HYD: ఒకప్పుడు చెత్తతో నిండిపోయిన కుడికుంట చెరువు.. ఇప్పుడు పునర్జీవనం పోసుకుంది. సీఎస్ఆర్ నిధులతో కల్పన రమేష్ చెరువును తీర్చిదిద్దారు. దీంతో స్థానిక కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు. చెత్తతో మురికిగా ఉన్న చెరువును బాగు చేయడంపై అభినందించారు. స్థానికుల సహకారంతో పాటు ఓ సంస్థ సీఎస్ఆర్ నిధులతో ఈ పనులు చేసినట్లు చెప్పారు.
ADB: గురుకులాల్లో ఐదవ తరగతి ఉమ్మడి పరీక్ష, 6, 7, 8, 9 తరగతులలో మిగిలిన సీట్లకు ప్రవేశ పరీక్షను ఈనెల 22న నిర్వహిస్తున్నట్లు డీసీఓ లలిత కుమారి పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 13 పరీక్ష కేంద్రాలు ఉన్నాయని.. మొత్తం 4820 మంది బాలబాలికలు హాజరవుతున్నారని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ఉదయం 10 గంటల్లోపు చేరుకోవాలన్నారు.
ASF: బెజ్జూర్ మండలంలోని రెబ్బెన గ్రామానికి చెందిన ఆర్పటి గణేష్ వారం రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయమై మరణించాడు. విషయం తెలుసుకున్న సిర్పూర్ MLA హరీష్ బాబు శనివారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారికి ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో రెబ్బన సర్పంచ్ నందిపేట రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.
సత్యసాయి: లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయం నుంచి శ్రీస్వామి వారి తీర్థప్రసాదాలను ఆలయ ఛైర్మన్ రమానందన్ ఎమ్మెల్యే కార్యాలయానికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకులకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వాదాలు తెలిపారు. మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించి విజయవంతంగా పూర్తయ్యాయని చెప్పారు.
MBNR: కాంగ్రెస్ నేతలు ప్రధాని మోదీని అవమానించారని నిరసిస్తూ గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన ఏబీవీపీ నాయకులను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. హన్మగల్ల బాల్ రాజ్, ప్రశాంత్, పవన్, మణికంఠ తదితరులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తీసుకున్న ఈ చర్యపై ఏబీవీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని రేలకుంట గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి, మాలోత్ రమేష్, సర్పంచ్ శేఖర్, చరణ్ సింగ్ సురేష్ గ్రామ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కోనసీమ: మండపేట జూనియర్ కళాశాల ఆవరణలలో అసంపూర్తి నిర్మాణంలో ఉన్న క్రీడా వికాస కేంద్రాన్ని పూర్తిచేయుటకు రూ.1.41 కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తెలియజేశారు. టెండర్లు పిలవటం జరిగిందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని అన్నారు. మండపేట నియోజకవర్గంలో యువతకు ఎటువంటి క్రీడా ప్రాంగణాలు లేనందున ఇది ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
KMR: బాన్సువాడ డివిజన్ కేంద్రంలో శనివారం ప్రశాంతంగా బంద్ కొనసాగుతుంది. శుక్రవారం సాయంత్రం రిలయన్స్ మార్ట్ షో రూమ్‌లో పనిచేస్తున్న ఓ మహిళ పట్ల ఓ వ్యక్తి అసభ్యంగా మాట్లాడాడని ఫిర్యాదు చేయడంతో హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. మరో వర్గం రాళ్లతో దాడి చేయడంతో ఇరువర్గాలు ఆందోళనకు దిగారు. దీంతో శనివారం హిందూ సంఘాలు బీజేపీ ఆధ్వర్యంలో బంద్‌కు పిలుపునిచ్చారు.
RR: రాజకీయాలకు డబ్బు జబ్బు పట్టుకుందని ఈ ధోరణిలో మార్పు రాకపోతే సామాన్యుడు రాజకీయాల్లోకి రాలేని దుస్థితి ఏర్పడుతుందని షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ఓటు ప్రజలు బాధ్యతగా భావించాలని, కేవలం డబ్బుల కోసం ఓట్లు వేసే ధోరణికి దూరం కావాలని అన్నారు.
ATP: గుత్తి ఆర్టీసీ బస్టాండ్‌లో శనివారం పట్టపగలే చోరీ జరిగింది. తాడిపత్రికి చెందిన మహిళా ప్రయాణికురాలు సంధ్యారాణి పత్తికొండ వెళ్లేందుకు బస్సు ఎక్కుతుండగా ఆమె బ్యాగ్‌లో ఉన్న నాలుగు తులాల బంగారు ఆభరణాలను గుర్తుతెలియని దుండగులు చోరీ చేశారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
HYD: మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చిందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ అన్నారు. శనివారం మెప్మా అధికారులతో ఎమ్మెల్యే సమావేశం అయ్యారు. నియోజకవర్గంలోని మహిళలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలన్నారు. మహిళా సంఘాలకు ప్రత్యేక రుణాలు ఇప్పించడం, వ్యాపార అవకాశాలను వారి దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.
WNP: బంజారా సేవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ నాయక్ ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ స్థాపన కోసం వనపర్తి జిల్లా కేంద్రంలో స్థలం కేటాయించాలని గిరిజనులు జిల్లా అదనపు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. అందుకు సానుకూలంగా స్పందించిన ఆయన జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి కృషి చేస్తామన్నారు. విగ్రహ స్థాపన ద్వారా గిరిజనుల గౌరవం పెరుగుతుందన్నారు.
NZB: విద్యార్థులకు తల్లిదండ్రులే మొదటి గురువులని ధర్పల్లి సర్పంచ్ సీహెచ్.శ్రీనివాస్ పేర్కొన్నారు. ధర్పల్లి ప్రభుత్వ పాఠశాలలో శనివారం తల్లిదండ్రుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తల్లిదండ్రుల క్రమశిక్షణ, పాఠశాలలో ఉపాధ్యా యులు బోధించే పాఠ్యాంశాలు విద్యార్థుల్లో జ్ఞాన పరివర్తనకు దోహదం చేస్తాయని పేర్కొన్నారు.
NLR: సౌర వెలుగులతో గ్రామాలు వెలిగిపోనున్నాయి. PM సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లి యోజన సోలార్ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కలెక్టర్ హిమాన్షు శుక్లా శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా జిల్లాలోని లేగుంటపాడు, బిట్రగుంట, మహిమలూరు, కలివెలపాలెం, మనుబోలు, కాకుపల్లి వంటి 5 వేల మందికి పైగా జనాభా కలిగిన గ్రామాలను ఎన్నుకొన్నారు. ఉత్తమ ప్రదర్శన కనబర్చిన గ్రామాలకు రూ. కోటి కేంద్ర మంజూరు చేస్తుంది.