శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగిసింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి ఆ జట్టు 168 పరుగులు చేసింది. ఒక దశలో 12.1 ఓవర్లలో 84 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును సాంట్నర్ (47), మెక్‌కాంచీ (31) ఆదుకున్నారు. వీరిద్దరూ 7వ వికెట్‌కు 47 బంతుల్లో 84 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. చమీర, తీక్షణ తలో 3 వికెట్లు పడగొట్టారు.
NLR: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఉపవాస దీక్షలు చేపట్టే ముస్లిం సోదరుల సౌకర్యార్థం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వాటర్ కూలర్ల వితరణ చేశారు. బుచ్చిరెడ్డి పాళెం మండలంలోని దామరమడుగు, పెనుబల్లి వవ్వేరు, చెల్లాయపాలెం, పంచేడు గ్రామాలలోని 5 మసీదు కమిటీ సభ్యులకు వీటిని అందజేశారు. మసీదులోకి వచ్చే ముస్లింల సౌకర్యార్థం కూలర్లను ఇచ్చినట్లు ఆమె తెలిపారు.
ADB: మహిళలు స్వయం ఉపాధితో ఆర్థిక అభివృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని బెల్లూరు కాలనీలో మహిళ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోకో పిట్ యూనిట్‌ను మున్సిపల్ ఛైర్‌పర్సన్ అనూషతో కలిసి ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా, మున్సిపల్ కమిషనర్ రాజు, మెప్మా పీడీ రాజు తదితరులు ఉన్నారు.
NRML: ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం సమావేశంలో వారు మాట్లాడతూ.. అవగాహన కార్యక్రమాలు, వర్క్ షాప్‌లు నిర్వహించాలని సూచించారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో చైతన్యం కల్పించాలని తెలిపారు. ఫుడ్ సేఫ్టీ నియమాలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని ఎస్పీ జానకి షర్మిల హెచ్చరించారు.
KMM: ముదిగొండ మండలం గంధసిరి గ్రామంలో పోలీసులు బుధవారం పెట్రోలింగ్ నిర్వహించారు. ఆ సమయంలో ఒంటరిగా తిరుగుతున్న పదేళ్ల బాలుడిని ఎస్సై హరిత చేరదీసి విచారించారు. తన పేరు కట్టా పెనుకొండయ్య, జగ్గయ్య పేట అని చెప్పాడు. మిగతా వివరాలు కూడా ఎస్ఐ హరిత తెలుసుకున్నారు. ఎంతో చాకచక్యంగా వ్యవహరించి తల్లి బిడ్డను కలిపారు. దీంతో పలువురు ఆమెని ప్రశంసించారు.
KDP: గంజాయి, నిషేధిత మత్తు పదార్థాల వినియోగం, బహిరంగ మద్యపానం, అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు స్పెషల్ పార్టీలతో పాటు డ్రోన్ కెమెరాల ద్వారా అనుమానిత ప్రాంతాల్లో నిఘా పెంచారు. నిందితులను గుర్తించి కౌన్సిలింగ్, చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు.
AP: తిరుమలలో వసతి గదులు ఇప్పిస్తామంటూ భక్తులను మోసం చేస్తున్న నకిలీ వెబ్‌సైట్లపై టీటీడీ అప్రమత్తమైంది. ఓ భక్తుడు మోసపోయిన ఘటనలో TTD విజిలెన్స్ విభాగం సమగ్ర విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో దీనిపై చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు TTD ఐటీ విభాగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్శనం, వసతి గదులు, సేవా టికెట్లను అధికారిక వెబ్‌సైట్ ద్వారానే బుక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
SRD: చౌటకూర్ మండలం బొమ్మరెడ్డి గూడెం గ్రామంలో బుధవారం హైదరాబాద్ బాచుపల్లి మమత హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత విద్య శిబిరం నిర్వహించారు. బీపీ షుగర్ తన అన్ని రకాల అనారోగ్య సమస్యలకు చికిత్సలు అందజేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ ఉచిత శిబిరంలో 90 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జయపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
E.G: కలుషిత పాలు కారణంగా వైద్య సహాయం అవసరమయ్యే రోగులకు ఫోమెబెస్ట్ యాంటీడోట్ అందించడం కోసం ముంబై నుండి ప్రత్యేకంగా తీసుకువస్తున్నారని కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం వెల్లడించారు. రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఈ ఇంజెక్షన్ ఉపయోగించవచ్చని చెప్పారు. ఈ మందు అంతర్జాతీయ స్థాయిలో సంప్రదించి ఏజెన్సీల ద్వారా తీసుకువస్తున్నామన్నారు.
TG: విద్యార్థుల ఆధార్ అప్‌డేషన్‌పై విద్యాశాఖ స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ఏప్రిల్ 2026 నాటికి 100 శాతం ఆధార్ నమోదు పూర్తి చేయాలని నిర్ణయించింది. పాఠశాలల్లోనే ఆధార్ నమోదు, బయోమెట్రిక్ అప్‌డేషన్ సదుపాయం కల్పించనుంది. 5 ఏళ్లు నిండినవారికి 15 ఏళ్లు పూర్తయిన విద్యార్థులు తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.
WGL: పట్టణ కేంద్రంలోని కాశిబుగ్గ SR నగర్‌లో బుధవారం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క లంబాడి మహిళలతో కలిసి నృత్యాలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సంత్ సేవాలాల్ మహారాజ్ ఆశయాలను కొనసాగించాలన్నారు.
HNK: బాల్యవివాహాల నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం మహిళా శిశు సంక్షేమ శాఖ, జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ షేర్ ఎన్టీవో, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వరంగల్ విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన ప్రచార రథాన్ని CP సన్ ప్రీత్ సింగ్ ప్రారంభించారు. బాల్యవివాహాలను ప్రోత్సహిస్తే చర్యలు తప్పవని CP అన్నారు.
SRCL: బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామంలో బుధవారం శ్రీ దత్తాత్రేయ స్వామి ప్రధాన అర్చకులు శ్రీ సంకెపెల్లి చంద్రమౌళి పంతులు మృతి చెందారు. ఆయన స్వామి వారికి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ, ఆయన లేని లోటును ఎవరూ తీర్చలేరని వరదవెల్లి గ్రామ ప్రజలు, భక్తులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.
VKB: మర్పల్లి మండల విద్యాధికారి (ఎంఈవో)గా అశోక్ నియామకం అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన ఘనపూర్ జడ్పీహెచ్ఎస్‌లో జీహెచ్ఎంగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం మండల విద్యాధికారిగా అంజీలయ్య కొనసాగుతున్నారు. కాగా, ప్రభుత్వం సీనియారిటీ ప్రకారం నియామకం చేపట్టడంతో అశోక్‌ను మర్పల్లి మండల విద్యాధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది.
ASF: వాంకిడి మండలం ఖీరిడి గ్రామ ZPSS పాఠశాలలో షీ టీమ్ సభ్యులు విద్యార్థులకు బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పరీక్షల సమయంలో సమస్యలు ఎదురైతే వెంటనే తెలియజేయాలని సూచించారు. సోషల్ మీడియా, ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని విద్యార్థులకు వివరించారు.