు.

February 22, 2026 / 09:59 AM IST

జాతీయ స్థాయికి రెండు పాఠశాలలు

KMR: జాతీయ స్థాయిలో స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్ (SHVR) 2025-26లో భాగంగా జిల్లా నుంచి TSNR ZPHS బాయ్స్ బీబీపేట్, MPPS మహమ్మదాపూర్ పాఠశాలలు రాష్ట్ర స్థాయిలో ఎంపికై జాతీయ స్థాయికి నామినేట్ అయినట్లు DEO రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఇరు పాఠశాల హెచ్ఎంలను ఆయన అభినందించారు. జాతీయ స్థాయిలో కూడా సెలెక్ట్ అయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

February 22, 2026 / 09:58 AM IST

జిల్లాలో నేటి మాంసం ధరల వివరాలు..!

కామారెడ్డి జిల్లా కేంద్రంతోపాటు పలు మండలాలలో ఆదివారం చికెన్, మటన్ ధరల వివరాలు ఇలా ఉన్నాయి. మటన్ ధర కిలో రూ.800 చొప్పున విక్రయిస్తుండగా, చికెన్ స్కిన్ లెస్ కిలో రూ.250 నుంచి రూ.260 మధ్య విక్రయిస్తున్నారు. కోడి కిలో రూ.170 చొప్పున విక్రయిస్తున్నారు. గత వారంతో పోలిస్తే చికెన్ ధర కాస్త తగ్గుముఖం పట్టింది. మటన్ ధరలలో ఎలాంటి మార్పు లేదు.

February 22, 2026 / 09:55 AM IST

చెరువులో దూకి మహిళా ఆత్మహత్య

RR: మహిళ ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన షాబాద్ మండల పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు తాళ్లపల్లి గ్రామానికి చెందిన నందిని అనే వివాహిత నాగుల చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 22, 2026 / 09:55 AM IST

జిల్లాలో చికెన్ ధరలు ఇవే

SRCL: జిల్లాలో చికెన్ ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్కిన్ చికెన్ కేజీ ధర రూ. 206 నుంచి రూ. 230 మధ్య ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ కేజీ ధర రూ. 234 నుంచి రూ. 260 వరకు పలుకుతోంది. గత వారంతో పోలిస్తే రూ. 5 వరకు తగ్గిందని విక్రయదారులు తెలిపారు.

February 22, 2026 / 09:54 AM IST

పుష్కరిణి వద్ద క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం

RR: మహాశివరాత్రి జాతర సందర్భంగా సంత్ నిరంకార్ ఆధ్వర్యంలో చేవెళ్ల వెంకటేశ్వర పుష్కరిణి వద్ద శ్రమదానంతో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ సమతా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, జాతరకు వచ్చే భక్తులు పరిశుభ్రతను కాపాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పాల్గొన్నారు.

February 22, 2026 / 09:51 AM IST

రైలు ఎక్కుతూ ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆదివారం జరిగిన ప్రమాదంలో ఓ ప్రయాణికుడు మృతి చెందాడు. కదులుతున్న రైలు ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలిలోనే ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడంతో ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. రైల్వే పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

February 22, 2026 / 09:51 AM IST

ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల చెల్లింపులో జాప్యం లేదు

జగిత్యాల రూరల్ మండల పరిధిలోని కల్లెడ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపుపై వస్తున్న వార్తలపై మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీవో రమాదేవి స్పందించారు. ఆధార్ కార్డు మిస్ మ్యాచింగ్ వల్లనే బిల్లులు ఆగావని, లబ్ధిదారులు ఆపపోహలు నమ్మవద్దని అర్హులైన లబ్ధిదారులకు బిల్లులు వస్తాయని హామీ ఇచ్చారు.

February 22, 2026 / 09:50 AM IST

నేడు బాధ్యతలు స్వీకరించనున్న చైర్మన్

BHPL: జిల్లా మున్సిపాలిటీ ఛైర్మన్‌గా బుర్ర కొమరయ్య నేడు పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించి ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఇవాళ స్థానిక హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అక్కడి నుంచి విజయోత్సవ ర్యాలీతో మున్సిపల్ కార్యాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు బాధ్యతలు చేపట్టనున్నారు.

February 22, 2026 / 09:48 AM IST

శవాన్ని దోచుకున్న దొంగలు అరెస్ట్

MBNR: ప్రమాదంలో మరణించిన లేదా అపస్మారక స్థితిలో ఉన్న బాధితుల వద్ద ఉన్న నగలు, నగదును దోచుకుంటున్న ఇద్దరు వ్యక్తులను షాద్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 17 రాత్రి రాయికల్ టోల్ ప్లాజా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన పురుషోత్తం రెడ్డి మృతదేహంపై ఉన్న బంగారు నగలు కనిపించకపోవడంతో అతని సోదరుడు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు నిందుతులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

February 22, 2026 / 09:47 AM IST

ఉషన్నపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి పురస్కారం

PDPL: కాల్వ శ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్యకు 2026 ఏడాదికి గాను ప్రతిష్ఠాత్మక ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సేవా పురస్కారం’ వరించింది. విద్యా, సాహిత్య, సామాజిక రంగాల్లో ఆయన చేసిన కృషికిగాను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. ‘మధురిమలు’ కవితా ప్రక్రియ ప్రోత్సాహం గుర్తించామన్నారు.

February 22, 2026 / 09:47 AM IST

‘పులి పాదముద్రలు కనిపిస్తే సమాచారం అందించాలి’

BDK: ఎక్కడైనా పులి పాదముద్రలు కనిపిస్తే అటవీ అధికారులకు సమాచారం అందించాలని డీఎఫ్ఓ కృష్ణ గౌడ్ కోరారు. జిల్లా అటవీ ప్రాంతంలోకి పులి ప్రవేశించినట్లు ధ్రువీకరించారు. గతంలో సంచరించిన పులి కాకుండా, ఇది కొత్తదని గుర్తించినట్లు ఆయన నేడు తెలిపారు. ఈ నేపథ్యంలో పశువుల కాపర్లు, రైతులు అటవీ ప్రాంతంలోకి ఒంటరిగా వెళ్లవద్దని, గుంపులుగా వెళ్లాలని సూచించారు.

February 22, 2026 / 09:47 AM IST

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘ఖాకీ కిడ్స్’ కార్యక్రమం

ఆదిలాబాద్ జిల్లాలో ‘అరైవ్ ఆలైవ్’లో భాగంగా ఎస్పీ అఖిల్ మహాజన్ ‘ఖాకీ కిడ్స్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఒక కానిస్టేబుల్ వారానికి 3 పాఠశాలల్లో సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారని తెలిపారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడంపై అవగాహన పొందిన విద్యార్థులకు ప్రత్యేక బ్యాడ్జీలు అందజేస్తామన్నారు.

February 22, 2026 / 09:45 AM IST