NZB: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లాలోని మహిళలందరికీ శనివారం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని ఆమె పేర్కొన్నారు. మహిళలు ప్రతి రంగంలోనూ తమ ప్రతిభను చాటుకుంటూ, దేశ అభివృద్ధికి కీలకంగా మారుతున్నారని కలెక్టర్ అన్నారు.
MNCL: ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా శనివారం బెల్లంపల్లి మున్సిపాలిటీలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. ప్రజలను భాగస్వామ్యులను చేస్తూ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో అమలుపరిచే విధంగా చొరవ చూపాలన్నారు.
BHPL: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా శనివారం గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సర్పంచ్ సునీత -రవీందర్ ఆధ్వర్యంలో GP సిబ్బంది పారిశుద్ధ పనులు చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధిలో విద్యా సంస్థల పాత్ర కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో GP కార్యదర్శి రంజిత్, ఉప సర్పంచ్, పాఠశాల HM ఉన్నారు.
HNK: ఐనవోలు మండలంలోని ఒంటిమామిడిపల్లి పీఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులు ఎక్స్పోజర్ విజిట్‌లో భాగంగా సాలార్ జంగ్ మ్యూజియంను నేడు సందర్శించారు. సాలార్ జంగ్ మ్యూజియం యొక్క విశేషాలు, ఇతర అంశాలను పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయులకు క్షుణ్ణంగా వివరించారు. కార్యక్రమంలో హెడ్ మాస్టర్ శివకుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ADB: దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ఏఐ మార్ఫింగ్, యూపీఐ, లోన్, ఉద్యోగాల పేరుతో సాగే మోసాల పట్ల జాగ్రత్త వహించాలని కోరారు. ఈ వారంలో జిల్లాలో 8 సైబర్ ఫిర్యాదులు నమోదయ్యాయని వెల్లడించారు. ఎవరైనా మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు.
ADB: దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ఏఐ మార్ఫింగ్, యూపీఐ, లోన్, ఉద్యోగాల పేరుతో సాగే మోసాల పట్ల జాగ్రత్త వహించాలని కోరారు. ఈ వారంలో జిల్లాలో 8 సైబర్ ఫిర్యాదులు నమోదయ్యాయని వెల్లడించారు. ఎవరైనా మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు.
ASF: కాగజ్‌నగర్ పట్టణం గాంధీ పార్క్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా MLC దండే విఠల్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించి సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని అన్నారు. మహిళా సాధికారత కేవలం ఆర్థికాభివృద్ధి తోనే కాకుండా, సామాజిక చైతన్యంతో కూడా సాధ్యమవుతుందన్నారు.
BDK: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వైద్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై శనివారం ఐడీవోసీ కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అంకిత్, శిక్షణ కలెక్టర్ సౌరబ్ శర్మతో కలిసి వైద్యశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 99 రోజులపాటు చేపట్టనున్న కార్యాచరణపై జిల్లా అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
SRCL: కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి ఇల్లు మంజూరు చేసి పేద ప్రజల కళ్ళల్లో ఆనందం చూడటమే ప్రభుత్వ లక్ష్యమని మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ వన్నెల రమణారెడ్డి చెప్పారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సహకారంతో బోయినిపల్లి మండలం కోరెం గ్రామానికి చెందిన జుట్టు రేఖ-తిరుపతి కుటుంబానికి మంజూరైన ఇందిరమ్మ ఇంటి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో శనివారం జరిగింది.
KNR: మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని, ఉద్యోగాలు, వ్యాపారాల ద్వారా ఆర్థిక సాధికారత సాధించాలని, తద్వారా సమాజంలో గుర్తింపు పొందాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో మహిళా ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
NLG: ఏపీకి చెందిన కృష్ణ యూనియన్ ‘విజయ తెలంగాణ’ పేరుతో కల్తీ పాలు, నెయ్యి విక్రయిస్తోందని రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మెన్ గుత్త అమిత్ రెడ్డి ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు ఫ్రాంచైజీ ఇవ్వడంతో మార్కెట్లోకి కల్తీ ఉత్పత్తులు వస్తున్నాయని, ఆ నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ ఉన్నట్లు NDDB రిపోర్ట్ ఇచ్చిందని తెలిపారు.
NZB: డిచ్‌పల్లి మండలంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సీఐ వినోద్, ఎస్సై ఆరీఫ్ పాల్గొన్నారు. శనివారం సాయంత్రం ఇస్లాంపురంలోని మజీద్‌లో సదర్ హమీద్, వసీం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఐ హాజరై ముస్లిం సోదరులతో దీక్ష విరమణ చేయించారు. హిందూ ముస్లింలు అందరూ కలిసి మెలిసి పండగలు చేసుకోవాలని సీఐ సూచించారు.
MNCL: భీమారం- జైపూర్ మండల కేంద్రాల మధ్య శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరు మందమర్రి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
MBNR: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముదిరాజులకు సముచిత స్థానం ఏర్పడిందని ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు మెట్టుకడి ప్రభాకర్ అన్నారు. ముదిరాజ్ రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ కార్పొరేషన్ మొదటి మేయర్ గుమ్మాల మమతా శ్రీనివాస్ ముదిరాజ్‌ను శనివారం జిల్లా కేంద్రంలో ఘనంగా సత్కరించారు. రాష్ట్ర జనాభాలో సగభాగం ఉన్న ముదిరాజుల గతంలో పట్టించుకోలేదన్నారు.
WNP: నియోజకవర్గ పరిధిలో సాగునీటి ప్రాజెక్టులు, పంట కాలువలు, చెక్ డ్యామ్‌ల లాంటి అనేక వాటిపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని శనివారం వనపర్తి జిల్లా నీటిపారుదుల శాఖ అధికారులకు ఎమ్మెల్యే మేఘారెడ్డి సూచించారు. నల్ల చెరువు నుంచి అమ్మ చెరువు వరకు వెళ్లే కాలువల బలోపేతం పై ప్రత్యేక దృష్టి ఉంచాలని తెలిపారు.