• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం

MBNR: గండీడ్ మండలం లింగాయపల్లి, సల్కర్‌పేట్ గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారులు గృహప్రవేశం చేశారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. మొదటి విడతకు అభినందనలు తెలిపారు. త్వరలో రెండో విడత మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

February 20, 2026 / 07:23 PM IST

సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా పోలు సంపత్

SDPT: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం సర్పంచుల ఫోరం హుస్నాబాద్ అధ్యక్షుడిగా గాంధీనగర్ గ్రామ సర్పంచ్ పోలు సంపత్‌ను మండలంలోని 17 గ్రామాల సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు సంపత్ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో సర్పంచులకు ఏ సమస్య ఉన్నా ముందుండి మరి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.

February 20, 2026 / 07:21 PM IST

మట్టి నమూన పరీక్షపై అవగాహన

JGL: కోరుట్ల మండలంలోని కల్లూరు గ్రామంలో గల మోడల్ స్కూల్ విద్యార్థులకు మట్టి నమూన పరీక్షపై అవగాహన సదస్సును శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్బంగా మండల వ్యవసాయ అధికారిని నాగమణి మట్లాడుతూ.. సేంద్రియ, సహజ వ్యవసాయం నేలలో సరైన ఆరోగ్యంగా పెరుగుతుందన్నారు. రసాయన ఎరువులు వాడకంతో నేలలో సారం తగ్గిపోతుందన్నారు. అలాగే నేలలో జరిగే చర్యల గూర్చి విద్యార్థులకు వివరించారు.

February 20, 2026 / 07:20 PM IST

ఈనెల 25న వాహనాలకు వేలం

MNCL: మంచిర్యాల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన ద్విచక్ర వాహనాలను ఈ నెల 25న ఉదయం 10 గంటలకు వేలం వేయనున్నట్లు ప్రోహిబీషన్ అండ్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ గురవయ్య తెలిపారు. స్టేషన్ ఆవరణలో నిర్వహించే వేలంలో ఆసక్తి గల వారు పాల్గొనాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.

February 20, 2026 / 07:20 PM IST

రేపు పేరెంట్స్ మీటింగ్: డీఈవో

MBNR: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, లోకల్ బాడీ, కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో ఈ నెల 21న (రేపు) పేరెంట్-టీచర్ మీటింగ్ నిర్వహించాలని డీఈవో ఆదేశించారు. పరీక్షల నేపథ్యంలో పిల్లలకు ఇంటి వద్ద సహాయం ఎలా అందించాలన్న దానిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించనున్నారు. ముఖ్యంగా 10వ తరగతి, అలాగే 2వ , 3వ తరగతి ఎఫ్ఎల్ఎన్/ ఎఫ్ఎల్ఎన్ పరీక్షల సిద్ధతపై దృష్టి పెట్టాలని అన్నారు.

February 20, 2026 / 07:19 PM IST

‘వంద పడకల ఆసుపత్రిని నాణ్యత ప్రమాణాలతో పూర్తిచేయాలి’

MHBD: మరిపెడ మండల కేంద్రంలో నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రిని నాణ్యత ప్రమాణాలతో వెంటనే పూర్తిచేయాలని సీపీఐ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ డిమాండ్ చేశారు. ఆసుపత్రి 100 ఏళ్ల ప్రజలకు ఉపయోగపడాలన్న పనుల్లో నాణ్యత ముఖ్యమని కాంట్రాక్టర్ నాణ్యత పాటించకపోయినా సీపీఐ ఆధ్వర్యంలో నిరసనలను వ్యక్తం చేస్తామని హెచ్చరించారు.

February 20, 2026 / 07:18 PM IST

‘జీవించే హక్కును హరిస్తే దళితుల ఆగ్రహానికి గురికాక తప్పదు’

HNK: జీవించే హక్కును హరిస్తే దళితుల ఆగ్రహానికి గురికాక తప్పదని డీబీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేందర్ అన్నారు. 11వ డివిజన్ భద్రకాళి ఆలయం సమీపంలో ఉన్న చెరబండరాజు నగర్లో DBF నేతలు పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాజ్యాంగ బద్దంగా అధికారులు తమ విధులను సక్రమంగా వినియోగించి దళిత కుటుంబాలకు మంచి పాలన అందించాలని కోరారు.

February 20, 2026 / 07:17 PM IST

‘మార్చి 1 వరకు దరఖాస్తులు సమర్పించాలి’

PPDL: తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అందిస్తున్న వివిధ పథకాలకు సంబంధించి అర్హులైన మైనారిటీలు మార్చి 1 లోపు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి నరేష్ కుమార్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు పత్రంతో పాటు, ముఖ్యమైన పత్రాలను సంబంధిత ఎంపీడీవో/మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.

February 20, 2026 / 07:13 PM IST

బాధితుడికి LOC కాపీని అందజేత

NZB: ఆర్మూర్ మండలం గోవింద్ పేట గ్రామానికి చెందిన రోహిత్ రానాకు CMRF ద్వారా అందిన సాయం ఊరటనిచ్చింది. ఇటీవలే అనారోగ్యం బారినపడి శస్త్రచికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చేరిన రోహిత్ పరిస్థితిని తెలుసుకున్న ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి తక్షణమే స్పందించారు. ప్రభుత్వానికి విన్నవించి ఎల్ఓసీ కాపీని మంజూరు చేయించారు.

February 20, 2026 / 07:13 PM IST

గ్రామ గ్రామాన మారుమ్రోగనున్న రామ నామం..!

SDPT: భద్రాచల దేవస్థానం నుంచి వచ్చిన 3 క్వింటాల వడ్లు గోటి తలంబ్రాలకు ఇవాళ అద్దాల మందిరం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజలు శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు దంపతుల ఆధ్వర్యంలో జరిగాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భక్తులకు అందించడానికి వడ్ల ప్యాకెట్లు సిద్ధిం చేశామన్నారు.

February 20, 2026 / 07:10 PM IST

సమిష్టి కృషితోనే గెలుపు సాధ్యం: జూపల్లి కృష్ణారావు

ADB: ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావును DCC అధ్యక్షుడు నరేష్ జాదవ్ హైదరాబాదులో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన్ను స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి శాలువాతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. నాయకులు, కార్యకర్తల సమిష్టి కృషి వల్లే మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు సాధ్యమైందని జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.

February 20, 2026 / 07:10 PM IST

కాంగ్రెస్‌లోకి బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల చేరిక

KMR: తాడ్వాయి మండలంలోని భ్రమణపల్లికి చెందిన పలువురు కీలక నాయకులు శుక్రవారం ఎమ్మెల్యే మదన్ మోహన్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వార్డు సభ్యులు నవీన్ గౌడ్, నారాయణ, గైని రాజుతో పాటు బీఆర్‌ఎస్ నాయకుడు మరాఠీ శ్రీనివాస్, బీజేపీ నాయకుడు అబ్బగొని రామాగౌడ్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వీరికి ఎమ్మెల్యే పార్టీలోకి సాదర స్వాగతం పలికారు.

February 20, 2026 / 07:09 PM IST

అసైన్డ్ భూమి స్వాధీనం.. నలుగురిపై కేసు నమోదు: CI

ADB: అసైన్డ్ భూమిని స్వాధీనం చేసుకున్న నలుగురిపై కేసు నమోదు చేయడం జరిగిందని మావల CI కర్రె స్వామి శుక్రవారం తెలియజేశారు. నిందితులలో హమీద్, షరీఫ్ ను అరెస్ట్ చేయగా అంజుం, మెహరున్నీసా పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. కేఆర్కే కాలనీకి చెందిన పట్పెల్లీ లలితకు అందజేసిన ప్రభుత్వ ఇంటి స్థలాన్ని నకిలీ ధ్రువపత్రాలతో నిందితులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

February 20, 2026 / 07:09 PM IST

ఆర్‌ఐ కారు బోల్తా.. తప్పిన ముప్పు..!

GDWL: మానవపాడు మండల పరిధిలోని బోరవెల్లి స్టేజి వద్ద 44వ జాతీయ రహదారిపై శుక్రవారం ప్రమాదం చోటుచేసుకుంది. ఎర్రవల్లి మండల రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ (RI) శ్రీనివాసులు కర్నూలు జిల్లా ఆత్మకూరులో బంధువుల వివాహానికి హాజరై తిరిగి గద్వాలకు వస్తున్నారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానికులు తెలిపారు.

February 20, 2026 / 07:09 PM IST

ఆర్తి అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్ ఎన్నిక

WGL: నర్సంపేట వ్యవసాయ మార్కెట్ ఆర్తి అసోసియేషన్‌కు జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా రవీందర్ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా రాజిరెడ్డి, కోశాధికారిగా భాస్కర్, ఉపాధ్యక్షుడిగా పాక భాస్కర్ మల్లేశం ఎన్నికైనట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. మార్కెట్ అభివృద్ధి, వ్యాపారుల సమస్యల కోసం కృషి చేస్తామని తెలిపారు.

February 20, 2026 / 07:08 PM IST