AP: తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం వేములపల్లిలో పరువుహత్య జరిగింది. సూర్యప్రకాష్ అనే వ్యక్తిని యువతి సోదరులు కొట్టి చంపారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నందున కోపంతో చెల్లెలి భర్తను దారుణంగా హతమార్చారు. సూర్యప్రకాష్‌ను రాయవరం డిప్యూటీ ఎమ్మార్వోగా పనిచేస్తున్న అయినవిల్లి సంధ్య ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లయిన కొన్ని గంటలకే సంద్య సోదరులు దాడి చేసి హత్య చేశారు.
GDWL: ప్రజలకు నాణ్యమైన పోలీస్ సేవలు అందించాలని గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. గురువారం గద్వాల జిల్లాలోని నిర్వహించిన క్రైమ్ రివ్యూలో ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు, ఆన్లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి పీఎస్ పరిధిలో ‘విలేజ్ హిస్టరీ షీట్స్’ అప్డేట్ చేయాలని, రాత్రి పూట గస్తీ (నైట్ బీట్) చట్టంపై అవగాహన రావాలని కోరారు.
NZB: బాసర త్రిపుల్ ఐటీలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ విమర్శించారు. గురువారం సాయంత్రం నిజామాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. విద్యార్థుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయని, తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
BPT: సంతమాగులూరు మండలం ఏల్చూరులో శనివారం మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, విద్యార్థులకు సైకిళ్లు అందజేయనున్నారు. అనంతరం అద్దంకి మండలం సింగరకొండలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం వార్షికోత్సవాన్ని ప్రారంభిస్తారని ఆయన కార్యవర్గం తెలిపింది. శింగరకొండపాలెంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని Calculation, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.
NLG: నల్గొండ-సాగర్ రోడ్‌లోని లింగోటం వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును టాటా ఏస్ వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పులిమామిడి గ్రామ కార్యదర్శి మోహన్ రావు అలియాస్ మనోహర్ మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. విధులకు వెళుతున్న ఆయనను టాటా ఏస్ వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన స్వగ్రామం పజ్జురుగా తెలుస్తుంది.
వాట్సాప్ యూజర్లకు కేంద్రం బిగ్ అలర్ట్ ఇచ్చింది. ‘సిమ్ బైండింగ్’ నియమాలను అమలు చేయడానికి రేపటి వరకే గడువు ఇచ్చింది. కొత్త నిబంధనల మేరకు మీ ఫోన్‌లో సిమ్ కార్డు లేకపోతే వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, స్నాప్‌చాట్, షేర్‌చాట్, జియోచాట్, తదితర మెసేజింగ్ యాప్‌లు పనిచేయవు. మీరు మీ కంప్యూటర్‌లో వాట్సాప్‌లోకి లాగిన్ అయితే 6 గంటల్లోపు లాగ్ అవుట్ అవుతుంది.
BHPL: రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ (ఆర్ఎంసీ) ప్రవేశ పరీక్షలో జయకేతనం ఎగురవేసి భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం బౌసింగ్ పల్లికి చెందిన చిందం సౌమ్య సత్తా చాటారు. దక్షిణ భారతదేశం నుంచే ఈ ఘనత సాధించిన ఏకైక బాలికగా ఆమె రికార్డు సృష్టించారు. భవిష్యత్తులో ఆర్మీలో ఉన్నత అధికారిణిగా సేవలు అందించడమే తన లక్ష్యమని సౌమ్య పేర్కొన్నారు.
NRPT: ధన్వాడ మండలంలోని మందిపల్లి స్టేజ్ వద్ద బస్సు షెల్టర్‌ను సర్పంచ్ సురేందర్ రెడ్డి సొంత నిధులు రూ.20 వేలతో మరమ్మతులు చేయించారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గోడలకు రంగులు వేయించి, కూర్చునేందుకు సౌకర్యాలు కల్పించారు. షెల్టర్ ఇప్పుడు సరికొత్తగా మారింది. సర్పంచ్ చొరవపై గ్రామస్తులు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
BHPL: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఎన్పీడీసీఎల్ వాట్సాప్ సేవలను ప్రారంభించినట్లు జిల్లా ఎస్ఈ మల్సూర్ నాయక్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల వినియోగదారులు సులభంగా ఫిర్యాదు చేయేందుకు 7901628348 నంబర్‌ను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఈ నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్ పంపితే ఫిర్యాదు నమోదు, ఏజెంట్‌తో చాట్ వంటి సేవలను పొందవచ్చని వివరించారు
ADB: జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ ఇవాళ ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల్లో పర్యటించనున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని ప్రధాన సమస్యలైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, పోడు భూముల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా గిరిజన గ్రామాల్లో అభివృద్ధి ఆశించిన స్థాయిలో లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
VZM: పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ ఆధ్వర్యంలో విజయనగరం రాజీవ్ ఇండోర్ స్టేడియం వేదికగా నిర్వహిస్తున్న 7వ రాష్ట్ర స్థాయి పారా బాడ్మింటన్ పోటీలు గురువారంతో ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరత్ ఖాదర్ వలి బాబా పుణ్యక్షేత్రం ధర్మకర్త డా.ఖలీల్ బాబు హాజరయ్యారు. విజేతలకు ట్రోఫీలు, సర్టిఫికెట్స్ అందజేశారు.
KNR: సైదాపూర్ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ దుస్స కుమార్ రాష్ట్ర ఉప సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శిగా గురువారం నియామకం అయ్యారు. హైదరాబాద్‌లో సంఘం అధ్యక్షుడు రాములు నాయక్, ఉపాధ్యక్షుడు కార్తీక్ ఆయనకు నియామక పత్రం అందజేశారు. తనపై నమ్మకంతో బాధ్యత అప్పగించిన కమిటీకి కృతజ్ఞతలు తెలిపిన కుమార్.. ఉప సర్పంచుల బలోపేతానికి కృషి చేస్తానన్నారు.
అన్నమయ్య: రాజంపేట మండలం బోయినపల్లి వద్ద శుక్రవారం పందిని తప్పించబోయి లారీ ఢీకొని ఆటో డ్రైవర్ అక్కడకక్కడే మృతి చెందాడు. మృతుడు వెలగచర్ల నాగేంద్రబాబు(30)గా స్థానికులు గుర్తించారు.ఈ మేరకు మన్నూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం ఏఎన్ఆర్ కమ్మపల్లిలో ఓ వ్యక్తి చనిపోయిన తన తల్లిదండ్రులపై ప్రేమచాటుకుంటున్నాడు. గ్రామానికి చెందిన హరి తండ్రి వెంకటరత్నం ఆచారి 2008లో, తల్లి లలితమ్మ 2012లో చనిపోయారు. గతంలోనే తండ్రి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా శుక్రవారం ఉదయం ఆ పక్కనే తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించి అభిషేకాలు నిర్వహించారు.
CTR: నిండ్ర మండలంలోని పాదిరి దళితవాడ నందు రాధా రుక్మిణి శ్రీకృష్ణ దేవాలయం కుంభాభిషేకం కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరి నియోజవర్గం ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ వారు ఘనంగా స్వాగతం పలికారు . అనంతరం స్వామి వారిని దర్శించుకుని, ఆయనకు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.