• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

చండూరులో వైభవంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం

NLG: చండూరులోని శ్రీ మార్కండేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు కనులపండువగా సాగుతున్నాయి. ఆదివారం రాత్రి ఆలయంలో హోమం, బలిహరణ, భేరి పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం మండపంలో పురోహితులు హరికిషన్ శర్మ, ప్రవీణ్ శర్మల ఆధ్వర్యంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది.భక్తులు ఉత్సవాన్ని తిలకించేందుకు తరలివచ్చారు.

February 23, 2026 / 06:25 AM IST

“TG Ed.CET-2026 నోటిఫికేషన్ నేడు విడుదల”

WGL: TG Ed.CET-2026 నోటిఫికేషన్ సోమవారం విడుదల కానుంది. WGLలోని KUలో ఎడ్‌సెట్ ఛైర్మన్ ప్రొఫెసర్ కె. ప్రతాప్ రెడ్డి అధికారిక వెబ్‌సైట్‌ను ప్రారంభించి, దరఖాస్తుల ప్రక్రియ, పరీక్షా షెడ్యూల్‌తో పాటు ముఖ్యమైన తేదీల వివరాలను ప్రకటించనున్నారు. బీ.ఎడ్ కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు సోమవారం నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో కీలక సమాచారం పొందవచ్చు అన్నారు.

February 23, 2026 / 06:23 AM IST

BJP కార్పొరేటర్లను సన్మానించిన MLA

NZB: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ కార్పొరేటర్లను ఆదివారం జిల్లా బీజేపీ కార్యాలయంలో NZB అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు తమ డివిజన్ తో పాటు NZB నగర అభివృద్ధి కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు.

February 23, 2026 / 06:20 AM IST

జిల్లాలో మైనారిటీ యువతకు GOOD NEWS

VKB: మైనారిటీ యువత ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం సబ్సిడీ స్కూటర్ పథకాన్ని అమలు చేస్తోందని జిల్లా అధికారి ఎస్. రాజేశ్వరి తెలిపారు. రూ. 1.50 లక్షల విలువైన వాహనంపై రూ. 1.20 లక్షలు సబ్సిడీగా అందించి, లబ్ధిదారుడు రూ. 30 వేలే చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. 21-40 సంవత్సరాల వయస్సు, పదో తరగతి ఉత్తీర్ణత, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు తప్పనిసరి అన్నారు.

February 23, 2026 / 06:20 AM IST

బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ కాంగ్రెస్‌లో చేరిక

MDCL: బీఆర్ఎస్‌కు చెందిన కుత్బుల్లాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కెఎం గౌరీష్ కాంగ్రెస్‌లో చేరారు. ఆదివారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఇంఛార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నర్సారెడ్డి భూపతిరెడ్డి ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో చేరాడు. ఎమ్మెల్యే కెపి వివేకానందకు బాబాయ్ కావడంతో ఈ చేరిక స్థానికంగా ప్రాధాన్యత చోటుచేసుకుంది.

February 23, 2026 / 06:20 AM IST

బీసీల ఐక్యతకు కమ్యూనిటీ భవనాలు కీలకం: మంత్రి

NRPT: బీసీల ఐక్యతకు కమ్యూనిటీ భవనాలు ఎంతో కీలకమని రాష్ట్ర పాడి పారిశ్రామికాభివృద్ధి మత్స్య యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. ఆదివారం మక్తల్ సిద్ధాంతిలో నిర్మించిన ముదిరాజ్ కమ్యూనిటీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముదిరాజ్‌ల అభ్యున్నతి కోసం సర్కారు కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

February 23, 2026 / 06:16 AM IST

బస్సు సౌకర్యం కల్పించాలని డిపో మేనేజర్‌కు వినతి

KMM: చింతకాని మండలం చిన్నమండవ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని సర్పంచ్ పర్చ రామచంద్రరావు ఖమ్మం డిపో మేనేజర్ శివప్రసాద్‌ను కోరారు. ఏపీ వత్సవాయి మండలం పోలంపల్లి ప్రాంతం నుంచి ఖమ్మంకు బస్సు సౌకర్యం కల్పిస్తే ప్రయాణికులకు ఇబ్బందులు తొలగిపోతాయని, ముఖ్యంగా ఇంటర్మీడియట్, పదవ తరగతి విద్యార్థులకు మేలు జరుగుతుందని ఆయన వినతిపత్రంలో పేర్కొన్నారు.

February 23, 2026 / 06:11 AM IST

పునఃప్రారంభం కానున్న ఏనుమాముల మార్కెట్

WGL: పట్టణ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ రెండు రోజుల సాధారణ సెలవుల అనంతరం సోమవారం పునఃప్రారంభం కానున్నట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి యధావిధిగా పంటల కొనుగోలు ప్రారంభమవుతాయని అధికారులు వెల్లడించారు. రైతులు నాణ్యమైన సరుకు తీసుకువచ్చి మద్దతు ధర ఉండాలని అధికారులు సూచించారు.

February 23, 2026 / 06:09 AM IST

రోడ్డు ప్రమాదంలో ఆదిలాబాద్ వాసి మృతి!

ADB: కడెం మండలం దోస్త్ నగర్ సమీప అటవీ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మృతుడు ఆదిలాబాద్ బొక్కలగూడకు చెందిన సయ్యద్ నసీరుద్దీన్‌గా గుర్తించారు. అతను మంచిర్యాలలో సర్వే ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తూ నిర్మల్‌లో నివాసం ఉంటున్నారు.

February 23, 2026 / 06:08 AM IST

గిరిప్రదక్షిణకు ప్రత్యేక బస్సులు

HYD: అరుణాచల గిరి ప్రదక్షిణకు దిల్‌సుఖ్ నగర్‌లోని ఆర్టీసీ హైదరాబాద్-2 డిపో నుంచి ప్రత్యేక బస్సు నడపనున్నట్లు మేనేజర్ కరుణశ్రీ తెలిపారు. మార్చి 1వ తేదీన రాత్రి 7 గంటలకు బయలుదేరుతుందన్నారు. తిరిగి నాలుగవ తేదీన బస్సు హైదరాబాద్ చేరుకుంటుందని పేర్కొన్నారు. భక్తులు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ కోరారు.

February 23, 2026 / 06:07 AM IST

విద్యుత్ సరఫరాలో అంతరాయం

MDK: టేక్మాల్ మండలం బోడగట్టు సబ్ స్టేషన్ పరిధిలో సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కమ్మరికత్త, సూరంపల్లి, వేల్పూగొండ తదితర గ్రామాల్లో విద్యుత్ నిలిపివేస్తున్నట్లు ఏఈ ఉదయ్ భాస్కర్, ఏడీఈ వెంకటేశ్వరరావు తెలిపారు వినియోగదారులు గమనించి సహాకరించాలని కోరారు.

February 23, 2026 / 06:04 AM IST

డిప్యూటీ మేయర్‌కి ఛాంబర్ ఉందా లేదా?

KNR: కరీంనగర్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు ఆశలకు గండి పడినట్లు తెలుస్తోంది. ఆదివారం మేయర్ శ్రీనివాస్ తన ఛాంబర్లోకి అడుగుపెట్టగా, అదే సమయంలో డిప్యూటీ మేయర్‌కు కూడా ఛాంబర్ కేటాయిస్తారని భావించినా అభ్యంతరాలు వ్యక్తం కావడంతో అధికారులు నిర్ణయం తీసుకోలేదు. బీజేపీయేతర పార్టీల నాయకుల ఫిర్యాదు మేరకు ఛాంబర్ అలాట్ నిలిచిపోయింది.

February 23, 2026 / 06:04 AM IST

మనోవేదనతో వ్యక్తి ఆత్మహత్య

JGL: మల్యాల మండలం బల్వంతపూర్‌లో కొను బక్కయ్య (53) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్సై నరేశ్ తెలిపారు. కాగా, మృతుడు కొంతకాలంగా మానసిక వేదనను తట్టుకోలేక పలుమార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో మరోమారు ఆదివారం గ్రామంలోని ఓ హార్వెస్టర్‌కు నైలన్ తాడుతో ఉరి వేసుకున్నట్లు మృతుని భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

February 23, 2026 / 06:02 AM IST

రాష్ట్ర స్థాయి పోటీలకు విద్యార్థిని ఎంపిక

SRCL: ముస్తాబాద్ మండలం చీకోడు జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పర్శ శ్రావణి సీఎం కప్ జిల్లా స్థాయి రన్నింగ్ పోటీల్లో సత్తా చాటింది. దీంతో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ సందర్భంగా కోచ్ రమేశ్, పాఠశాల ప్రిన్సిపల్, MEO నిమ్మల రాజిరెడ్డి, సర్పంచ్ బొమ్మేన ఆంజనేయులు, గ్రామస్థులు అభినందనలు తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామానికి మంచి పేరు తీసుకురావాలన్నారు.

February 23, 2026 / 06:02 AM IST

నేటి నుంచే ఎల్.ఎల్.బి 5వ సెమిస్టర్ పరీక్షలు

NZB: తెలంగాణ యూనివర్సిటీలో ఎల్.ఎల్.బి 5వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 23, 25, 27 మార్చి 2, 4 తేదీల్లో మధ్యాహ్నం 2 గం.ల నుంచి సాయంత్రం 5 గం.ల వరకు పరీక్షలు వెల్లడించారు.

February 23, 2026 / 05:02 AM IST