PDPL: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో రంజాన్ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ హాజరై ముస్లిం మత పెద్దల సమస్యలను తెలుసుకున్నారు. గతంతో పోలిస్తే ఈసారి రంజాన్ వేడుకలను మరింత ఘనంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. నగర మేయర్ మహంకాళి స్వామి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆర్జీ-1 జీఎం, వన్ టౌన్ సీఐ ఉన్నారు.
MNCL: జన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి బీసీ కులాల ఐక్య ఉద్యమ పోరాట సంఘం నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న దీక్షకు మద్దతుగా వారు శుక్రవారం స్థానిక అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు. బీసీల సంక్షేమానికి ప్రభుత్వం రూ. 50 వేల కోట్లను కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఉన్నారు.
జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు కథారచనలను ఆహ్వానిస్తున్నట్లు డీఈవో రాము శుక్రవారం తెలిపారు. కథల్లో నైతిక విలువలు, మానవతా భావాలు, నీతినిజాయితీ వంటి అంశాలు ప్రతిఫలించాలన్నారు. పాఠశాల స్థాయిలోనే కథారచన అలవాటు పెంపొందితే భవిష్యత్తులో మంచి రచయితలుగా ఎదుగుతారన్నారు.
HYD: వైసీపీ నేత, ఏపీ మండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దీంతో ఆయనను నిన్న హైదరాబాద్‌కు తరలించారు. బంజారాహిల్స్ సిటీ న్యూరో సెంటర్‌లో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బొత్స ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ADB: రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏఒక్కటి అమలు చేయలేదని, పాలనా చేయడం చేతకాకుంటే రాజీనామా చేయాలని బీజేపీ మండలాధ్యక్షుడు భిక్కు రాథోడ్ అన్నారు. శుక్రవారం నార్నూర్ మండల కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 హామీలు అమలు చేయకుంటే జిల్లా కేంద్రంలో భారీగా ధర్నా, రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు.
SRCL: ఇల్లంతకుంట మండలం గొల్లపల్లి గ్రామంలో సర్పంచ్ రడం లక్ష్మి ఆధ్వర్యంలో పశువులకు ఉచిత వైద్య శిబిరం శుక్రవారం నిర్వహించారు. పశు వైద్య అధికారుల బృందం పశువులను పరీక్షించి అవసరమైన మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో EO DLDA శ్రీదేవి, వైద్యాధికారులు ఇందిరా, పూర్ణచంద్రిక, ఉప సర్పంచ్ ఓరుపుల లక్ష్మన్, వార్డ్ సభ్యులు పత్రీ అంజయ్య, దాసరి ఎల్లయ్య, రడం నాగయ్య పాల్గొన్నారు.
NGKL: చెంచుపెంటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆర్డీటీ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. చెంచుపెంటలో చేపట్టిన ఇంటింటి సర్వేను సమర్థవంతంగా పూర్తి చేయాలని సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో ఐటీడీఏ, గృహ నిర్మాణ శాఖల అధికారులు, RDT ప్రతినిధులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు.
NZB: సాలూర మండలం మందార్నా గ్రామంలో ట్రాక్టర్ యజమానులు నిరసన చేపట్టారు. నూతన ఇసుక విధానం మన ‘ఇసుక వాహనం’ రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ నూతన విధానం వల్ల స్థానిక వాహన యజమానులకు అన్యాయం జరుగుతోందని సాలూర ఇంఛార్జ్ తహసీల్దార్ అనూషకు తమ గోడును చెప్పుకున్నారు. అయితే, ఈ సమస్యను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తానని తహసీల్దార్ తెలిపారు.
NLG: దేవరకొండ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్‌ను 14వ వార్డు కౌన్సిలర్ గాజుల సావిత్రి మురళీ, వడ్డెర సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పట్టణంలో వడ్డెర సంఘ భవన నిర్మాణానికి స్థలం కేటాయించి, నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు.
VKB: శుక్రవారం కొడంగల్ మండల పర్సాపూర్ రైతు వేదికలో నూనె గింజల సాగు లాభాలను వివరిస్తూ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. TRVK కోఆర్డినేటర్ డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. పంటల మార్పిడి కింద నూనె గింజల సాగు రైతులకు పెట్టుబడి ఆదా, చీడపీడల తగ్గింపు వంటి ప్రయోజనాలను ఇస్తుందన్నారు. కార్యక్రమంలో ADA శంకర్ రాథోడ్, AO శ్రీలత, EEOలు, స్థానిక రైతులు పాల్గొన్నారు.
RR: గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమైందని ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో షాద్‌నగర్ నియోజకవర్గంలోని సర్పంచ్‌లకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులకు ఆయన హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పారిశుద్ధ్యం, మౌలిక వసతుల ఏర్పాట్లకు ముందుండి ప్రజలను మెప్పించి మరింత ఉన్నత పదవులకు చేరుకోవాలన్నారు.
MDK: రెండవ విడత అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మెదక్ ఆర్టీసీ డిపోలో కంటి పరీక్షల శిబిరాన్ని అదనపు ఎస్పీ మహేందర్, ఆర్టీసీ డీఎం సురేఖ, సీఐ మహేష్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌లు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటించాలని కోరారు. నియమాలను పాటించడంతో ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు.
SRPT: కోదాడ పట్టణ పారిశుద్ధ్యానికి ప్రజలు సహకరించాలని కోదాడ మున్సిపల్ ఛైర్‌పర్సన్ కుసుమ వెంకట్ రత్నం బాబు అన్నారు. శుక్రవారం కోదాడ మున్సిపల్ పరిధిలోని ఆరో వార్డు గోపిరెడ్డి నగర్‌లో కౌన్సిలర్ తుమ్మల నాగేంద్రమ్మతో కలిసి దోమల మందు పిచికారీలు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. పారిశుద్ధ్యంలో కోదాడ పట్టణాన్ని జిల్లాలో అగ్ర స్థానంలో నిలుపుతామన్నారు.
HYD: డయాలసిస్ కోసం వచ్చిన సాగర్ మృతిచెందడంతో పుప్పాలగూడలోని మెడికవర్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఘటనపై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఐదుగురు వైద్యులతో ప్రత్యేక బృందం పోస్టుమార్టం నిర్వహించారు.
BDK: బూర్గంపాడు గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ గంగా పార్వతి సమేత అగస్త్యేశ్వర స్వామి వారి దేవాలయంలో నూతన ధ్వజస్తంభ పునఃప్రతిష్ట, మహోత్సవ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రాంత ప్రజల సుఖశాంతి, ఐశ్వర్యాల కోసం ప్రార్థనలు చేసినట్లు తెలిపారు.