• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

బైక్ అదుపుతప్పి, కాలువలో పడి యువకుడి మృతి

GNTR: ఫిరంగిపురం మండలం గుండాలపాడు సమీపంలోని రైస్ మిల్లు వద్ద శనివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. మునగపాడు గ్రామానికి చెందిన యడ్లపల్లి ప్రభుదాసు (24) తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, రాత్రి 9:30 గంటల సమయంలో బైక్ అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రభుదాసు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

February 22, 2026 / 04:34 AM IST

నేడు విద్యుత్ సరఫాలో అంతరాయం

SRPT: పెన్పహాడ్ సబ్ స్టేషన్లో మరమ్మతుల కారణంగా ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ ఏఈ శ్రీనివాస్ శనివారం తెలిపారు. మండల కేంద్రంతో పాటు దుబ్బతండా, పొట్లపహాడ్ గ్రామాలకు ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు విద్యుత్‌కు అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

February 22, 2026 / 04:29 AM IST

నేడు గుంటూరుకు సీఎం రాక.. భద్రతా ఏర్పాట్లపై ఎస్పీ తనిఖీ

GNTR: గుంటూరు బొమ్మిడాల నగర్‌లోని సత్యసాయి స్పిరిచ్యువల్ సిటీలో ఇవాళ తపాలా శాఖ ఆధ్వర్యంలో ‘డాక్ సేవక్ సమ్మేళనం’ జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింథియా, పెమ్మసాని చంద్రశేఖర్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో శనివారం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సభా ప్రాంగణాన్ని సందర్శించారు.

February 22, 2026 / 04:29 AM IST

రెండు బైక్‌లు ఢీ.. వ్యక్తి మృతి

SRPT: తిరుమలగిరి మండలంలోని వెలిశాలలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం పాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. లాక్యతండాకు చెందిన నెహ్రూ (30) బైక్‌పై వెళ్తుండగా, వెలిశాల పెట్రోల్ బంక్ సమీపంలో ఎదురుగా వచ్చిన మరో బైక్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నెహ్రూ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

February 22, 2026 / 04:25 AM IST

టెన్నిస్‌లో అదనపు ఎస్పీకి స్వర్ణం

NRPT: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వేదికగా జరుగుతున్న 4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ మీట్లో నారాయణపేట అదనపు ఎస్పీ ఎండీ.రియాజ్ హూల్ హక్ విశిష్ట ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. 50 ఏళ్లపై సీనియర్ అధికారుల లాన్ టెన్నిస్ విభాగంలో అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థులను సమర్థవంతంగా ఎదుర్కుని ప్రథమస్థానంలో నిలిచారు.

February 22, 2026 / 04:14 AM IST

పాత గుంటూరులో పేకాట స్థావరంపై దాడి

GNTR: పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. అంకమ్మతల్లి దేవాలయం సమీపంలోని అద్దె ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పేకాట కేంద్రాన్ని పోలీసులు ఛేదించారు. రెండో అంతస్తులో జూదం ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ. 45,000 నగదుతో పాటు 8 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

February 22, 2026 / 04:13 AM IST

కదిలే బస్సులో భారీ చోరీ

AP: ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సులో భారీ చోరీ జరిగింది. శ్రీదేవి అనే మహిళ ప్రొద్దుటూరు నుంచి కడపకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుండగా దుండగులు ఆమె బ్యాగులో ఉన్న 15 తులాల బంగారాన్ని అపహరించారు. ​దీంతో బాధితురాలు కేకలు వేయడంతో డ్రైవర్ బస్సును కమలాపురం పీఎస్‌కు తరలించారు. ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు అనుమానితుల కోసం ఆరా తీస్తున్నారు.

February 22, 2026 / 02:58 AM IST

హత్య కేసు.. నలుగురు పోలీసులపై వేటు

AP: ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కూటమి ప్రభుత్వం నలుగురు పోలీసులపై వేటు వేసింది. కేసులో నాటి పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని డీఎస్పీలు భీమరావు, మురళికృష్ణతో పాటు ఎస్ఐలు సతీష్ బాబు, మురళీకృష్ణపై సస్పెండ్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

February 22, 2026 / 02:58 AM IST

ఫిబ్రవరి 22: టీవీలలో సినిమాలు

స్టార్ మా: ఫిదా(8AM), మ్యాడ్-2(1PM), విరూపాక్ష(3:30PM); జీతెలుగు: శ్రీమంతుడు(9AM), అయాలాన్(12PM), కార్తికేయ-2(3PM), సంక్రాంతికి వస్తున్నాం(6PM); ఈటీవీ: అల్లుడుగారు(9:30AM); స్టార్‌మా మూవీస్: మాస్(7AM), నేనేరాజు నేనేమంత్రి(9AM), ఛత్రపతి(12PM), MS ధోనీ(3PM), KGF-1(6PM), S/O సత్యమూర్తి(9PM); జీ సినిమాలు: గీతాంజలి(7AM), ఆయ్(10AM), సరిపోదా శనివారం(12PM), ఆనందో బ్రహ్మ(6PM).

February 22, 2026 / 01:58 AM IST

‘నా భర్తకు ప్రియుడున్నాడు.. నన్ను చంపేస్తారు’

AP: సత్యసాయి జిల్లా ధర్మవరంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. తన భర్తకు ప్రియుడు ఉన్నాడని భార్య పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన భర్తకు మరో వ్యక్తితో కొంతకాలంగా అనైతిక సంబంధం ఉందని ఆమె ఆరోపించింది. ఇద్దరూ కలిసి బెడ్‌రూమ్‌లో సన్నిహితంగా ఉండటం తాను చూసినట్లు తెలిపింది. ఈ విషయం బయటికి చెప్తే చంపేస్తామని తనను బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొంది.

February 22, 2026 / 01:50 AM IST

ఫిబ్రవరి 22: ఆదివారం పంచాంగం

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం; ఉత్తరాయణం; శిశిర రుతువు, ఫాల్గుణ మాసం, శుక్ల పక్షం పంచమి: మ.12:09 తదుపరి షష్ఠి; అశ్విని: రా.7:01 తదుపరి భరణి; వర్జ్యం: మ.3:13 నుంచి 4:45 వరకు; తిరిగి తె.4:02 నుంచి 5:32 వరకు; అమృత ఘడియలు: మ.12:11 నుంచి 1:42 వరకు; దుర్ముహూర్తం: సా.4:27 నుంచి 5:13 వరకు; రాహుకాలం: సా.4:30 నుంచి 6:00 వరకు సూర్యోదయం: ఉ.6:28; సూర్యాస్తమయం: సా.6:00.

February 22, 2026 / 01:19 AM IST

అనసూయ అంటే నాకు గౌరవం ఉంది: శివాజీ

గతంలో అమ్మాయిల దుస్తులపై చేసిన వ్యాఖ్యలపై నటుడు శివాజీ తాజాగా స్పందించాడు. తాను ఆ సమయంలో రెండు పదాలు వాడినందుకు మానసిక సంఘర్షణకు గురైనట్లు తెలిపాడు. అలాగే, తాను అనసూయను కూడా ఏమీ అనలేదని చెప్పాడు. ఆమెతో తనకు పరిచయం కూడా తక్కువని.. ఆమె అంటే తనకు గౌరవం ఉందన్నాడు. ఈ ప్రపంచంలో మగవారు ఉద్దేశపూర్వకంగా ఆడవాళ్లను కించపరచాలని అనుకోరనేది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పుకొచ్చాడు.

February 22, 2026 / 12:59 AM IST

ఫిబ్రవరి 22: చరిత్రలో ఈరోజు

➢1847: ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ఉరితీసిన బ్రిటిష్ ప్రభుత్వం➢1944: కస్తూర్భా గాంధీ మరణం➢1958: స్వాతంత్ర్య సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ మరణం➢1997: బుర్రకథ పితామహుడు షేక్ నాజర్ మరణం➢1992: జమ్మూకాశ్మీర్ సంకల్ప దివస్➢కవలల దినోత్సవం➢ప్రపంచ ఆలోచన దినోత్సవం

February 22, 2026 / 12:47 AM IST

వారంతా అద్భుతాలు సృష్టిస్తున్నారు: మిథున్

అంధుల క్రికెట్‌లో టీమిండియా ప్లేయర్లు అద్భుతాలు సృష్టిస్తున్నారు. దృష్టిలోపం ఉన్నప్పటికీ క్రికెట్‌లో తమ సత్తా ఏంటో ప్రపంచానికి చాటిచెప్పారని బీసీసీఐ అధ్యక్షుడు మిథన్ మన్హాస్ కొనియాడారు. వారి విజయాలు భారత క్రికెట్‌కు ఎంతో గర్వకారణమని తెలిపారు. అత్యుత్తమ మౌలిక సదుపాయాలను కల్పించడం, ప్లేయర్లకు గుర్తింపును అందించడమే బీసీసీఐ లక్ష్యమని మిథున్ వెల్లడించారు.

February 22, 2026 / 12:40 AM IST

బీసీసీఐ కీలక నిర్ణయం

ఇటీవల అంధుల క్రికెట్‌లో టీమిండియా మెన్స్, ఉమెన్స్ జట్లు ప్రపంచకప్‌లను గెలిచాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో రెండు అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనేందుకు అవసరమైన ప్రయాణ సదుపాయాలు, స్వదేశం వేదికగా జరిగే ద్వైపాక్షిక సిరీసుల్లో పాల్గొనే ప్లేయర్లకు వసతితో పాటు దేశవాళీ, అంతర్జాతీయ మ్యాచులు ఆడే సదుపాయం కల్పించనుంది.

February 22, 2026 / 12:30 AM IST