• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

టాలెంట్ టెస్ట్‌లో పల్వంచ విద్యార్థిని టాప్

KMR: పల్వంచ మండలానికి చెందిన జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థిని విద్యాశ్రీ జిల్లా స్థాయి బయోసైన్స్ టాలెంట్ టెస్ట్‌లో టాపర్‌గా నిలిచింది. కామారెడ్డిలో నిర్వహించిన పరీక్షలో మొత్తం 97 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యాశ్రీని జిల్లా విద్యాధికారి రాజు, మెమెంటోతో సత్కరించినట్లు ప్రధానోపాధ్యాయులు గోవర్ధన్ రెడ్డి తెలిపారు.

February 26, 2026 / 09:39 AM IST

నేడు అదిలాబాద్‌లో వాహనాల వేలం పాట

ఆదిలాబాద్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలలో వివిధ కేసులు పట్టుబడిన వాహనాలకు గాను గురువారం వేలం పాట నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ విజేందర్ తెలిపారు. 15 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో వేలం వేయనన్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ప్రభుత్వం నిర్దేశించబడిన ధరావతు సొమ్మును చెల్లించి బహిరంగ వేలం పాటలు పాల్గొనవచ్చు అని వెల్లడించారు.

February 26, 2026 / 09:39 AM IST

మందుబాబుకు ఐదు రోజుల జైలు శిక్ష

NZB: డ్రంక్&డ్రైవ్లో పట్టుబడిన వ్యక్తికి కోర్టు ఐదు రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై శైలేందర్ తెలిపారు. మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో వేంపల్లికి చెందిన అదిగేమ్ రాజేశ్వర్ మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు. బుధవారం నిందితుడిని ఆర్మూర్ జేఎఫ్‌సీఎం మేజిస్ట్రేట్ భవ్యశ్రీ ఎదుట హాజరుపరచగా,ఐదు రోజుల సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.

February 26, 2026 / 09:34 AM IST

నిర్మల్ అదనపు కలెక్టర్ బదిలీ

నిర్మల్ అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనను మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్)గా బదిలీ చేయగా, జిల్లాలో తన పదవీ కాలంలో సమర్థవంతంగా సేవలు అందించిన ఫైజాన్ అహ్మద్, త్వరలోనే కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు.

February 26, 2026 / 09:32 AM IST

పంచాయతీ బకాయిలు రావడంలేదని ఆందోళన

GDWL: ఇటిక్యాల మండలంలో పంచాయతీల బకాయిలు విడుదలకావడంతో క్రిత సర్పంచులు ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాలను నెట్టుకుంటున్నారు. 32 గ్రామాలు ఉన్న మండలంలో ఒక్కో పంచాయతీకి సుమారు రూ.20–25 లక్షల బకాయిలు రావాల్సినప్పటికీ, పారిశుద్ధ్య, సీసీ రోడ్, ట్రాక్టర్ పనులకు ఖర్చు చేసిన పెండింగ్ బిల్లులు ఇంకా రావడం లేదని అధికారులు, సర్పంచులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

February 26, 2026 / 09:28 AM IST

HYDలో మసాజ్ పేరుతో వ్యభిచారం..!

HYD: మహానగరంలో “మసాజ్ సెంటర్ల” పేరుతో వ్యభిచారం నడుస్తున్నట్లు పలు కేసుల్లో వెలుగుచూసింది. రూ. లక్ష వరకు ఇస్తామని చెప్పి బంగ్లాదేశ్, థాయిలాండ్ ప్రాంతాల నుంచి మహిళలను నిర్వాహకులు రప్పిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బ్యూటీ పార్లర్ ముసుగులోనూ ఈ అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయి. ఇలాంటి వాటిపై పోలీసులు నిరంతర నిఘా ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు.

February 26, 2026 / 09:26 AM IST

కలుషిత నీటి తొట్టెతో కాలనీవాసుల్లో ఆరోగ్య ఆందోళన

VKB: పులుమడ్డిలోని ఎస్సీ కాలనీలో తాగునీటి తొట్టె నెలలుగా శుభ్రం చేయకపోవడంతో నీరు నాచుపట్టి దోమల పెంపక కేంద్రంగా మారింది. దీనివల్ల మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు భయపడుతున్నారు. సమస్యపై పలుమార్లు తెలియజేసినా స్పందన లేదని తెలిపారు. వెంటనే తొట్టెను శుభ్రం చేసి స్వచ్ఛమైన నీరు అందించాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.

February 26, 2026 / 09:23 AM IST

ఆసుపత్రిని సందర్శించిన కాయకల్ప అవార్డు బృందం

MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను బుధవారం కాయకల్ప అవార్డు బృందం సందర్శించారు. డాక్టర్ విజయ శంకర్ ఆధ్వర్యంలోని బృందం ఆస్పత్రిలో రోగులకు అందుతున్న సేవలను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు, ఆస్పత్రిలో మౌలిక వసతులు, మందుల నిలువలు, శుభ్రత, శానిటేషన్, ప్లాంటేషన్, పరిసరాల పరిశుభ్రతను వారు పరిశీలించారు.

February 26, 2026 / 09:23 AM IST

మాదకద్రవ్యాల రవాణాపై గట్టిగా నిఘా పెట్టాలి: కలెక్టర్

MBNR: మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై గట్టి నిఘా పెట్టాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో విద్య పోలీసు ఎక్సైజ్ శాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. హై స్కూల్ ఇంటర్మీడియట్ స్థాయి విద్యార్థుల కార్యకలాపాలపై పర్యవేక్షణ కొనసాగించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.

February 26, 2026 / 09:20 AM IST

పరీక్షా కేంద్రాల వద్ద ఇవి బంద్

VKB: జిల్లాలో నేడు ఇంటర్ 2nd ఇయర్ పరీక్షకు 8,006 మంది విద్యార్థులు హాజరుకానునట్లు జిల్లా ఇంటర్ బోర్డు నోడల్ అధికారి తెలిపారు. గురువారం లాంగ్వేజ్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఇందుకు 28 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించామన్నారు.

February 26, 2026 / 09:18 AM IST

‘నిందితులను కఠినంగా శిక్షించాలి’

నాగర్‌కర్నూలు జిల్లా కుమ్మెరలోని మల్లన్న జాతరలో కుల వివక్షతో రజక సంఘం కుటుంబంపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని దొమ్మాట యువకులు అన్నారు. దౌల్తాబాద్ మండలం దొమ్మాటలో యువకులు పసికందు మృతికి నిరసనగా గ్రామంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

February 26, 2026 / 09:17 AM IST

‘ప్రయోగాల ద్వారానే విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం’

KNR: ప్రయోగాల ద్వారానే విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, ప్రశ్నించే తత్వం పెరుగుతాయని ఏంఈవో రవీంద్రచారి అన్నారు. సైదాపూర్ మండలం వెన్కేపల్లి హైస్కూల్లో భౌతిక, జీవశాస్త్ర టీచర్స్‌కి ‘బెలూన్ కార్ ఛాలెంజ్’ పై అవగాహన కల్పించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో ఈ కార్యక్రమం జరుగుతోందన్నారు. ప్రయోగాత్మక బోధనతో పిల్లలు సులభంగా నేర్చుకుంటారన్నారు.

February 26, 2026 / 09:14 AM IST

నేడు పదర మండలానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు రాక

NGKL: జిల్లా పదర మండల కేంద్రానికి నేడు పలువురు ఎంపీలు మల్లురవి, అనిల్ కుమార్, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, తలసాని శ్రీనివాస్ యాదవ్, నవీన్ యాదవ్, పలువురు మాజీ ఎమ్మెల్యేలు పర్యటిస్తారని యాదవ సంఘం నేతలు తెలిపారు. గత నాలుగు రోజులుగా పదరలో నిర్వహిస్తున్న శ్రీ కృష్ణ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు.

February 26, 2026 / 09:09 AM IST

కర్ల రాజేష్ మృతదేహానికి రీ పోస్టుమార్టం

SRPT: పోలీస్ లాకప్‌లో మృతి చెందిన కోదాడ పట్టణానికి చెందిన కర్ల రాజేష్ మృతదేహానికి ఈనెల 27న రీ-పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఎమ్మార్పీఎస్ ఆందోళనలు, జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశాల మేరకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్య బృందం ఆధ్వర్యంలో కోదాడలో ఈ ప్రక్రియ జరగనుంది.

February 26, 2026 / 09:08 AM IST

అభివృద్ధి పనులను అడ్డుకున్న వారిపై ఫిర్యాదు

MNCL: కన్నెపల్లి మండలం నాయకంపేట గ్రామపంచాయతీలో అభివృద్ధి పనులను అడ్డుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ ఒడ్డెటి పద్మ-అశోక్, గ్రామస్థులు కోరారు. ఈ మేరకు SIకి ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ.. NREGS కింద రూ. 5 లక్షల విలువగల CC రోడ్డు మంజూరు కాగా రోడ్డు పని ప్రారంభించే సమయంలో ముగ్గురు వ్యక్తులు పనులు అడ్డుకొని గొడవ చేసారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

February 26, 2026 / 09:07 AM IST