CTR: వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గంగవరంలో గురువారం పర్యటించారు. పలువురు పార్టీ నాయకులు ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. పార్టీ కార్యకలాపాలపై వారికి ఆయన దిశా నిర్దేశం చేశారు. పెద్దిరెడ్డిని కలిసిన వారిలో జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యేలు వెంకటేష్ గౌడ, సునీల్ కుమార్, మాజీ ఎంపీ రెడ్డప్ప తదితరులు ఉన్నారు.
SDPT: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ 3వ యూనిట్ ఆధ్వర్యంలో జక్కాపూర్ గ్రామంలో ప్రత్యేక శీతాకాల శిబిరం కొనసాగుతోంది. శిబిరం రెండో రోజు వాలంటీర్లు గ్రామంలోని అన్ని వీధుల్లో స్వచ్ఛ భారత్ ర్యాలీ నిర్వహించారు. నినాదాలు, పాటల ద్వారా పరిసరాల పరిశుభ్రతపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. గ్రామాన్ని నిర్మలంగా ఉంచుకోవడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న అతడు, జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో కేవలం 26 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో అభిషేక్ 3 ఫోర్లు, 4 సిక్సర్లతో బాదాడు. దీంతో భారత్ భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది. ప్రస్తుతం టీమిండియా 10.4 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది.
శ్రీకాకుళం వాంబే కాలనీకి చెందిన పైల మోహన్ రావు (40) పొన్నాడ వంతెన సమీపంలో గురువారం శవమై కనిపించారు. గత రెండు రోజులుగా ఆచూకీ లేని మోహన్ రావు కోసం కుటుంబ సభ్యులు గాలిస్తుండగా, రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నాడు. మృతుని తలపై తీవ్ర గాయాలు ఉండటంతో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రకాశం: ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని దర్శి మోటార్ వాహనాల తనిఖీ అధికారి రవికుమార్ హెచ్చరించారు. గురువారం పామూరులో నిర్వహించిన తనిఖీల్లో టాక్స్ చెల్లించని ఒక స్కూల్ బస్సు, రెండు టిప్పర్లకు మొత్తం రూ.1.55 లక్షల జరిమానా విధించినట్లు తెలిపారు. రవాణా వాహనాలు విధిగా ట్యాక్స్ చెల్లించి, రోడ్డు భద్రతా నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు.
NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మరాశిపల్లి గ్రామానికి చెందిన సుద్ధకంటి బాలమ్మకు మంజూరైన సీఎం సహాయ నిధి (CMRF) చెక్కును కౌన్సిలర్ కరుణాకర్ రెడ్డి గురువారం అందించారు. అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన బాధితురాలికి MLA కసిరెడ్డి నారాయణరెడ్డి సాకారంతో ఈ ఆర్థిక సాయం అందింది. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
KNRL: వెల్దుర్తి(మం) రామళ్లకోట గ్రామానికి చెందిన 63 ఏళ్ల కూలీ బోయ నాగయ్య ఎడమ కాలికి గాయమై సెప్టిక్ కావడంతో పిక్కల వరకు తొలగించాల్సి వచ్చింది. ప్రస్తుతం వికలాంగుడిగా మారి ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హెల్పింగ్ హాండ్స్ సేవా సంస్థ అధ్యక్షుడు హరి సింహనాయుడు ఇవాళ పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు.
నల్గొండ తొలి మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవలే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్ ఎన్నికైనటువంటి శ్రీమతి శ్రీ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా మేయర్ భువనగిరి ఎంపీ చామలను ఘనంగా సత్కరించారు.
PPM: గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్‌పేట చెక్‌పోస్ట్ వద్ద సీఐ హరిబాబు ఆధ్వర్యంలో ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్ లేకుండా, పత్రాలు లేని వాహనదారులకు జరిమానాలు విధించి పెండింగ్ చలానాలు చెల్లించాలని హెచ్చరించారు. అక్రమ రవాణా నిరోధానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, మద్యం సేవించి వాహనం నడిపితే భారీ జరిమానాలు విధిస్తామని తెలిపారు.
AP: లిక్కర్ కేసులో A7గా ఉన్న ముప్పిడి అవినాష్ రెడ్డికి రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ‘ఆర్థిక లావాదేవీల్లో అవినాష్ కీలక పాత్ర పోషించారు. లిక్కర్ కంపెనీల నుంచి ముడుపులు తీసుకున్నారు. కొత్త బ్రాండ్లు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. APBCLను అవినాష్ నడిపించారు. రూ.21 కోట్ల నకిలీ బిల్లులు సృష్టించారు’ అని సిట్ అధికారులు వెల్లడించారు.
NLG: చిట్యాల మండలం గుండ్రాంపల్లి ZPHSలో ఎన్పీ ఫౌండేషన్ పదవ తరగతి మెరిట్ విద్యార్థులకు రూ.5,116 నగదు బహుమతిని ప్రకటించారు. ఫౌండేషన్ ఛైర్మెన్, సెక్రెటరీ తన్నీరు నిర్మలాదేవి, రాం ప్రభు విద్యార్థులకు ఇవాళ రాత సామాగ్రిని పంపిణీ చేయడంతో పాటు పాఠశాలకు కుర్చీలను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రంలో హెచ్‌ఎం రమాదేవి, నర్సింగ్ రాజు, చిట్టిబాబు పాల్గొన్నారు.
NZB: భద్రాచలంలో మార్చి 27న జరిగే శ్రీసీతారాముల కళ్యాణం తలంబ్రాలను భక్తుల ఇంటికే చేరవేస్తామని నిజామాబాద్ ఆర్ఎం జోత్స్న తెలిపారు. సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించి మాట్లాడారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల భక్తులు కేవలం రూ.151 చెల్లించి ఆర్టీసీ కార్గో కేంద్రాల్లో ఈ నెల 25 నుంచి మార్చి 31 వరకు బుక్ చేసుకోవచ్చన్నారు.
TG: గ్రూప్ 1,2 ఉద్యోగుల శిక్షణా ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి ఎంత కష్టపడ్డారో.. ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా అలాగే ఉండాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న గరం, నరం, భేషరం అనే నానుడి తప్పు అని ప్రూవ్ చేయాలన్నారు. ఉద్యోగంలో చేరనప్పటి నుంచి రిటైర్మెంట్ వరకూ ఒకేలా పనిచేయాలన్నారు.
PPM: సీతానగరం మండలం కృష్ణరాయపురం గ్రామ మాజీ సర్పంచ్ రెడ్డి అప్పలనాయుడును మాజీ ఎమ్మెల్యే జోగారావు గురువారం పరామర్శించారు. ఇటీవల అనారోగ్య కారణంతో విశాఖపట్నంలో చికిత్స పొంది స్వగ్రామానికి విచ్చేసిన ఆయనను పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలని పార్టీ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు.
MHBD: మహబూబాబాద్ పట్టణంలో రైల్వేమెగా ఫ్రెయిట్ మెయింటెనెన్స్ డిపో ఏర్పాటు చేయాలని సాధన కమిటీ ప్రతినిధులు నేడు సికింద్రాబాద్ రైల్వే నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీనివాస్ మల్లాడిని కలిసి విజ్ఞప్తి చేశారు. డిపో కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా స్థలం ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. ప్రతిపాదనలను రైల్వే బోర్డు ఆమోదానికి పంపనున్నట్లు తెలిపారు.