• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఘనంగా శ్రీ నీలకంఠ రామస్వామి బ్రహ్మోత్సవాలు

NLG: మర్రిగూడ మండలం చర్లగూడెం (శివన్న గూడెం) శ్రీ నీలకంఠ రామ స్వామి బ్రహ్మోత్సవాలను నిర్వాహకులు మంగళవారం ఘనంగా నిర్వహించారు ఆలయ కమిటీ చైర్మన్ సిరి ప్రగడ ఆనందరావు ఆధ్వర్యంలో స్వామి వారి రథోత్సవాన్ని పురోహితుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా శివన్నగూడ గ్రామ సర్పంచ్ రాపోలు యాదగిరి సమక్షంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

March 3, 2026 / 08:48 PM IST

గ్రహణం ముగిసిన వెంటనే ఆలయంలో శుద్ధి

అన్నమయ్య: చంద్రగ్రహణం అనంతరం రాయచోటి పట్టణంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయాన్ని తిరిగి భక్తులకు తెరిచారు. గ్రహణం సమయంలో మూసివేసిన ఆలయాన్ని, గ్రహణం ముగిసిన వెంటనే సంప్రదాయ ప్రకారం శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణాన్ని సిబ్బంది పూర్తిగా శుభ్రం చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత భక్తులకు దర్శనానికి అనుమతి ఇచ్చారు.

March 3, 2026 / 08:48 PM IST

బాధితురాలికి ఎమ్మెల్యే భరోసా

WNP: ఇటీవల జరిగిన రోడ్డుప్రమాదంలో ఏదుల మండలం చీర్కపల్లికి చెందిన ఉప్పరి కేశవులు మృతిచెందగా, ఆయన భార్య వనజ గాయపడి చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మేఘారెడ్డి మంగళవారం HYDలోని ఆస్పత్రికి చేరుకుని ఆమెను పరామర్శించి రూ.10వేలు ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలకు వైద్య సహాయం అందించేందుకు ముందుంటానని హామీ ఇచ్చారు.

March 3, 2026 / 08:47 PM IST

మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన

PDPL: రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జోన్ షీ టీమ్ సభ్యులు మేడిపల్లి సెంటర్ NTPC వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణపై ప్రజలకు సూచనలు ఇచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో 100, 112 హెల్ప్ లైన్ నంబర్లను వినియోగించాలని తెలియజేశారు. మహిళలపై వేధింపులు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే సమాచారం అందించాలని కోరారు.

March 3, 2026 / 08:47 PM IST

మార్చి 7న బీసీ ప్రజా ప్రతినిధులకు సన్మానం

WNP: జిల్లా కేంద్రంలో మార్చి 7న జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ సర్పంచులకు, ఉపసర్పంచ్‌లకు ఘన సన్మాన కార్యక్రమం ఉంటుందని జాతీయ బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి అరవింద్ స్వామి తెలిపారు. ఈ కార్యక్రమానికి జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య రానున్నారని అన్నారు. అందుకు సంబంధించిన గోడపత్రికను మంగళవారం జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విడుదల చేశారు.

March 3, 2026 / 08:44 PM IST

‘హత్యాయత్నం కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్’

ADB: హత్యాయత్నం కేసులో పట్టణానికి చెందిన తండ్రి కొడుకులు ఉమర్ ఖలీల్, వసీం కోకర్ అరెస్ట్ చేసినట్లు టూ టౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజు మంగళవారం తెలియజేశారు. దాడికి వినియోగించిన కత్తి రెండు సెల్ ఫోన్లు, స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆర్థిక లావాదేవీల మనస్పర్ధల కారణంగా హత్యా ప్రయత్నం చేసినట్లు నాగరాజు పేర్కొన్నారు.

March 3, 2026 / 08:43 PM IST

అన్న క్యాంటీన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జేసీ

శ్రీకాకుళంలోని సెవెన్ రోడ్ జంక్షన్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్‌ను జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు నాణ్యమైన భోజనం అందించాలని క్యాంటీన్ నిర్వహణకు సూచించారు. ప్రజలతో మాట్లాడి ఆహారం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. క్యాంటీన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

March 3, 2026 / 08:43 PM IST

ఉరివేసుకొని ప్రేమ జంట ఆత్మహత్య

AP: నెల్లూరు జిల్లా రావూరుఘాట్ అడవుల్లో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ముత్తుకూరుకు చెందిన ఆలపాక ప్రసన్న(25) సోషల్ మీడియా ద్వారా చిట్టమూరుకు చెందిన ఓ మహిళతో ప్రేమలో పడ్డాడు. అయితే, ఏమైందో తెలియదు కానీ, ఇద్దరూ ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అదే ప్రదేశంలో పురుగుల డబ్బా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ మహిళకు ఇది వరకే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం.

March 3, 2026 / 08:42 PM IST

ముగిసిన చంద్రగ్రహణం.. తెరుచుకున్న భీమేశ్వర ఆలయం

SRCL: చంద్రగ్రహణం ముగియడంతో వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి, ఆలయం తెరుచుకుంది. ఉదయం 6.15 గంటల నుంచి రాత్రి 7.15 గంటల వరకు ఆలయాన్ని మూసివేశారు. గ్రహణం ముగిసిన అనంతరం 7.16 గంటలకు పుణ్యాహవచనం నిర్వహించి, ఆలయం అంతట సంప్రోక్షణ చేపట్టి, ప్రదోష పూజ, మహా నివేదన కార్యక్రమాలలు నిర్వహించిన అనంతరం భక్తులకు పునర్దర్శనాలు కల్పించారు.

March 3, 2026 / 08:42 PM IST

వైద్యనాథ్ ఆలయ నిర్మాణానికి భారీ విరాళం

KNR: స్వయంభూ మల్లికార్జునస్వామి దేవాలయ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన గిరి ప్రదక్షిణ మార్గంలోని వైద్యనాథ్ ఆలయ నిర్మాణానికి మైలారం, సాంబయ్యపల్లి రెడ్డి సంఘంసభ్యులు భారీ విరాళం అందజేశారు. మంగళవారం రూ.6.96 లక్షల నగదును ఆలయ కమిటీ ఛైర్మన్ వరాల పరశురాములకు అందజేశారు. ఈ సందర్భంగా రెడ్డి సంఘం సభ్యులను ఆలయ ప్రధాన అర్చకులు ఘనంగా సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు

March 3, 2026 / 08:42 PM IST

జిల్లా ఇంఛార్జ్ మంత్రిని కలిసిన కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్

 హనుమకొండ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన చాహత్ బాజ్ పాయ్ మంగళవారం హైదరాబాద్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలియజేసి, జిల్లాలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఆకాంక్షించారు.

March 3, 2026 / 08:40 PM IST

‘ఉప్పల గోపాల్ రెడ్డి ఆశయాలు కొనసాగిస్తాం’

GDWL: మాజీ ఎమ్మెల్యే ఉప్పల గోపాల్ రెడ్డి ఆశయాలు కొనసాగిస్తామని సిటిజన్ ఫోరం జిల్లా అధ్యక్షుడు మోహన్ రావు పేర్కొన్నారు. ఆయన 33వ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం పట్టణంలోని రాయల్ లాడ్జి దగ్గర ఉన్న విగ్రహానికి కుటుంబ సభ్యులు సిద్ధార్థ రెడ్డి, రఘునాథ్ రెడ్డితో కలిసి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.

March 3, 2026 / 08:38 PM IST

BREAKING: కవిత అరెస్ట్

TG: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు. నార్సింగిలో మూసీ నదిని ఆక్రమించి నిర్మించుకున్న భవనాలకు వ్యతిరేకంగా స్థానికులతో కలిసి ఆమె ధర్నా చేశారు. హైడ్రా జేసీబీలు వచ్చి ఆ నిర్మాణాలను కూల్చే వరకు ఆందోళన విరమించేది లేదని బైఠాయించారు. దీంతో నార్సింగి పోలీసులు కవితను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

March 3, 2026 / 08:37 PM IST

బోర్డు ఉంది.. అక్షరాలు లేవు

PDPL: కమాన్పూర్ మండల కేంద్రంలోని శ్రీఆదివరాహస్వామి ఆలయానికి వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన సూచిక బోర్డుపై అక్షరాలు కనిపించకపోవడంతో దారి తెలియక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం స్వామివారి దర్శనం కోసం పలు వాహనాల్లో వస్తున్న భక్తులు సూచిక బోర్డు కనిపించకపోవడంతో ఎక్కువ దూరం ముందుకెళ్లి తిరిగి వెనక్కి వస్తున్నారు.

March 3, 2026 / 08:35 PM IST

రాహుల్ గాంధీ దృష్టికి జిల్లా సమస్యలు

PPM: పార్లమెంట్ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ దృష్టికి జంఝావతి సమస్యను తీసుకువెళ్లినట్లు కాంగ్రెస్ పార్టీ మన్యం జిల్లా డీసీసీ అధ్యక్షులు వంగల దాలినాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దృష్టికి జంఝావతి సమస్యతో పాటు జిల్లా నివేదిస్తున్న పలు సమస్యలు తీసుకువెళ్లానన్నారు.

March 3, 2026 / 08:32 PM IST