WGL: నర్సంపేట పట్టణంలోని వల్లభునగర్ కాలనీలో ఏళ్ల తరబడి నిరుపయోగంగా, చెత్తతో నిండి ఉన్న పురాతన బావికి ఎట్టకేలకు మోక్షం లభించింది. బావి దుస్థితి మున్సిపల్ ఛైర్మన్ శ్రీలక్ష్మీ రామానంద్ దృష్టికి రాగానే ఆమె వెంటనే స్పందించారు. బావిని పూర్తిగా శుభ్రం చేయించి, అందులోకి చెత్తాచెదారం పడకుండా పటిష్ఠమైన జాలిని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్ గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అన్నం, గుడ్డు కర్రీ, ఆలుగడ్డ, టమాట కర్రీలను పరిశీలించారు. బిర్యానీ అన్నం నాణ్యత సరిగా లేదని బిర్యానీలో బిర్యానీ ఆకు లేకుండా ఎలా వండారని వంట సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
WGL: వర్ధన్నపేట పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బుధవారం చెస్ నెట్‌వర్క గ్లోబల్ ఆధ్వర్యంలో MEO మామునూరు శ్రీధర్ విద్యార్థులకు 126 చెస్ బోర్డులు, కాయిన్లు ట్రైనింగ్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా MEO మాట్లాడుతూ.. దాతల సహకారం మరువలేనిదని, విద్యార్థుల్లో చెస్ ఆట పట్ల ఆసక్తి పెరిగి తర్కశక్తి, ఏకాగ్రత అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు.
HYD: నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలోని మల్లన్న జాతరలో రెండు నెలల చిన్నారి మృతి బాధాకరం అని ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారి మృతి కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఓయూ ఆర్ట్స్ కళాశాల నుంచి ఆర్ట్స్ కళాశాల ప్రధాన రహదారి వరకు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.
NZB: డిచ్‌పల్లి మండలం కమలాపూర్లో సర్పంచ్ ఋత్విజా రత్నం నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను లబ్ధిదారులకు బుధవారం అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు అందేలా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కర్నోల్ల సుజాత భూపతి, పంచాయతీ సిబ్బంది కొప్పెర రాకేశ్, సిర్నాపల్లి గంగాధర్, గంగారాం, బక్కన్న తదితరులు పాల్గొన్నారు.
RR: చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లి మున్సిపల్ ఛైర్మన్‌గా సాత ప్రవీణ్ కుమార్, వైస్ ఛైర్ పర్సన్‌గా జూలకంటి శ్వేతా పాండురంగరెడ్డి మునిసిపల్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. మునిసిపల్ అభిరుద్దికి తమ సహకారం అందచేస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
BDK: 38వ డివిజన్ కార్పొరేటర్ బత్తుల మధుచంద్ పాల్వంచ గట్టాయిగూడెం లోని గాయత్రి నగర్ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించి స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్యం, మంచినీటి సరఫరా, స్ట్రీట్ లైటింగ్ వంటి మౌలిక వసతుల పరిస్థితిని పరిశీలించి, సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
HYD: మహిళల్లో రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ల నివారణకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా తరహాలోనే వీటికి ఉచిత వ్యాక్సిన్ అందించనుంది. గ్రేటర్లో దాదాపు 56 లక్షల మంది మహిళలు ఉండగా ఇందులో 14- 26 ఏళ్ల వయసు వారు 12 లక్షల మందికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. సమీప PHCలలో 6 నెలల వ్యవధిలో మూడు డోసుల టీకాలను ఉచితంగా వేయించుకోవచ్చని అన్నారు.
SRCL: జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళా బుధవారం ఏర్పాటు చేశారు. జిల్లాలో గత కొన్ని రోజుల నుంచి పోయిన, చోరీకి గురైన సుమారు 6 లక్షల రూ.విలువ గల 63 ఫోన్ల ఆచూకీ మన రాష్ట్రం లోనే కాకుండా పొరుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుంచి రికవరీ చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ మహేష్ బి గితే చేతుల మీదుగా సంబంధిత మొబైల్ ఫోన్లు యజమానులకి అందజేశారు.
NRPT: ధన్వాడ మండలంలోని కిష్టాపూర్ ఉన్నత పాఠశాలలో బుధవారం స్వయం వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠాలు బోధించారు. జిల్లా కలెక్టర్‌గా సుహాసిని, జిల్లా విద్యాధికారిగా కృష్ణవేణి, మండల విద్యాధికారిగా శివప్రసాద్, ప్రధానోపాధ్యాయులుగా నందిని వ్యవహరించారు. బోధనలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పాఠశాల హెచ్ఎం రఘుమోహన్ బహుమతులు ఇచ్చారు.
MNCL: ఆదిలాబాద్ జైలులో రిమాండ్‌లో ఉన్న చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆయురారోగ్యాలతో ఉండాలని చెన్నూర్ BRS నాయకులు పూజలు చేశారు. బుధవారం చెన్నూరు పట్టణంలోని మదన పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీలైనంత త్వరగా సుమన్‌కు బెయిల్ రావాలని కోరుతూ 500 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు సమర్పించుకున్నారు.
VKB: విధులకు హాజరుకాక, దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్న వైద్యులను తొలగిస్తూ DME నరేంద్రకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో వికారాబాద్ జిల్లాలోని GMCలో విధులు నిర్వర్తిస్తున్న యశ్వంత్ గౌడ్, విజయశ్రీ ఇద్దరు ఉన్నారు. కాగా, ప్రభుత్వ దవాఖానాలకు ఎంపికైనా జాయిన్ అవ్వని, లాంగ్ లీవ్‌లో ఉన్న వారిని రాష్ట్ర వ్యాప్తంగా 94 మందిని తొలగించారు.
BHNG: మోత్కూరులో శ్రీ శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి వారి మార్చి 3న నిర్వహించే కళ్యాణ మహోత్సవాలకు ఎమ్మెల్యే మందుల సామెలు ను బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి దేవాలయ కమిటీ ఛైర్మన్ గుండగొని రామచంద్ర గౌడ్ ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు బయ్యాని రాజు, శేఖర, చారి, శ్రీను, తదితరులు పాల్గొన్నారు
NGKL: కుమ్మెర మల్లన్న స్వామి జాతరలో చోటుచేసుకున్న కుల వివక్ష దాడిలో పసికందు మృతిచెందిన ఘటనపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆయన, వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబానికి పార్టీ తరపున పూర్తి అండగా ఉంటామని, నిందితులకు శిక్ష పడే వరకు పోరాడి న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు.
KNR: హకీంపేట్, కరీంనగర్, ఆదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్లో 4వ తరగతి ప్రవేశాలకు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 4 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి తెలిపారు. మార్చి 13 నుంచి 17 వరకు మండల స్థాయిలో, 28న జిల్లా స్థాయిలో, ఏప్రిల్ 27న హకీంపేటలో రాష్ట్రస్థాయి ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.