• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఉట్నూర్ ఐటీడీఏ డిప్యూటీ డీఈవోగా చందన్

ADB: ఉట్నూర్ ఐటీడీఏ ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డీఈవోగా గోడం చందన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన పార్డీ(బి) గ్రామంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల పీజీహెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్నారు. దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న ఈ కీలక పోస్టును భర్తీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

February 26, 2026 / 12:06 PM IST

యూట్యూబర్ కోమలి ఆత్మహత్య.. అఖిల్‌కు నోటీసులు

TG: ప్రేమ విఫలమై యూట్యూబర్ కోమలి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరివేసుకుంది. ఈ క్రమంలో కోమలి స్నేహితుడు అఖిల్‌కు పోలీసులు నోటీసులు పంపించారు. నిన్న రాత్రి వరకు అఖిల్‌ను విచారించారు. మళ్లీ విచారణకు పిలిస్తే రావాలని తెలిపారు.

February 26, 2026 / 12:06 PM IST

భూదందా గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్

KMM: ఖమ్మం వెలుగుమట్లలోని భూదాన్, ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమించి, విక్రయిస్తామని నమ్మబలికిన ముగ్గురు నిందితులను ఖానాపురం హవేలీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు అమాయక ప్రజల నుంచి భారీగా నగదు వసూలు చేసి మోసగించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా చేతిలో ఎవరైనా మోసపోయి ఉంటే, వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఖమ్మం CP కోరారు.

February 26, 2026 / 12:06 PM IST

బిక్కనూర్ మండలంలో రోడ్డు ప్రమాదం

KMR: బిక్కనూరు మండలం రామేశ్వరపల్లి గ్రామ శివారులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చంద్రం అనే వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఆయనను ఎదురుగా వచ్చిన వాహనం బలంగా ఢీకొట్టింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108కు సమాచారం అందించారు. అనంతరం బాధితుడిని మెరుగైన చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

February 26, 2026 / 12:03 PM IST

సమస్యలు పరిష్కరించాలని జీఎంకు వినతి

MNCL: శ్రీరాంపూర్ ఏరియాలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో జీఎం శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం ఏరియా వైస్ ప్రెసిడెంట్ బండి రమేష్ మాట్లాడుతూ.. నస్పూర్‌లోని రోడ్లు విస్తరించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్, మహా ప్రస్థానం, 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని కోరారు.

February 26, 2026 / 12:03 PM IST

కోవెలకుంట్లలో పెరుగుతున్న కాపర్ వైర్ చోరీలు

NDL: కోవెలకుంట్ల మండలంలో విద్యుత్ మోటార్లు ట్రాన్స్ ఫార్మర్ల నుంచి కాపర్ వైర్ చోరీలు పెరుగుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కుందూ నది వద్ద ఉన్న ట్రాన్స్ ఫార్మర్ ధ్వంసం చేసి 50 కిలోల కాపర్ వైర్ ఎత్తుకెళ్లినట్లు సీఐ హనుమంతు నాయక్ వెల్లడించారు. ఈ దొంగతనాల పట్ల నిఘా పెంచినట్లు ఆయన పేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

February 26, 2026 / 12:02 PM IST

మరోసారి పెళ్లి చేసుకోనున్న విజయ్, రష్మిక

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నల వివాహం హిందూ, కొడవ సంప్రదాయాల్లో ఘనంగా జరుగుతోంది. ఈ రోజు ఉదయం హిందూ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి వేడుక ముగియగా, సాయంత్రం 4:30 గంటలకు రష్మిక కుటుంబ ఆచారం ప్రకారం ‘కొడవ’ సంప్రదాయంలో మరోసారి వివాహం జరగనుంది. ఈ కొత్త జంట వెడ్డింగ్ రిసెప్షన్ మార్చి 4న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు.

February 26, 2026 / 12:02 PM IST

జిల్లాలో మొట్టమొదటి హైడ్రోజన్ ప్రాజెక్ట్

AKP: దేశంలోనే మొట్టమొదటి జిల్లాలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. గురువారం శాసనసభలో మంత్రి మాట్లాడుతూ.. దీని ద్వారా లక్షలాదిమందికి ఉపాధి కలుగుతుందన్నారు. నక్కపల్లి మండలంలో వచ్చే నెల 7వ తేదీన ఆర్సెలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.

February 26, 2026 / 12:00 PM IST

ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్

పార్వతీపురం పట్టణ ప‌రిధిలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ వ‌ద్ద గల ఈవీఎం గోదామును క‌లెక్టర్ N.ప్రభాకరరెడ్ది త‌నిఖీ చేశారు. నెల వారీ త‌నిఖీలో భాగంగా ఇవాళ ఆయ‌న గోదాములను సంద‌ర్శించారు. గోదాములకు వేసిన సీళ్లను ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో DRO హేమలత, తదితరులు పాల్గొన్నారు.

February 26, 2026 / 12:00 PM IST

జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ

ATP: జర్నలిస్టులు సమాజానికి మార్గదర్శకులుగా ఉంటూ ప్రభుత్వం, ప్రజల మధ్య వారధిలా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ పేర్కొన్నారు. గురువారం అనంతపురం కలెక్టరేట్‌లో 2026-27 సంవత్సరానికి సంబంధించి జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల పంపిణీని ఆయన ప్రారంభించారు. తొలి విడతలో 607 కార్డులను మంజూరు చేసినట్లు వెల్లడించారు.

February 26, 2026 / 12:00 PM IST

శ‌ర‌వేగంగా ‘కల్కి 2’ షూటింగ్

ప్రభాస్, నాగ్ అశ్విన్‌ల ‘కల్కి 2’ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. HYDలోని శంకర్ పల్లి పరిసర ప్రాంతాల్లో జరుగుతోన్న షూటింగ్‌లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ పాల్గొన్నారు. వారిద్దరూ ఉదయం నుంచి రాత్రి 9 గంటలకు చిత్రీకరణలో పాల్గొంటున్నారట. ఎక్కడా అలసట లేకుండా వారు చూపిస్తున్న డెడికేషన్‌కు యూనిట్ సభ్యులు షాక్ అవుతున్నారట. ఇక ఈ షెడ్యూల్ మార్చి 12 వరకు కొనసాగనుంది.

February 26, 2026 / 11:58 AM IST

ఉమ్మడి జిల్లా రైతులకు చివరి అవకాశం..!

WGL: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్ పోర్టల్‌లో ఫార్మర్ రిజిస్ట్రేషన్‌కు ఈ నెల 28వ తేదీ చివరి గడువు అని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యవసాయ అధికారులు ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో పట్టాదారు పాస్ పుస్తకం కలిగిన ప్రతి రైతు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. రైతులు ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

February 26, 2026 / 11:57 AM IST

‘తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాలకు శాశ్వత భవనాలు’

KMM: రాష్ట్రంలో ప్రజలకు మరింత సౌకర్యవంతమైన, పారదర్శకమైన పరిపాలన అందించాలనే లక్ష్యంతో తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో గురువారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.

February 26, 2026 / 11:57 AM IST

నేడు రాసోల్ లో భూభారతి భూ సర్వే గ్రామసభ

SRD: కంగ్టి మండలం రాసుల్ గ్రామంలో గురువారం ఉదయం 10 గంటలకు భూ హద్దుల సర్వే గ్రామసభ సర్పంచ్ అధ్యక్షతన నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ ముగ్నీ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి హాజరవుతున్నట్లు తెలిపారు. కావున గ్రామ ప్రజలు మీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

February 26, 2026 / 11:56 AM IST

నెల్లూరు నగరపాలిక సంస్థ మేయర్ ఏకగ్రీవ ఎన్నిక

AP: నెల్లూరు నగరపాలిక మేయర్ పదవికి జరిగిన ఎన్నిక ప్రక్రియ ముగిసింది. అభ్యర్థిత్వానికి మరెవరూ పోటీ లేకపోవడంతో దేవరకొండ సుజాత మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి జేసీ వెంకటేశ్వర్లు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. కాగా, ఈ ఎన్నిక ప్రక్రియకు వైసీపీ కార్పొరేట్లు ఎవరూ హాజరుకాలేదు.

February 26, 2026 / 11:54 AM IST