ప్రకాశం: ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి 15 నాటికి 100 శాతం ఇంటి పన్నులు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకొని, బెస్తవారిపేట ఎంపీడీవో రంగనాయకులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇంటి పన్ను వసూళ్ల స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా మండలం లోని నేకునాంబాద్, సలకలవీడు గ్రామ పంచాయతీలను సందర్శించారు. గ్రామస్థులను వ్యక్తిగతంగా కలిసి ఇంటి పన్నులు చెల్లించాలని అవగాహన కల్పించారు.
MNCL: కోటపల్లి మండలం అర్జునగుట్ట గ్రామంలోని పలు అనుమానిత ప్రాంతాల్లో సోమవారం పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. SI రాజశేఖర్ వివరాల ప్రకారం.. తనిఖీల్లో నిల్వ ఉంచిన ప్రభుత్వ నిషేధిత గుడుంబాను తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు. తనిఖీల్లో పట్టుబడిన ముగ్గురు వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు SI పేర్కొన్నారు.
సత్యసాయి: నల్లచెరువు మండలం పాలపాటి దీన్నే ఆంజనేయస్వామి ఆలయాన్ని మంగళవారం చంద్రగ్రహణం వల్ల మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో నరసింహారాజు తెలిపారు. ఈ సందర్బంగా ఈవో మాట్లాడుతూ.. చంద్రగ్రహణం వల్ల గర్భగుడిని మూసివేస్తున్నట్లు తెలిపారు. తిరిగి బుధవారం ఉదయం 8 గంటలకు ఆలయాన్ని తెరుస్తామని భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు అనుమతిస్తామని పేర్కొన్నారు.
NDL: బండిఆత్మకూరు మండలం సంతజూటూరులో సోమవారం రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమం తహసీల్దార్ పద్మావతమ్మ ఆద్వర్యంలో చేపట్టారు. గ్రామంలో మొత్తం 865 పాసుపుస్తకాలు ఉండగా, అర్హులైన 648 మంది రైతులకు అందజేశామని తహశీల్దార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామచంద్రుడు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
ADB: కంది పంటతోపాటు కోతకు వచ్చిన శనగ పంటను మద్దతు ధరతో త్వరగా కొనుగోలు చేయాలని జైనథ్ మండల రైతులు కోరారు. సోమవారం MLA పాయల్ శంకర్‌ను కలిసి యాసంగి పంటలను కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. మార్కెట్ యార్డులో జొన్న, మొక్కజొన్న పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు.
BDK: ఇల్లందు మండలం కొమ్ముగూడెం గ్రామపంచాయతీలో ప్రసిద్ధిగాంచిన శ్రీకృష్ణ భగవానుని దేవాలయంలో సోమవారం కళ్యాణం నిర్వహించారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య వేణుగోపాల స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వేణుగోపాల స్వామి వారి కళ్యాణం ప్రతి సంవత్సరం మార్చి నెలలో ఘనంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీ వారిని అభినందించారు.
JGL: రాయికల్ మండలంలోని చింతలూరు గ్రామంలో సోమవారం శ్రీ రుక్మిణి సత్యభామ సహిత వేణుగోపాల స్వామి కళ్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ ద్వి దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని వేడుకలను కన్నుల పండువగా నిర్వహించారు. రాయికల్, బోర్నపల్లి, వస్తాపూర్, ఒడ్డె లింగాపూర్ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనగా, భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.
VZM: సెన్సస్-2027 గృహ సర్వే సంబంధిత అధికారుల కోసం మూడు రోజుల శిక్షణా కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభం అవుతుందని DRO మురళి సోమవారం తెలిపారు. చింతలవలస MVGR ఇంజనీరింగ్ కాలేజ్‌లో ఈ నెల ఐదు వరుకు శిక్షణ కొనసాగుతుందని తెలిపారు. ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5:30 వరకు జరుగుతుందని, అధికారులు హాజరుకావాలన్నారు.
VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో లోక్ నాయక్ ఫౌండేషన్ అవార్డు గ్రహీత ఆచార్య వెలమల సిమ్మన్నకు సోమవారం ఘన సన్మానం నిర్వహించారు. తెలుగు శాఖాధ్యక్షుడు ఆచార్య జర్రా అప్పారావు అధ్యక్షతన జరిగిన సభలో పలువురు అధ్యాపకులు సిమ్మన్నను “నడిచే గ్రంథాలయం”గా కొనియాడారు. శతాధిక గ్రంథ రచనలు చేసి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారని ప్రశంసించారు.
WGL: నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మున్సిపల్ ఛైర్పర్సన్ పెండెం లక్ష్మి రామానంద్ అన్నారు. నర్సంపేట 9,12వ వార్డుల్లో ఆయా వార్డు కౌన్సిలర్లతో కలిసి ఛైర్పర్సన్ పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్ గంధం నరేందర్ గుప్తా, తదితరులు ఉన్నారు.
CTR: సంతాన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం, ఆలతూర్ శ్రీ వరద వెంకటేశ్వర స్వామి ఆలయాలలో అన్నదాన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని కార్వేటినగరంకు చెందిన పాలప్ప రెడ్డి రమేష్, జగదీష్ తమ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేయబడింది.
‘ధురంధర్’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో, దాని సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, హోలీ సందర్భంగా ఈనెల 5న ట్రైలర్ విడుదల కానున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, ఈ ప్రచారాన్ని చిత్ర బృందం తాజాగా ఖండించింది. ట్రైలర్ విడుదలకు ఇంకా సమయం ఉందని పేర్కొంటూ.. త్వరలోనే అధికారికంగా తేదీని వెల్లడిస్తామని స్పష్టం చేసింది.
SKLM: మందస మండలం కుంటికోట గ్రామంలోని ఓ పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉమెన్స్ సేఫ్టీ ప్రోగ్రాం లో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. మందస ఎస్సై కే కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. సమాజంలో బాలికలు, మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు, వేధింపులు పట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలో తెలియజేశారు. ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే బాధితులు వెనువెంటనే పోలీస్ శాఖకు సమాచారం అందించాలన్నారు.
NLR: వెంకటాచలం మండలం నిడిగుంటపాళెంలో సోమవారం కంటి శస్త్రచికిత్స శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. అమెరికాలో ఉన్నప్పటికీ ప్రేమ్ సాగర్ రెడ్డి స్వగ్రామ అభివృద్ధికి కట్టుబడి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రేమ్ సాగర్ రెడ్డిని మనం ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
SRD: విద్యార్థులు చదువుతూపాటు క్రీడల్లో నైపుణ్యం కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అన్నారు. జిల్లా యువజన, క్రీడా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సి.యం. కప్ పోటీలలో జిల్లా స్థాయిలో విజయం సాధించి, రాష్ట్ర స్థాయిలో మొదటి, రెండవ, మూడవ స్థానంలో సాధించిన క్రీడాకారులను జిల్లా కలెక్టర్ సోమవారం అభినందించారు. ఆరోగ్యానికి ఆటలు ఎంతగానో అవసరమని సూచించారు.