JN: దూల్మిట్ట, మద్దూరు మండలాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు నేడు స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనునిత్యం జనగామ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
BHPL: ప్రసిద్ధిగాంచిన కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లను భూపాలపల్లి సిఐ దొమ్మాటి నరేష్ కుమార్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన సీఐకి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికి ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలను అందజేశారు. అర్చకులు జూలపల్లి నాగరాజు, తదితరులు ఉన్నారు.
దేశ తీరప్రాంత రక్షణను మరింత బలోపేతం చేసేందుకు భారత నావికాదళం చెన్నైలో INS అంజాదీప్‌ను నియమించింది. స్వదేశీ సాంకేతికతతో తయారైన ఈ అత్యాధునిక యుద్ధనౌక, నిస్సార జలాల్లో శత్రు జలాంతర్గాములను గుర్తించి, ట్రాక్ చేస్తుంది. దీనిని డాల్ఫిన్ హంటర్ అని పిలుస్తారు. మన సముద్ర సరిహద్దుల భద్రతకు ఇది అత్యంత శక్తివంతమైన రక్షణ కవచంలా మారుతుంది. ఇది తీర ప్రాంత రక్షణకు ఎంతో దోహదపడుతుంది.
TG: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు సౌందర్ రాజన్ మృతిపై ఏపీ మాజీ సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు. సౌందర్ రాజన్ దశాబ్దాల పాటు చిలుకూరు బాలాజీ సేవలో అంకితభావంతో పనిచేశారని.. భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టిన గొప్ప ఆధ్యాత్మిక వేత్త అంటూ జగన్ పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకున్నారు.
TG: ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెండింగ్ బకాయిలు రూ.745 కోట్లు విడుదల చేసింది. విడతల వారీగా బకాయిలు విడుదల చేస్తామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు తాజాగా బకాయిలు విడుదలయ్యాయి. మరోవైపు గ్రామ పంచాయతీలకు సైతం రూ.389 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.
MHBD: అన్ని వర్గాల సంక్షేమానికి ప్రజాప్రభుత్వం సమాన ప్రాధాన్యతను కల్పిస్తుందని ఎమ్మెల్యే మురళినాయక్ అన్నారు. కేసముద్రం మున్సిపాలిటీ ఉప్పరపల్లి రోడ్లో వీర బ్రహ్మేంద్రస్వామి దేవాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. దేవాలయ నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.
MDCL: GHMC పరిధిలో ఆస్తి పన్ను బకాయిల వడ్డీపై 90 శాతం మాఫీ కల్పించే “వన్ టైమ్ సెటిల్‌మెంట్” పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అల్వాల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ బోగేశ్వర్లు సూచించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటి వరకు ఉన్న బకాయిలను కేవలం 10 శాతం వడ్డీతో ఒకేసారి చెల్లిస్తే రాయితీ వర్తిస్తుందని తెలిపారు. మార్చి 31 వరకు మాత్రమే ఈ అవకాశం ఉందన్నారు.
NZB: అర్బన్ నియోజకవర్గ అభివృద్ధి పనులపై నిర్వహించిన సమీక్షలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ గుప్తా, కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు సమయపాలన, నాణ్యతతో పూర్తి చేయాలని వారు సూచించారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు, ఇందిరమ్మ ఇళ్ల నిధుల విడుదల, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మరమ్మతుల పురోగతిపై చర్చించారు.
అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ 7.8 శాతం వృద్ధి నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో వృద్ధి రేటు 7.4 శాతంతో పోలిస్తే 0.4 శాతం పెరిగినట్లు పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 7.6 శాతం వృద్ధి నమోదు చేయొచ్చని అంచనా వేసింది. అలాగే జులై-సెప్టెంబర్ త్రైమానికానికి వృద్ధి రేటును 8.2 శాతం నుంచి 8.4 శాతానికి పెంచింది.
ప్రకాశం: బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత అని మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ తెలిపారు. శుక్రవారం కనిగిరిలో అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ శిబిరం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. బాల్య వివాహాలను అరికట్టేందుకు సమాజంలో విస్తృత అవగాహన అవసరమని, గ్రామాలను బాల్య వివాహ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడంలో అంగన్వాడీ కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలన్నారు.
NLG: హైదరాబాద్‌లోని మెడివిజన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మైనంపల్లి సర్పంచ్ రాంసింగ్ నాయక్ కుమార్తె గీతికను దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ పరామర్శించారు. ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు కంట్లో కత్తెర గుచ్చుకోవడంతో గీతికకు ఆపరేషన్ జరిగింది. బాలిక ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.
MDK: రేగోడ్(మం) గజవాడలో విద్యుత్ షాక్ తగిలి కుమ్మరి వెంకయ్య(65) మృతి చెందారు. తన ఇంటి ముందున్న రేకుల షెడ్డు వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో షాక్‌కు గురై కిందపడిపోయారు. ఈ క్రమంలో తల వెనుక భాగానికి తీవ్ర గాయం కావడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మేరకు ఎస్సై పోచయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
JN: జిల్లా కేంద్రంలో శిక్షణ పొందిన కల్లు గీత కార్మికులకు కాటమయ్య రక్ష కిట్లను పంపిణీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పంపిణీ చేశారు. కాటమయ్య కిట్లను గౌడ సోదరులు సద్వినియోగం చేసుకోవాలని, గౌడ కులస్తుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.
TG: మావోయిస్టుల లొంగుబాట్లపై అసెంబ్లీలో ప్రకటన చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత.. చట్టపరిధిలో ఏదైనా చేసుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ మావోయిస్టు దేవ్ జీ.. తెలంగాణ ప్రభుత్వ సరెండర్ పాలసీ బాగుందన్నారు. రివార్డ్ పాలసీని రూ.కోటికి పెంచాలని కోరామన్నారు. 5 ఎకరాల భూమి ఇవ్వడం సాధ్యంకాదన్నారు.
CTR: పుంగనూరు మండలం షుగర్ ఫ్యాక్టరీ సమీపాన వెంకట్ రెడ్డి యాదవ్ మామిడి తోటలో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఒకసారిగా మాటలు చెలరేగడంతో స్థానికులు గమనించి అగ్నిమాపక శాఖ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు ఆధ్వర్యంలో సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసి ఆర్పేశారు. ప్రమాదానికి గల కారణాలను విచారిస్తున్నారు.