• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అన్నా, వదినా అంటూ ఆనంద్ దేవరకొండ పోస్ట్

విజయ్, రష్మిక పెళ్లి నేపథ్యంలో ఆనంద్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. వదిన తన కుటుంబంలో భాగమయ్యారని.. విజయ్, రష్మికతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశాడు. ‘ఇన్ని రోజులు మా కుటంబంలో నలుగురు మాత్రమే ఉండేవారు. ఇప్పుడు మా వదినమ్మ కూడా జాయిన్ అయ్యారు. పాజిటివ్ మనస్థత్వం కలిన వ్యక్తిని నా అన్న విజయ్ వివాహం చేసుకున్నాడు. వారు ఇలాగే నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నాడు.

February 27, 2026 / 07:40 AM IST

రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి

NLR: మనుబోలు మండలం కొమ్మలపూడి వద్ద గురువారం హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 17 ఏళ్ల అఖిల్ మృతి చెందాడు. నెల్లూరులో ఉపాధి కోసం బైకుపై వెళుతున్న అఖిల్, నిరంజన్లను లారీ ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో నిరంజన్‌కు తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై ఇంకా సమాచారం తెలియాల్సి ఉంది.

February 27, 2026 / 07:38 AM IST

ప్రమాదంలో ఒకరి మృతి.. ఇరువురికి గాయాలు

NLG: నార్కట్‌పల్లిలో దుకాణాల మీదికి దూసుకెళ్లిన లారీ ఘటనలో ఒకరు మృతి చెందగా ఇరువురికి గాయాలు అయ్యాయి. బండల లోడుతో వెళుతున్న లారీ అదుపు తప్పడంతో మాండ్రగామానికి చెందిన మేడి కృష్ణ లారీ కింద పడి మృతి చెందాడు. డ్రైవర్‌ను క్యాబిన్లో ఇరుక్కోగా పోలీసులు బయటికి తీశారు. పండ్ల వ్యాపారి గౌస్‌కు గాయాలయ్యాయి. మృతదేహాన్ని నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

February 27, 2026 / 07:37 AM IST

సికింద్రాబాద్‌లో నేడు కిషన్ రెడ్డి పర్యటన

TG: సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఇవాళ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పలు బస్తీలల్లో తిరగనున్నారు. ఉదయం 11 గంటలకు కోఠి విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో నిర్వహించే సమావేశానికి ఆయన హాజరుకానున్నారు. అనంతరం ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద బీసీల ధర్నాలో పాల్గొననున్నారు.

February 27, 2026 / 07:35 AM IST

గొర్రెల దాడి.. వృద్ధుడి మృతి

గొర్రెల దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వృద్ధుడు గురువారం రాత్రి మృతి చెందాడు. గోళ్లతోపు గ్రామం రంగనాథపురానికి చెందిన కృష్ణప్ప, కృష్ణమ్మ దంపతులపై శనివారం అదే గ్రామానికి చెందిన తిమ్మిరెడ్డి, బాబురెడ్డి సహా ఆరుగురు కర్రలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన కృష్ణప్పను బెంగళూరులోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

February 27, 2026 / 07:35 AM IST

వట్లూరు అంబేడ్కర్ గురుకుల ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల

ELR: వట్లూరులోని అంబేడ్కర్ గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలు మార్చి 1, 8 తేదీలలో నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ దాసరి మేరీ ఝాన్సీ రాణి తెలిపారు. మార్చి 1న 5వ తరగతి, ఇంటర్, ఐఐటీ, నీట్ అభ్యర్థులకు.. మార్చి 8న 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయన్నారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.

February 27, 2026 / 07:35 AM IST

నేడు ఉమా కామేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

SKLM: సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురంలో వంశధార నది తీరాన వెలసిన శ్రీ ఉమా కామేశ్వరస్వామి వారి కళ్యాణ మహోత్సవం శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు జి వాసు దేవశర్మ ప్రకటనలో తెలిపారు. అనంతరం మ.12 గంటల నుండి భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించ బడుతుందని పేర్కొన్నారు. భక్తులు పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలన్నారు.

February 27, 2026 / 07:34 AM IST

కోర్టు శిక్ష పడిన వారానికే బదిలీ..!

MDK: ఇటీవల ఓ భూ వ్యవహారంలో కోర్టు శిక్ష పడిన వారం రోజులకే మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ బదిలీ కావడం జిల్లాలో చర్చనీయాంశమైంది. రెండేళ్ల క్రితం మెదక్ కలెక్టర్‌గా ఆదిలాబాద్ నుంచి బదిలీపై వచ్చిన విషయం తెలిసిందే. కలెక్టర్‌గా అనేక అంశాల్లో తన మార్క్ చూయించారు. ఇటీవల చేగుంట మండలం బోనాలకు చెందిన భూ వ్యవహారంలో హైకోర్టు ఆరునెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించారు.

February 27, 2026 / 07:34 AM IST

నేడు ఎంజీబీఎస్‌లో గవర్నర్ పర్యటన

HYD: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జీవ ఆన్ వీల్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇవాళ మహాత్మాగాంధీ బస్ స్టేషన్‌ను సందర్శిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ మేరకు జీఐ టెక్నాలజీతో రూపొందించిన 6 బస్సులను గవర్నర్ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి MGBSలో ప్రారంభిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

February 27, 2026 / 07:33 AM IST

మార్చి 28 కి లోక్ అదాలత్ వాయిదా.!

NRPT: మార్చి 14 న జరగాల్సిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని అనివార్య కారణాల వల్ల మార్చి 28 కి వాయిదా వేసినట్లు సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్ తెలిపారు. గురువారం నారాయణపేట జిల్లా కోర్టులో పోలీస్, ఎక్సైజ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కోర్టుల చుట్టూ తిరగకుండా రాజీ మార్గం ద్వారా కేసులు త్వరగా పరిష్కరించుకోవాలని సూచించారు.

February 27, 2026 / 07:31 AM IST

కుమ్మెర ఘటనపై జప్తినాచారంలో కొవ్వొత్తుల నిరసన

నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో బీసీ, ఎస్సీ, ఎస్టీలపై జరిగిన దాడులను నిరసిస్తూ జప్తినాచారంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు రవీందర్ మాట్లాడుతూ.. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంబేడ్కర్ విగ్రహం నుంచి జరిగిన ఈ కార్యక్రమంలో DSP నేత శ్రీకాంత్,గ్రామ యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

February 27, 2026 / 07:30 AM IST

సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా ‘అరైవ్ అలైవ్’ : SI

ADB: ఆదిలాబాద్ రూరల్ ఎస్ఐ విష్ణువర్ధన్ ఆధ్వర్యంలో గురువారం రాణాదివ్వే నగర్ కాలనీలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా హెల్మెట్, సీట్బెల్ట్ ప్రాధాన్యతను వివరించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాంతకమని హెచ్చరించారు. ప్రమాదాల నివారణలో ప్రతి పౌరుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించి బాధ్యతగా వ్యవహరించాలని ఎస్ఐ కోరారు.

February 27, 2026 / 07:30 AM IST

మావో అగ్రనేత ‘బుక్క సత్తన్న’ ఎక్కడ..?

KNR: మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటు పర్వం కొనసాగుతున్న వేళ.. పాతతరం విప్లవకారుడు దేవరకొండ సత్యనారాయణ అలియాస్ ‘బుక్క సత్తన్న’ ఆచూకీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం గూడూరుకి చెందిన సత్తన్న, తండ్రి మరణం తర్వాత తల్లితో HZB మండలం చెల్పూర్ చేరారు. ఈ క్రమంలో PDPLలో ITI చదివి, 1975లో అజ్ఞాతంలోకి వెళ్లారు. ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారో తెలియలేదు.

February 27, 2026 / 07:30 AM IST

రూ.2 వేల కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చాం: మంత్రి

AP: పారిశ్రామికవేత్తలకు 20 నెలల్లోనే రూ.2 వేల కోట్లకు పైగా ప్రోత్సాహకాలు విడుదల చేసినట్లు మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఇందులో SC, ST పారిశ్రామికవేత్తలకు రూ.270 కోట్లు ఇచ్చామన్నారు. ఎవరి జోక్యమూ లేకుండా నేరుగా పారిశ్రామికవేత్తల ఖాతాల్లోనే ప్రోత్సాహకాలు జమయ్యేలా చూస్తున్నామన్నారు. టెండర్లలోSC, STలకు 4 శాతం రిజర్వేషన్ వర్తిపజేస్తున్నామని పేర్కొన్నారు.

February 27, 2026 / 07:27 AM IST

మెట్రోకు రుణాలు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన IRFRC

HYD: మెట్రోకు రుణాలు ఇచ్చేందుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFRC) సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రోరైల్ సంస్థకు, ఐఆర్ఎఫ్ఆర్సీకి మధ్య ప్రాథమికంగా అవగాహన ఏర్పడినట్లు సమాచారం. ఐఆర్ఎఫ్‌సీ అందజేసే రుణాలకు వడ్డీరేటుపైనే ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

February 27, 2026 / 07:26 AM IST