• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

జిల్లాలో ఇంటర్ పరీక్షల ఏర్పాట్లు పూర్తి

మహబూబ్ నగర్ జిల్లాలో ఈ నెల 25 నుంచి మార్చి 13 వరకు జరగనున్న ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 35 కేంద్రాల్లో 21,884 మంది విద్యార్థులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష రాయనున్నారు. విద్యార్థులకు సౌకర్యాల కోసం కనీస వసతులు అందించినట్లు అధికారులు తెలిపారు.

February 23, 2026 / 08:22 AM IST

చిన్నారి మృతికి నిరసనగా కొవ్వొత్తులతో ర్యాలీ

NZB: నాగర్ కర్నూల్ జిల్లాలో చిన్నారి మృతికి నిరసనగా జక్రాన్ పల్లి మండలం కలిగోట్ గ్రామంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. డా. విశారదన్ మహారాజ్ ఆదేశాల మేరకు DSP కార్యకర్తలు ఈ ర్యాలిలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. చిన్నారి మృతికి కారణమైన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు.

February 23, 2026 / 08:21 AM IST

నేటి నుంచి యథావిధిగా ప్రజావాణి

SRPT: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిలిపివేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని ఇవాళ్టి నుంచి యథావిధిగా కొనసాగిస్తామని కలెక్టర్ తేజస్ నంద్లల్ పవార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజలు, దరఖాస్తుదారుల నుంచి వినతులు స్వీకరించి పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

February 23, 2026 / 08:21 AM IST

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు: DMHO

BDK: రోగులకు మెరుగైన సేవలు అందించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని DMHO హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం DMHO డాక్టర్ తుకారాం రాథోడ్ ఆదివారం పాల్వంచ పట్టణంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ నిబంధనలు, చట్టపరమైన ప్రమాణాల అమలును ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

February 23, 2026 / 08:20 AM IST

‘రైతుబడి అగ్రి షో’ ను సందర్శించిన మంత్రి తుమ్మల

KMM: హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో నిన్న నిర్వహించిన ‘రైతుబడి అగ్రి షో’ ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. ఈ సందర్భంగా వివిధ స్టాళ్లను పరిశీలించిన ఆయన, సాగు రంగంలో వస్తున్న అత్యాధునిక సాంకేతిక ఆవిష్కరణల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. రైతులు, శాస్త్రవేత్తలను ఒకే వేదికపైకి తెచ్చిన నిర్వాహకులను మంత్రి అభినందించారు.

February 23, 2026 / 08:17 AM IST

హైదరాబాద్‌లో ఎయిర్ క్వాలిటీ@225

HYD: నగరంలో ఎయిర్ క్వాలిటీలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. సాధరణంగా పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో కాలుష్యం పెరుగుతుంటుంది. డబుల్ డిజిట్‌లో ఉండే ఎయిర్ క్వాలిటీ సోమవారం AWHO కాలనీలో 225గా రికార్డ్ అయ్యింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు.

February 23, 2026 / 08:09 AM IST

నాణ్యమైన మొక్కలు సకాలంలో సిద్ధం చేయాలని

KMM: నగర సుందరీకరణకు అవసరమైన నాణ్యమైన మొక్కలను సకాలంలో సిద్ధం చేయాలని ఉద్యానవన అధికారి ఆదేశించారు. ఖమ్మం నగరం గొల్లగూడెం నర్సరీలో జరుగుతున్న మొక్కల పెంపకం, నిర్వహణ పనులను ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పట్టణ హరితీకరణ లక్ష్యంగా చేపడుతున్న పనులను సమీక్షించి, సిబ్బందికి సాగు పద్ధతులపై పలు సూచనలు చేశారు.

February 23, 2026 / 08:08 AM IST

విశ్రాంత ఉద్యోగి ఇంట్లో భారీ దొంగతనం

BDK: సుజాతనగర్ మండలంలోని వేపలగడ్డ గ్రామం నందనవనం కాలనీలో భారీ దొంగతనం నిన్న జరిగింది. ఎస్బీఐ విశ్రాంత మేనేజర్ రఘునాథ్ కుటుంబంతో కలిసి నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లగా, గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలోని 5.9 తులాల బంగారం, 40.8 తులాల వెండితో పాటు రూ. 50 వేల నగదును దోచుకెళ్ళినట్లు ఎస్సై రమాదేవి తెలిపారు.

February 23, 2026 / 08:06 AM IST

వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం

JGL: రాయికల్ మండలంలోని భూపతిపూర్ గ్రామంలో ఆదివారం నక్కలగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణ మహోత్సవం కన్నుల పండుగలా నిర్వహించారు. గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో, గ్రామ ప్రజల సౌజన్యంతో మహా అన్నదానం, రథోత్సవం తదితర కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు అర్చకులు వెంకట కృష్ణ తెలిపారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు తదితరులు పాల్గొన్నారు.

February 23, 2026 / 08:05 AM IST

బషీరాబాద్‌లో సూచిక బోర్డులు లేక ప్రయాణికుల తికమక

VKB: బషీరాబాద్ మండల కేంద్రంలోని రైల్వే గేట్ సమీపంలో సూచిక బోర్డులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ మూలమలుపు నుంచి జీవంగి, ఇందర్చేడు, నవాంగి గ్రామాలకు వెళ్లే మార్గాలు ఉండటంతో కొత్త వాహనదారులు ఏ దారి ఎటువైపు వెళ్తుందో తెలియక గందరగోళానికి గురవుతున్నారు. అధికారులు స్పందించి సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.

February 23, 2026 / 08:02 AM IST

కుమ్మెర ఘటనపై కేశంపేటలో కొవ్వొత్తుల ర్యాలీ

RR: నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెరలో రజక కుటుంబంపై దాడి చేసి పసికందును హత్య చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కేశంపేటలో BC, SC, ST-JAC, ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బాధితులకు న్యాయం చేసి మర్డర్ కేసు నమోదు చేయాలని నాయకులు కోరారు. మహిపాల్ మహారాజ్, రాములు, రమేశ్ తదితరులు ఉన్నారు.

February 23, 2026 / 08:02 AM IST

ఉచిత శిక్షణకు .. నేడే లాస్ట్

MBNR: జిల్లా కేంద్రంలోని రాజేంద్రనగర్‌లో DDU -GKY& స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో యువతులకు నర్సింగ్ అసిస్టెంట్ కోర్సులో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు కో-ఆర్డినేటర్ రవి తెలిపారు. టెన్త్ పాసైన వారు అర్హులని, ఎంపికైన వారికి ఉచిత శిక్షణతో పాటు వసతి, భోజనం, మెటీరియల్ సదుపాయం కల్పిస్తామన్నారు. ఈ నెల 23 లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

February 23, 2026 / 08:02 AM IST

గ్రామ పాలనపై ‘సర్పంచ్’లకు స్పెషల్ క్లాస్..

MNCL: గ్రామ పంచాయతీల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా జన్నారం మండల సర్పంచులు సిద్ధమయ్యారు. మంచిర్యాల ఇంజనీరింగ్ కళాశాల వేదికగా సోమవారం నుంచి ప్రారంభం కానున్న ‘సర్పంచుల శిక్షణ తరగతుల’ను సర్పంచులందరూ ఏకతాటిపైకి వచ్చి విజయవంతం చేయాలని జన్నారం మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కుదిరే వెంకన్న కోరారు.

February 23, 2026 / 08:02 AM IST

మహిళా సంఘ భవనాలలో మరుగుదొడ్లు నిర్మిస్తాం: DRDO

ASF:మహిళా సంఘ భవనాల నమూనాలో మరుగుదొడ్ల నిర్మాణానికి చోటు లేని విషయం వాస్తవమేనని ఆసిఫాబాద్ జిల్లా DRDO దత్తారావు ప్రకటనలో తెలిపారు.కానీ మహిళలు ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, స్వచ్చ భారత్ మిషన్లో భాగంగా పంచాయతీల నుంచి తీర్మానాలు స్వీకరించి మరుగుదొడ్లు నిర్మిస్తామన్నారు. ఇప్పటికే దాదాపు అన్నిచోట్ల భవనాల నిర్మాణాలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు.

February 23, 2026 / 08:01 AM IST

వైభవంగా జాతర ఉత్సవాలు ప్రారంభం

PDPL: రాయికల్ మండలం కట్కాపూర్, బీర్పూర్ మండల పరిధిలోని రంగాసాగర్, కండ్లపెళ్లి, మంగెల గ్రామాల సరిహద్దుల్లో వెలసిన శ్రీ గొల్లకేతమ్మ మల్లన్న స్వామి జాతర ఉత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మహిళలు నెత్తిన బోనాలతో ఊరేగింపుగా వచ్చి మల్లన్నకు నైవేద్యం సమర్పించగా, లగ్న పట్నం కార్యక్రమం కన్నుల పండుగలా సాగింది.

February 23, 2026 / 08:01 AM IST