• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

జగన్ సీఎం కావాలంటూ మోకాళ్లపై నడుస్తున్న యువకుడు

JN: బచ్చన్నపేట మండలం లింగంపల్లి చెందిన బొడ్డు ప్రవీణ్, వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. జగన్ మరోసారి సీఎం కావాలని కోరుతూ తెలంగాణ వ్యాప్తంగా 100 దేవాలయాల్లో మోకాళ్లపై నడుస్తూ ప్రతి ఆలయంలో 100 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. శుక్రవారం కొడవటూరు సిద్దేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాడు.

February 20, 2026 / 06:10 PM IST

‘సెక్యూరిటీ గార్డుల కేటాయింపులో అక్రమాలు’

MNCL: మందమర్రి ఏరియాలో 90 మంది అవుట్ సోర్సింగ్ సెక్యూరిటీ గార్డుల కేటాయింపు కోసం నిర్వహించిన టెండర్లలో భారీ అక్రమాలు జరుగుతున్నాయని CPI పట్టణ కార్యదర్శి దుర్గరాజ్ శుక్రవారం ఆరోపించారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి అర్హత లేని సంస్థలకు టెండర్లు కట్టబెట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ESI, PF బిల్లులు పరిశీలించాలన్నారు.

February 20, 2026 / 06:10 PM IST

బత్తుల సోమయ్యను పరామర్శించిన ఆకుల గాంధీ

KMM: తెలంగాణ ఉద్యమకారుడు బత్తుల సోమయ్య గౌడ్-పంకజం దంపతులు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కూసుమంచి మండలం లోక్యాతండా వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారు భవానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం తెలుసుకున్న మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ స్పందించి శుక్రవారం ఆస్పత్రికి వెళ్లి సోమయ్య-పంకజం దంపతులను పరామర్శించారు.

February 20, 2026 / 06:10 PM IST

దివ్యాంగులకు ఉచిత ద్విచక్ర వాహనాలు

SRCL: తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో దివ్యాంగుల సంక్షేమ పథకంలో భాగంగా ఉచిత ద్విచక్ర వాహనాలు పంపిణీ చేశారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ లబ్ధిదారులకు వాహనాలు అందజేశారు. ఇల్లంతకుంట మండలం నర్సక్కపేటకు చెందిన ర్యాగటి శ్రీనివాస్, ర్యాగటి శ్రవణ్ వాహనాలు పొందారు. దివ్యాంగుల ఉపాధి, ప్రయాణ సౌకర్యానికి ఇవి ఉపయోగపడతాయని ఎమ్మెల్యే తెలిపారు.

February 20, 2026 / 06:10 PM IST

GHMC అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం

RR: మహేశ్వరం నియోజకవర్గం, బడంగ్‌పేట్ సర్కిల్‌లో గ్రేటర్ HYD మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) అధికారులతో మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. GHMC శంషాబాద్ జోనల్ కమిషనర్, బడంగ్పేట్ డిప్యూటీ కమిషనర్ పాల్గొన్నారు.

February 20, 2026 / 06:08 PM IST

UPDATE: ఏసీబీకి పట్టుబడిన సబ్ రిజిస్టార్

PDPL: మంథని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఇవాళ దాడి చేశారు. సబ్ రిజిస్ట్రార్ కాసర్ల రాజేందర్, ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ రషీద్‌తో కలిసి పుట్టపాకకు చెందిన రైతు వద్ద రూ. 16,500 ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం తీసుకుంటుండగా ACB DSP మధు ఆధ్వర్యంలో వలపన్ని పట్టుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు.

February 20, 2026 / 06:06 PM IST

ప్రతి వర్గానికి సమాన హక్కులు అవకాశాలు: వేణు

SRCL: ప్రతి వర్గానికి సమానహక్కులు, అవకాశాలు న్యాయం అందించాలని  లోక్ అదాలత్ సభ్యులు ఆడెపు వేణు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలో రాజనీతి శాస్త్ర విభాగం సహకారంతో ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవంను నిర్వహించారు. అనంతరం న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు.

February 20, 2026 / 06:04 PM IST

‘వాహనం ఒక్కటే.. ట్యాక్సులు ఎన్ని’

KNR: తిమ్మాపూర్ మండలం రేణుగుంట టోల్ ప్లాజా వద్ద వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కోట శ్యాం కుమార్ ప్లకార్డ్ పట్టుకుని నిరసన చేపట్టారు. వాహనం కొనుగోలు చేసినప్పుడే లైఫ్ ట్యాక్స్ కట్టానని, అయినా టోల్ ప్లాజాలు ఏర్పాటు చేసి ట్యాక్స్ వసూలు చేయడం ఏంటని ప్రశ్నించారు. వెంటనే టోల్ ప్లాజాలు తొలగించాలని డిమాండ్ చేశారు.

February 20, 2026 / 06:03 PM IST

పత్తి కొనుగోలు గడువు పెంచాలని కలెక్టర్‌కి వినతి

ASF: ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని రైతుల విజ్ఞప్తి మేరకు CCI ద్వారా పత్తి కొనుగోలు గడువును మార్చి 20 వరకు పొడిగించాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జి అజ్మీరా శ్యామ్ నాయక్ కోరారు. ఈ మేరకు శుక్రవారం మార్కెట్ కమిటీ ఛైర్మన్ మంగతో కలిసి కలెక్టర్ కె. హరితని కలిసి విజ్ఞప్తి చేశారు. రైతుల విజ్ఞప్తిపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారని శ్యామ్ నాయక్ తెలిపారు.

February 20, 2026 / 06:02 PM IST

ఆసిఫాబాద్లో 32 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రత

ASF: జిల్లాలో ఎండలు మొదలయ్యాయి. ఓ వైపు ఉదయం చలి ఉంటూనే మధ్యాహ్నం ఎండలు దంచి కొడుతుండటంతో జిల్లా ప్రజలు కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఆసిఫాబాద్లో శుక్రవారం 32 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. అయితే, వేసవి ప్రారంభంలోనే ఇలా ఉంటే ఏప్రిల్, మేలో పరిస్థితి ఏంటని జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

February 20, 2026 / 06:01 PM IST

జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన

SRPT: హుజూర్ నగర్ పట్టణంలోని స్థానిక టీచర్స్ కాలనీలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయ ప్రాంగణంలో నూతన నిర్మాణ పనులకు శుక్రవారం ఘనంగా శంకుస్థాపన జరిగింది. అర్చకుల నివాస గదులు, నిత్య హోమాలు, అక్షరాభ్యాసాల కోసం నిర్మించనున్న ప్రత్యేక మండపానికి మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వైస్ ఛైర్మన్ మల్లికార్జున రావు కలిసి భూమి పూజ నిర్వహించారు.

February 20, 2026 / 06:01 PM IST

ఖానాపూర్‌లో 10వ శతాబ్దపు విగ్రహాలు లభ్యం..!

NRML: ఖానాపూర్ మండలంలోని బీర్నంది – కొమ్ము తాండా మధ్య అటవీ ప్రాంతంలో క్రీ.శ.10వ శతాబ్దానికి చెందిన విగ్రహాలను గుర్తించినట్లు చరిత్ర పరిశోధకులు రాజ్ కుమార్ తెలిపారు. చాళుక్యుల శైలిలో ఉన్న ద్విభుజ గణపతి, రాతిపై మలచిన భక్తాంజనేయ స్వామి, అరుదైన నాగబంధం, అలంకరణ స్తంభం ఇక్కడ లభ్యమయ్యాయి. భీమన్న గుడి చారిత్రక సంపదగా, స్థానికులను ఆకట్టుకుంటోంది.

February 20, 2026 / 06:00 PM IST

‘ఉద్యమకారులను ఆదుకునేందుకు సబ్ కమిటీ’

NZB: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో పాలన సాగిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్య మంలో జైలుకు వెళ్లిన ఉద్యమకారులను ఆదుకునేందుకు త్వరలో సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. శుక్రవారం ఆయన NZBలో మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో మృతి చెందిన వారికి 250 గజాల స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు.

February 20, 2026 / 06:00 PM IST

కన్నాయిగూడెంలో MRPS సమావేశం

MLG: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు కన్నాయిగూడెంలో సమావేశం జరిగింది. వాసంపెల్లి నరసింహారావు మాదిగ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమనికి రాష్ట్ర నాయకులు వావిలాల స్వామి మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజకీయ పార్టీల్లో మాదిగలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. లేకపోతే భవిష్యత్తులో రాజకీయంగా ప్రతిఘటన చేస్తామని హెచ్చరించారు.

February 20, 2026 / 05:59 PM IST

కొమ్మాల జాతర ఏర్పాట్లపై ఎమ్మెల్యే సమీక్ష

WGL: గీసుగొండ మండలం కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ఏర్పాట్లపై పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి శుక్రవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా జాతర ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన, ఫిబ్రవరి 23 నుంచి జాతర ప్రారంభం కావనున్న నేపథ్యంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

February 20, 2026 / 05:58 PM IST