E.G: రాజానగరం నియోజకవర్గ పరిధిలో నాణ్యమైన విద్యుత్ పంపిణీకి అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ తెలిపారు. శనివారం విద్యుత్ శాఖ అధికారులతో MLA సమావేశమై మాట్లాడారు. గ్రామాల వారీగా కొత్తగా విద్యుత్ పోల్స్, వేలాడుతున్న విద్యుత్ తీగలు తదితర విద్యుత్ సమస్యల కోసం ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలన్నారు.
VZM: బొబ్బిలి MLA బేబినాయన శనివారం స్దానిక MPDO కార్యాలయంలో ప్రభుత్వ అధికారులు ఎర్పాటు చేసిన స్వచ్చ రథాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామాల్లో పారిశుధ్యంపై అవగాహన పెంచడం, తడి-పొడి చెత్త వేరు చేయడం, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం ఈ రథం లక్ష్యమని ఆయన తెలిపారు. ప్రతి గ్రామం స్వచ్ఛంగా ఉండేలా ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు.
KDP: వల్లూరు సొసైటీ బ్యాంకులో రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి అధికారులతో కలిసి పాల్గొన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా యూరియా అందించాలని అధికారులకు సూచించారు. అవసరానికి మించి యూరియా వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై మూడపత్రాన్ని ఆవిష్కరించారు. అగ్రికల్చర్ అధికారులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
E.G: గోపాలపురం నియోజకవర్గంCH పోతేపల్లికి చెందిన యర్రంశెట్టి యేసు – ఝాన్సీ రాణి దంపతులకు పుట్టిన 10 రోజుల పసిబిడ్డ ఊపిరితిత్తులు అభివృద్ధి చెందక ప్రాణాపాయ స్థితిలో ఉంది. చాలాఖర్చవుతుందని వైద్యులుతెలపడంతో ఆ కుటుంబం దుఃఖ సముద్రంలో మునిగిపోయింది. ఈ విషయాన్నిఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు దృష్టికి తీసుకెళ్లగా శనివారం రూ.3,02,729 ఎల్ఓసీ మంజూరు చేయించారు.
HNK: ఐనవోలు మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ రఘు వంశీ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బాలింతలకు, చిన్నారులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందించాలని సిబ్బందికి సూచించారు. కేంద్రంలో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని సర్పంచ్ హామీ ఇచ్చారు. పిల్లల ఆరోగ్యం, సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు.
SKLM: ఆమదాలవలస మండలం తొగరాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో మాతృభాషా దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకులు డా. జి. రవికుమార్ మాట్లాడుతూ భావ వ్యక్తీకరణకు మాతృభాష కీలకమని, ప్రపంచ భాషలలో తెలుగు ప్రత్యేకమైన స్థానం కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు.
NGKL: పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి అన్నారు. తాడూరు మండలం మేడిపూరులో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై, రిబ్బన్ కట్ చేసి ఇంటిని ప్రారంభించారు. లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే.. అర్హులైన పేదవాడికి గృహ నిర్మాణ పథకం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
NLG: అమెరికా సామ్రాజ్యవాద ధోరణులు ప్రపంచ శాంతికి ముప్పుగా పరిణమించాయని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ‘రెడ్ బుక్ డే’ సందర్భంగా నల్గొండ పట్టణంలోని స్టడీ సర్కిల్‌లో జరిగిన కార్యక్రమంలో ‘బరితెగించిన అమెరికా సామ్రాజ్యవాదం’ అనే పుస్తకాన్ని ఆయన విశ్లేషించారు. ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తోందని విమర్శించారు.
RR: ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రజలకు సౌకర్యవంతమైన పనులు చేస్తుందని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా కల్వర్టు నిర్మాణానికి భూమి పూజ చేశారు. వారు మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ఎండాకాలం ముగిసే సరికి రోడ్ కల్వర్టు పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను కోరారు.
W.G: భీమవరం సివి రామన్ స్కూల్లో శనివారం శ్రీవిజ్ఞాన వేదిక చార్టిబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి., గోపాలశర్మ, డాక్టర్ రంగరాజు మాట్లాడుతూ.. భాషా వైవిధ్యాన్ని రక్షించుకోవడం కోసమే అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం జరుపుకుంటామని తెలిపారు. సుబ్రహ్మణ్యం, సత్యనారాయణరాజు, నాగేశ్వరరావు,శర్మ, రాజబాబు,బాషా, పాల్గొన్నారు.
GDWL: ఈనెల 23న గద్వాల జిల్లా కేంద్రంలో రైతు సమస్యల పరిష్కారానికై నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రైతు సంఘర్షణ సభ నిర్వహిస్తునట్లు అట్టి సభను విజయవంతం చేయాలని గట్టు మండల అధ్యక్షుడు బలరాం నాయుడు విలేకరులు సమావేశం తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండాగా రైతులను మోసం చేస్తుందని అన్నారు.
ASF: హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన 4వ తెలంగాణ పోలీస్ క్రీడల సెపక్ తక్రా విభాగంలో కాళేశ్వరం జోన్ రన్నరప్‌గా నిలిచింది. ఆసిఫాబాద్ జిల్లా AR హెడ్‌క్వార్టర్‌కు చెందిన గోపి(కెప్టెన్), కిరణ్ కుమార్, రాజేశ్ రజత పతకాలు సాధించారు. ప్రతిభ చాటిన కెప్టెన్ గోపి త్వరలో కేరళలో జరగనున్న ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌కు ఎంపికయ్యారు.
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై ఏపీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఈ అంశం ప్రస్తుతం హైకోర్టు పరిశీలనలో ఉందని, అవసరమైన సంప్రదింపులు కొనసాగుతున్నాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కోర్టు భవనాల నిర్మాణానికి అదనంగా రూ.130 కోట్లు కేటాయించినట్లు మంత్రి ఇవాళ వెల్లడించారు.
VZM: తెర్లాంకి చెందిన శనపతి రాము కుమార్తె జ్ఞానవర్షిణికు మంజూరైన సీఎం సహాయ నిధి రూ.1,00,000 చెక్కును ఎమ్మెల్యే బేబినాయన అందజేశారు. బొబ్బిలి కోటలో శనివారం చెక్కును కుటుంబ సభ్యులకు అందించారు. పేదలకు సీఎం సహాయ నిధి ఎంతో దోహదం చేస్తుందని బేబినాయన అన్నారు. రాజకీయాలకు అతీతంగా సీఎం సహాయ నిధి మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.
CTR: స్వచ్ఛతపై అవగాహన కల్పించే లక్ష్యంతో స్వచ్ఛ రథాన్ని అందుబాటులోకి తెచ్చారు. పూతలపట్టు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ కుమారి ఈ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. ప్రజలందరూ పరిశుభ్రతకు కట్టుబడి ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని సూచించారు. ఎంపీడీవో నాగరాజు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.