• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గోడ పత్రిక ఆవిష్కరణ

అనకాపల్లి సీపీఐ జిల్లా కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మార్చి 9వ తేదీ నుండి 14వ తేదీ వరకు చేసే రిలే నిరాహార దీక్షలు జయప్రదం చేయాలని కోరుతూ గోడపత్రికలు విడుదల చేశారు. జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ,బీసీ మహిళ వసతి గృహాలు ఏర్పాటు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఫణీంద్ర డిమాండ్ చేశారు. ప్రస్తుతానికి ఒకే ఒక మహిళా వసతి గృహం ఉందన్నారు.

February 25, 2026 / 05:22 PM IST

త్వరలో విశాఖలో ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్: సత్యకుమార్

AP: రాష్ట్రవ్యాప్తంగా పాల కేంద్రాలపై తనిఖీలు చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ‘త్వరలో విశాఖలో ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతం శాంపిల్స్ హైదరాబాద్‌కు పంపిస్తున్నాం. శ్రీకాకుళంలో పరిస్థితి అదుపులో ఉంది. కలుషిత నీటి వల్లే డయేరియా కేసులు. రాజమండ్రి కల్తీ పాల వ్యవహారంపై అధ్యయనం చేస్తున్నాం’ అని వెల్లడించారు.

February 25, 2026 / 05:21 PM IST

పేలుడు ఘటనలో ఇద్దరికి గాయాలు

W.G. మొగల్తూరు కుక్కలవారితోటలో బుధవారం విచారకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ ఇంటికి రంగులు వేసే పనుల్లో భాగంగా చెద పట్టకుండా స్ప్రే చేస్తున్న సమయంలో ప్లాస్టిక్ మందు క్యాన్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడే పనిచేస్తున్న వనం రాజేష్, వనం నారాయణ రావులకు తీవ్ర గాయాలయ్యాయి. వైద్యం నిమిత్తం వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

February 25, 2026 / 05:21 PM IST

కోడిపందాలు నిర్వహిస్తున్న నలుగురు అరెస్ట్

కృష్ణా: గుడివాడ మండలం బొమ్ములూరు గంగానమ్మ గుడి సమీపంలో కోడి పందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీస్ సిబ్బందితో కలిసి ఎస్సై చంటిబాబు కోడిపందాల స్థావరంపై బుధవారం దాడి చేశారు. ఈ సందర్భంగా నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి ఒక కోడిపుంజు, కోడి కత్తి, రూ.1200 నగదు రెండు బైకులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

February 25, 2026 / 05:20 PM IST

రేపు ఆత్మకూరులో జాబ్ మేళా

NDL: APSSDC ఆధ్వర్యంలో ఆత్మకూరు ప్రభుత్వ పాఠశాలలో గురువారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీకాంత్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో 14 కంపెనీల ప్రతినిధులు పాల్గొని నిరుద్యోగులను ఎంపిక చేస్తారని తెలిపారు. 10వ తరగతి నుంచి పైచదువులు చదివిన వారు అర్హులని తెలిపారు. ఎంపికైన వారికి నెలకు రూ.13 వేల-36 వేల వరకు వేతనం ఉంటుందని చెప్పుకొచ్చారు.

February 25, 2026 / 05:20 PM IST

అక్రమంగా తరలిస్తున్న పశువులు పట్టివేత

SKLM: అక్రమంగా తరలిస్తున్న పశువులను మందస పోలీసులు పట్టుకున్నారు. ఇచ్చాపురం నుండి పలాస వైపు వెళ్లే రెండు బొలెరో వాహనాలలో 13 గేదెలను తరలిస్తుండగా హరిపురం జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పశువులను రక్షణ నిమిత్తం పశు సంరక్షణ కేంద్రాలకు తరలించారు. ఈ ఘటనపై మందస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై కె కృష్ణ ప్రసాద్ తెలిపారు.

February 25, 2026 / 05:19 PM IST

పేదల గుడిసెల కూల్చివేత అమానుషం: MP

KMM: ఖమ్మం శివారు వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పదేళ్లుగా నివసిస్తున్న 600 పేదల గుడిసెలను జేసీబీలతో కూల్చివేయడాన్ని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తీవ్రంగా ఖండించారు. కనికరం లేకుండా పేదలపై బలప్రయోగం చేయడం దుర్మార్గమని, కూల్చివేతలు నిలిపివేసి అర్హులకు తక్షణమే ఇంటి పట్టాలు పంపిణీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

February 25, 2026 / 05:19 PM IST

నిరూపిస్తే రాజీనామా చేస్తా.. కౌశిక్ రెడ్డి సవాల్

TG: తాను మతమార్పిడులు చేస్తున్నట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు. తాను 50 మందితో పోయినట్లు చెబుతున్నారని.. వీడియో చూపిస్తే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. జమ్మికుంట సీఐ, హుజూరాబాద్ డీస్పీతో పాటు కరీంనగర్ ఎస్పీ దందాలు చేస్తున్నారని ఆరోపించారు. అన్ని ఆధారాలను బయటపెడతానని తెలిపారు.

February 25, 2026 / 05:18 PM IST

విశాఖలో మాజీ సీఎంకి ఘనస్వాగతం

VSP: మాజీ సీఎం, బీజేపీ కీలక నేత నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి బుధవారం విశాఖ నగరానికి చేరుకున్నారు. విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. బాలరాజేశ్వరరావు, రవీందర్ రెడ్డి, దీపిక రెడ్డి పుష్పగుచ్ఛాలు అందజేసి సాలువాతో సత్కరించారు. ఆయన రాకతో విమానాశ్రయం ప్రాంగణం నినాదాలతో మార్మోగింది.

February 25, 2026 / 05:18 PM IST

మీడియా వారికి అక్రెడిటేషన్ కార్డుల అందజేత

TPT: కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ బుధవారం మీడియా ప్రతినిధులకు అక్రెడిటేషన్ కార్డులను అందజేశారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బాధ్యతాయుతమైన జర్నలిజం సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరేలా చూడాలన్నారు.

February 25, 2026 / 05:17 PM IST

గ్రామాభివృద్ధికి సమిష్టి కృషి

PLD: మాచవరంలో మంగళవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. గ్రామాల అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని ఎంపీపీ అంజమ్మ కోరారు. వర్షాలతో ఈ ఏడాది వ్యవసాయం లాభసాటిగా సాగిందని స్పెషల్ ఆఫీసర్ కృష్ణదేవరాయలు తెలిపారు. కుక్కలు, కోతుల బెడదను అరికట్టాలని ఎంపీడీవో విష్ణు చిరంజీవి సూచించారు. అలాగే రూ.1.20కోట్లతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.

February 25, 2026 / 05:15 PM IST

విద్యార్థులకు వైద్య పరీక్షలు

JGL: రాయికల్ మండలంలోని భూపతిపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో IMA ఆధ్వర్యంలో బాలికలకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. 115 మంది బాలికలకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించి అనీమియాతో బాధపడుతున్న 73 మంది బాలికలకు నెలకు సరిపడా మందులు, సానిటరీ ప్యాడ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు హేమంత్, శ్రీనివాసరెడ్డి, అచ్యుత్, సాహితీ, సర్పంచ్ భావన పాల్గొన్నారు.

February 25, 2026 / 05:12 PM IST

మొక్కల పెంపకంపై విద్యార్థులకు అవగాహన

AKP: కోటవురట్ల ప్రభుత్వ హైస్కూల్లో 6, 7, 8వ తరగతుల విద్యార్థులకు బుధవారం ఫ్రీ ఒకేషనల్ విజిట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా మండలంలో గొట్టివాడ గ్రామంలో అటవీ శాఖ నర్సరీని సందర్శించారు. మొక్కల పెంపకంపై వారికి అవగాహన కల్పించారు. అనంతరం రాజుపేటలో పామాయిల్ మొక్కల పెంపకం గురించి వివరించారు. కైలాసపట్నంలో లక్క బొమ్మల తయారీ గురించి తెలుసుకున్నారు.

February 25, 2026 / 05:12 PM IST

తప్పులు చేస్తూ నిందలు మోపుతున్నారు: CM

AP: కలియుగ దైవం వెంకటేశ్వరుడికి కల్తీ నెయ్యితో ప్రసాదం తయారు చేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. సుమారు 20 కోట్ల లడ్డూలను కల్తీ నెయ్యితోనే తయారు చేశారని ఆయన పేర్కొన్నారు. కెమికల్స్‌లో నెయ్యిని కల్తీ చేసి, ఇప్పుడు ఆ నెపం తమపై వేస్తున్నారని మండిపడ్డారు. తప్పులు చేస్తూ హెరిటేజ్ సంస్థపై నిందలు మోపుతున్నారని విమర్శించారు.

February 25, 2026 / 05:11 PM IST

రంజాన్ దీక్షలు.. ముస్తాబైన మసీదులు

MDCL: పవిత్ర రంజాన్ మాసం నేపథ్యంలో మల్కాజ్‌గిరి, గౌతంనగర్, ఇందిరానగర్, మౌలాలి, నేరెడ్మెట్ ప్రాంతాల్లోని మసీదులు విద్యుత్ దీపాలతో ముస్తాబయ్యాయి. ఉదయం సేహరీతో ప్రారంభమయ్యే దీక్షలు సాయంత్రం ఇఫ్తార్‌తో ముగుస్తాయి. రాత్రివేళ తరావీహ్ నమాజ్‌లకు భక్తులు భారీగా హాజరవుతున్నారు. జకాత్, ఫిత్రా ద్వారా అవసరమైన వారికి సహాయం అందిస్తున్నారు.

February 25, 2026 / 05:09 PM IST