• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఆడపిల్లల పెళ్లికి ఆర్థిక సాయం

SRCL: చందుర్తి మండలం బండపల్లి గ్రామ సర్పంచ్ కట్కామ్ మల్లేశం సర్పంచ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. గ్రామంలో ఆడపిల్లల పెళ్లి జరిగితే రూ. 5016ల ఆర్థిక సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు గ్రామంలో ఇద్దరు ఆడపిల్లల పెళ్లిలకు రూ. 5016ల చొప్పున ఆర్థిక సహాయాన్ని శుక్రవారం రాత్రి అందజేశారు.

February 21, 2026 / 08:07 AM IST

‘రెండేళ్లుగా నిరాశ.. ఈసారైనా సాధించాలి’

VKB: గడిచిన రెండు విద్యా సంవత్సరాల్లో పదో తరగతి ఫలితాల్లో వికాబాదాబ్ జిల్లా రాష్ట్రస్థాయిలో అట్టడుగున నిలిచింది. గతేడాది 73.97 ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఇది రాష్ట్ర సగటు కంటే చాలా తక్కువ. ఈసారి ఎలాగైనా మెరుగైన ఫలితాలు సాధించాలని విద్యాశాఖ అధికారులు పట్టుదలతో ఉన్నారు. అందుకోసం ఈ ఏడాది ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నారు.

February 21, 2026 / 08:06 AM IST

వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ PHCలను ఏర్పాటు

MNCL: లక్షెట్టిపేట మండల కేంద్రంలో గల 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. ఆసుపత్రి వార్డులు, ల్యాబ్, రిజిస్టర్లు, మందుల నిల్వలు, పరిశీలించారు. ప్రభుత్వం వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ PHCలను ఏర్పాటు చేసిందన్నారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రులలో అవసరమైన వైద్యులు, సిబ్బందిని నియమించి ప్రజల సంక్షేమం కొరకు చర్యలు తీసుకుంటుందన్నారు.

February 21, 2026 / 08:06 AM IST

‘నెల రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్’

NRML: జిల్లాలోని నిర్మల్, ఖానాపూర్, బైంసా మున్సిపాలిటీల పరిధిలో ఆస్తి పన్ను బకాయిలు పేరుకుపోయాయని జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తెలిపారు. వెంటనే వసూలు చేసేందుకు సోమవారం నుంచి నెల రోజులపాటు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు పేర్కొన్నారు. పన్నులు చెల్లించని వారికి నోటీసులు అందించి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

February 21, 2026 / 08:04 AM IST

దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లకు నేటికి 13 ఏళ్లు

HYD: దిల్‌సుఖ్‌నగర్ జంట బాంబు పేలుళ్లు జరిగి నేటికి 13 ఏళ్లు. 2013 FEB 21న జరిగిన ఈ ఘోర దుర్ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడ్డారు. ఈ కేసులో NIA కోర్టు దోషులకు మరణశిక్ష విధించినప్పటికీ, న్యాయపరమైన కారణాలతో ఇప్పటికీ అమలు కాలేదు. తమకు ఇంకా పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

February 21, 2026 / 08:04 AM IST

ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య

BDK: అక్రమ సంబంధం బయటపడిందన్న మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భద్రాచలంలో కలకలం రేపింది. లక్ష్మీదేవిపల్లి మండలం బంగారుచెలకకు చెందిన రమేశ్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా, మైలవరానికి చెందిన ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని భద్రాచలంలో నివసిస్తున్నాడు. దీంతో ఇంట్లో ఈ విషయం తెలిసిందని ఆత్మహత్య చేసుకున్నడు.

February 21, 2026 / 08:01 AM IST

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై కలెక్టర్ సమీక్ష

SDPT: జిల్లా కలెక్టర్ కె.హైమావతి సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో నిర్వహించిన జూమ్ సమావేశంలో ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా మంజూరు, గ్రౌండింగ్, నిర్మాణ దశలు, నిలిచిన పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి మంజూరైన ఇల్లు గ్రౌండింగ్ కావాలని, ఎంపీడీఓలు ప్రణాళికతో పర్యవేక్షించాలని ఆదేశించారు.

February 21, 2026 / 08:01 AM IST

మంత్రి నేటి పర్యటన వివరాలు

NRPT: రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యకార, క్రీడలు, యువజన సేవల శాఖ మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి ఇవాళ పట్టణంలో పర్యటించనున్నారని మున్సిపల్ కమిషనర్ మురళి ఒక ప్రకటనలో తెలియజేశారు. మక్తల్ మండలంలో వివిధ అభివృద్ధి పనులకు ఉదయం 11 గంటలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేయనున్నట్లు తెలిపారు. పార్టీ నేతలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

February 21, 2026 / 08:01 AM IST

14 మంది ఎక్సైజ్ కానిస్టేబుళ్లకు పదోన్నతి

నల్గొండ ఐదవ జోన్ పరిధిలో ఎక్సైజ్ కానిస్టేబుళ్లకు పదోన్నతులు కల్పించారు. నల్గొండ, జనగాం, సూర్యాపేట జిల్లాలో ఎక్సైజ్ కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న 14 మందికి ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం రాత్రి పదోన్నతి ఉత్తర్వులు అందజేశారు. పదోన్నతి పొందిన సిబ్బంది అంకితభావంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన సూచించారు.

February 21, 2026 / 07:54 AM IST

అంతర్జాతీయ సెమినార్‌కు ఎంపిక

NLG: అంతర్జాతీయ సదస్సుకు మహాత్మా గాంధీ యూనివర్సిటీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ డాక్టర్ అలీ బేగ్ ఎంపికయ్యారు. టర్కీలో జూన్ 24 నుంచి నిర్వహించే ఈ సదస్సులో పరిశోధన పత్రాన్ని సమర్పించనున్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ అల్తాఫ్ హుస్సేన్, రిజిస్టర్ ఆల్వాల్ రవి, అధ్యాపకులు అలీ బేగ్‌ను అభినందించారు.

February 21, 2026 / 07:52 AM IST

విద్యాశాఖలో ప్రక్షాళన.. ప్రైవేట్ స్కూల్ సెక్షన్ల మార్పుజజ1

NZB: జిల్లా విద్యాశాఖలో ఏళ్లుగా పాతుకుపోయిన సిబ్బందిపై వేటు పడనుంది. ప్రైవేట్ పాఠశాలల విభాగాల్లో ఏడాది కంటే ఎక్కువ కాలం పనిచేస్తున్న వారిని తక్షణమే మార్చాలని విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు. జిల్లాలో 9 మంది సిబ్బంది ప్రైవేట్ స్కూల్ పనులు చూస్తుండగా, ఐదుగురు మూడేళ్లుగా అక్కడే ఉండటంతో అవినీతి ఆరోపణలు వస్తున్నాయి.

February 21, 2026 / 07:51 AM IST

పాత కలెక్టరేట్ స్థలంపై ‘వివాదం’..!

NLG: జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ స్థలం చుట్టూ రాజకీయ, న్యాయ వివాదం ముదిరింది. 2005లో అప్పటి CM YSR జీవో నెంబర్ 324 ప్రకారం ఈ స్థలాన్ని స్వర్ణకారుల సంక్షేమానికి కేటాయించారు. గతంలో స్వర్ణకారుల కోసం కేటాయించిన ఈ స్థలాన్ని ఇప్పుడు చిరువ్యాపారుల మార్కెట్ కోసం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించడం ‘హాట్ టాపిక్’గా మారింది.

February 21, 2026 / 07:50 AM IST

ఉపాధి హామీ పనులపై తనిఖీ

SRPT: నిరుపేదలకు ఉపాధి హామీ పథకం ద్వారా పని కల్పించాలని మునగాల మండల ప్రత్యేక అధికారి శిరీష అన్నారు. మునగాల ఎంపీడీవో కార్యాలయంలో నిన్న జరిగిన 16వ సామాజిక తనిఖీ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. తనిఖీల్లో గుర్తించిన లోపాలపై రూ.85,951 రికవరీ, పెనాల్టీ మొత్తాన్ని ఉపాధి హామీ ఖాతాలో జమ చేయాలని అధికారులను ఆదేశించారు.

February 21, 2026 / 07:50 AM IST

తైక్వాండోలో సంతోశ్‌కు సిల్వర్ మెడల్

SRD: హైదరాబాద్ గచ్చిబౌలిలో ఫిబ్రవరి 16 నుంచి 21 వరకు జరిగిన 4వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ మీట్-2026లో, సంగారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయం ఐటీ కోర్ టీంలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న గంగేరి సంతోశ్ కుమార్ తైక్వాండో 74-80 విభాగంలో ఉత్తమ ప్రతిభ ప్రదర్శించి సిల్వర్ మెడల్ సాధించారు.

February 21, 2026 / 07:49 AM IST

మహిళా సంఘ భవనానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

KNR: తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో నూతన మహిళా స్వయం సహాయక సంఘం భవనానికి మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సంఘాలను బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, మహిళా సాధికారత సమాజాభివృద్ధికి ఈ సంఘాలు చాలా ముఖ్యమైనవని తెలిపారు.

February 21, 2026 / 07:47 AM IST