• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కోతుల బెడద నివారణకు ప్రత్యేక చర్యలు

JN: రఘునాథపల్లి గ్రామపంచాయతీ నందు కోతుల బెడద నివారణకు స్థానిక సర్పంచ్ వెంకటయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. విన్నూతంగా కొండెంగ గెట్ అప్‌లో సర్పంచ్, సిబ్బంది ఊరంతా తిరుగుతూ కోతులను తరిమికొట్టారు. గ్రామ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, అభివృద్ధికి ప్రజలంతా సహకరించాలని కోరారు.

February 23, 2026 / 10:20 AM IST

పరీక్షా కేంద్రాలను పరిశీలించిన DSP

TPT: నాయుడుపేటలో ఇవాళ ఉదయం జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను డీఎస్‌పీ చెంచుబాబు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పరీక్షలు నిర్వహించాలని పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించారు. తెలియని వారిని పరీక్ష కేంద్రంలోనికి పంపకూడదని తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలన్నారు.

February 23, 2026 / 10:19 AM IST

సీఎం కప్‌లో తల్లాడ మండల వాసికి కాంస్య పతకం

KMM: HYD గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడల్లో తల్లాడ మండలం రంగంబంజరకు చెందిన రామ్ చరణ్ సత్తా చాటాడు. నిన్న జరిగిన జూడో పోటీల్లో రామ్ చరణ్ అద్భుత ప్రతిభ కనబరిచి కాంస్య (బ్రౌన్) మెడల్ సాధించాడు. రామ్ చరణ్ 4 నుంచి 10వ తరగతి వరకు స్పోర్ట్స్ పాఠశాలలో శిక్షణ పొందినట్లు తండ్రి ధర్మసోత్ దశరథ్ నాయక్ తెలిపారు.

February 23, 2026 / 10:19 AM IST

“HIT TV కథనానికి స్పందన”

BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామంలోని అంబేద్కర్ కాలనీలో “లీకైన పైప్‌లైన్” సమస్య పై HIT TVలో నిన్న ప్రచురితమైన కథనానికి గ్రామ సర్పంచ్ సునీత-రవీందర్ స్పందించారు. ఇవాళ సర్పంచ్ సొంత ఖర్చులతో GP పంప్ ఆపరేటర్ అంజి పర్యవేక్షణలో పైప్‌లైన్ మరమ్మతు పనులు చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు గ్రామ సర్పంచ్‌కు, ముఖ్యంగా HIT TVకి కృతజ్ఞతలు తెలిపారు.

February 23, 2026 / 10:17 AM IST

BREAKING: శాసనమండలి వాయిదా

AP: శాసనమండలిలో వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. వైసీపీ వాయిదా తీర్మానాన్ని ఛైర్మన్ మోషేన్ రాజు తిరస్కరించారు. ఇందాపూర్ – హెరిటేజ్ అంశంపై చర్చకు వైసీపీ సభ్యులు పట్టుపట్టారు. ఈ క్రమంలో ఛైర్మన్ పోడియాన్ని వైసీపీ సభ్యులు ముట్టడించారు. ఈ క్రమంలో శాసనమండలిని ఛైర్మన్ వాయిదా వేశారు.

February 23, 2026 / 10:15 AM IST

తండా బిడ్డ పెళ్లికి భారీ ఆర్థిక సాయం

NLG: గన్యానాయక్ తండాకు చెందిన నేనావత్ రాము నాయక్ కుమార్తె వివాహానికి బీఆర్ఎస్ నాయకుడు నేనావత్ కిషన్ నాయక్ రూ.50,016 నగదును పెళ్లి కానుకగా అందజేశారు. పదవుల కంటే ప్రజల కష్టసుఖాల్లో తోడుండటమే తనకు సంతృప్తినిస్తుందని ఆయన పేర్కొన్నారు. తండా బిడ్డల అభివృద్ధి, వారి కుటుంబాల్లో ఆనందం నింపడమే తన ప్రధాన లక్ష్యమని కిషన్ నాయక్ స్పష్టం చేశారు.

February 23, 2026 / 10:13 AM IST

నూతన ఎస్ఐగా అజయ్ కుమార్ బాధ్యతలు

TPT: సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్ఐగా అజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు.ఇంతకుముందు దొరవారిసత్రం ఎస్ఐగా విధులు నిర్వహించిన ఆయన బదిలీపై సూళ్లూరుపేటకు వచ్చారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం మాట్లాడుతూ.. పట్టణ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, కాలేజీలు మరియు పాఠశాలల సమయాల్లో ఆకతాయిలపై కఠిన నిఘా ఏర్పాటు చేస్తామన్నారు.

February 23, 2026 / 10:12 AM IST

గాంధీ చౌక్ లో పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి

వనపర్తి జిల్లాలోని గాంధీ చౌక్ కు చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి అవసరాల కోసం వస్తుంటారు. మహిళలు, చిన్నపిల్లలు వస్తుంటారు. గాంధీ చౌక్ లో పబ్లిక్ టాయిలెట్స్ లేనందువల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించాలని ఎస్సీ, ఎస్టీ, విజిలెన్స్ కమిటీ సభ్యులు భోజరాజు వనపర్తి జిల్లా ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభికి వినతి చేశారు.

February 23, 2026 / 10:12 AM IST

‘గాంధీ చౌక్‌లో పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి’

వనపర్తి జిల్లాలోని గాంధీ చౌక్ కు చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి అవసరాల కోసం వస్తుంటారు. మహిళలు, చిన్నపిల్లలు వస్తుంటారు. గాంధీ చౌక్ లో పబ్లిక్ టాయిలెట్స్ లేనందువల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించాలని ఎస్సీ, ఎస్టీ, విజిలెన్స్ కమిటీ సభ్యులు భోజరాజు వనపర్తి జిల్లా ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభికి వినతి చేశారు.

February 23, 2026 / 10:12 AM IST

ముగిసిన రాష్ట్రస్థాయి పోటీలు

KNR: కరీంనగర్‌లో ఆదివారం రాత్రి రాష్ట్రస్థాయి సీఎం కప్ 2026 జిమ్నాస్టిక్స్ అండ్ ఆర్టిస్టిక్స్ ఛాంపియన్ షిప్ క్రీడా పోటీలు ఘనంగా ముగిశాయి. జిల్లా కేంద్రంలోని ప్రాంతీయ క్రీడా పాఠశాల జిమ్నాస్టిక్స్ ప్రాంగణంలో నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ గసిరెడ్డి జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు.

February 23, 2026 / 10:12 AM IST

నంద్యాలలో టమాటా రైతులకు భారీ నష్టం

NDL: నంద్యాల జిల్లాలో టమాటా సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. జనవరిలో కిలో రూ. 60 పలికిన ధర ప్రస్తుతం రూ. 4కు చేరుకోవడంతో అన్నదాతలు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 6 ఎకరాల్లో సాగు చేసిన రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పెట్టుబడి కూడా రాని పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు.

February 23, 2026 / 10:10 AM IST

ఎర్రన్న స్ఫూర్తి అందరికీ ఆదర్శం: సీఎం

AP: దివంగత నేత ఎర్రన్నాయుడి జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ‘నాకు అత్యంత ఆప్తుడు కింజరాపు ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. MLA, MP, కేంద్రమంత్రిగా ప్రజలకు ఆయన చేసిన సేవలు మరువలేనివి. చివరి క్షణం వరకు ప్రజా సేవ లోనే గడిపిన ఎర్రన్న స్ఫూర్తి అందరికీ ఆదర్శం’ అని పేర్కొన్నారు.

February 23, 2026 / 10:08 AM IST

‘లడ్డూ అంశంలో సర్కార్ డ్యామేజ్ అయింది’

AP: శ్రీవారి లడ్డూ అంశంలో కూటమి ప్రభుత్వం డ్యామేజ్ అయిందని ఎమ్మెల్సీ అనంతబాబు తెలిపారు. లడ్డూ నెయ్యి అంశం డైవర్ట్ చేయడానికి తన కేసు మళ్లీ తెరపైకి తీసుకొచ్చారని చెప్పారు. అన్యాయంగా తన భార్యను కేసులో ఇరికించారని.. న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు. అధికారులు సహకరిస్తే.. 7 నెలలు జైల్లో ఎందుకు ఉంటానని నిలదీశారు.

February 23, 2026 / 10:08 AM IST

నా భార్యను, నన్ను వేధిస్తున్నారు: ఎమ్మెల్సీ

AP: తాను పరారీలో లేనని MLC అనంతబాబు స్పష్టం చేశారు. వ్యక్తిగత పనుల మీద బిజీగా ఉన్నానని.. తనకు పోలీసులు నోటీసులు ఇవ్వలేదని తెలిపారు. తన డిఫాల్ట్ బెయిల్‌ని సుప్రీంకోర్టు పర్మినెంట్ బెయిల్ చేసిందని చెప్పారు. వైసీపీలో యాక్టివ్‌గా ఉన్న వాళ్లని ఏదోరకంగా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. తన భార్యను, తనను మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన చెందారు.

February 23, 2026 / 10:07 AM IST

ఇంటర్ పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేశాను

ELR: గణపవరం శ్రీ చింతలపాటి బాపిరాజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది. సీఐ రజిని కుమార్ పర్యవేక్షించారు. మొదటి సంవత్సరం జనరల్ విద్యార్ధులు వొకేషనల్ విద్యార్ధులు పరీక్షలు రాయునున్నారు.

February 23, 2026 / 10:05 AM IST