ప్రకాశం: నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల నివారణ, సురక్షితమైన తాగునీటి సరఫరా, పైపులైన్ లీకేజీలను అరికట్టాలని కమిషనర్ నారాయణ రావు అన్నారు. మార్కాపురం మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో అసిస్టెంట్ ఇంజినీర్లు, సచివాలయ వార్డు ఆమినిటీ సెక్రటరీలు, పవర్ బోర్ ఆపరేటర్లకు సమావేశం నిర్వహించారు. నీటి సరఫరాలో ఏవైన సమస్యలుంటే ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు.
GNTR: బందరు ఓడరేవుకు అనుసంధానంగా రైల్వే వంతెన నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు వెంటనే సమర్పించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. వంతెన నిర్మాణంపై రెవెన్యూ, రైల్వే, రహదారులు–భవనాలు తదితర శాఖలతో సమావేశం నిర్వహించారు. భూసేకరణ అంచనాలు, విద్యుత్ సరఫరా ప్రతిపాదనలు త్వరగా సిద్ధం చేయాలని సూచించారు.
కోనసీమ: యానాం ఇంధన అక్రమాలపై ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ రావు గురువారం ధ్వజమెత్తారు. 20 వేల జనాభా ఉన్న యానాంలో రోజుకు 3 లక్షల లీటర్ల పెట్రోల్ విక్రయాలు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. ఈ అక్రమ రవాణా వల్ల కోనసీమ బంకు యజమానులు నష్టపోతున్నారని, సంబంధిత సంస్థల పర్మిట్లు రద్దు చేయాలని కోరుతూ కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేస్తామన్నారు
సత్యసాయి: సోమందేపల్లి మండలం నక్కలగుట్ట కాలనీలో నివసిస్తున్న వడ్డే మారుతి (36) ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక శుక్రవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ పోషణలో ఎదురైన సమస్యలు, అప్పుల భారం కారణంగా మనస్తాపానికి గురైనట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి 11 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
E.G: గోకవరం మండల బీజేపీ మాజీ అధ్యక్షుడు కరాసు శివప్రసాద్ గురువారం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ చేతుల మీదుగా సంత్ గాడ్గే బాబా అవార్డు అందుకున్నారు. రజక జాతి అభ్యున్నతి, సమాజ శ్రేయస్సు కోసం ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. సంత్ గాడ్గే బాబా ఆశయాలను సమాజానికి విస్తృతంగా తీసుకెళ్తున్నామని బీజేపీ నేత ఉంగరాల ఆది విష్ణు తెలిపారు.
SRPT: కోదాడలో నేడు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పలు కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 10:15 గంటలకు పట్టణంలోని కటకమ్మగూడెం రోడ్లో నారాయణ హాస్పిటల్ ప్రారంభోత్సవం, 11:15 గంటలకు మోతే మండలం అన్నారిగూడెం గ్రామంలో గణేష్ కుమార్తె అన్నప్రాసన, పట్టణంలో సుధాకర్ రావు కుమారుడి వివాహానికి సాయంత్రం 6 గంటలకు పాల్గొంటున్నారు.
టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్ ‘హనీ’. కరుణ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ఒకేసారి రెండు OTTల్లోకి వచ్చేసింది. సన్‌నెక్స్ట్‌లో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుండగా.. అమెజాన్ ప్రైమ్‌లో పాన్ ఇండియా భాషల్లో అందుబాటులో ఉంది.
ADB: నార్నూరులో హోలీ పండుగకు ముందే ప్రకృతి రంగుల సంబరాలు ప్రారంభమయ్యాయి. అడవుల్లో మోదుగు చెట్లు ఎర్రటి జ్వాలల్లా వికసించి అరణ్యాన్ని అగ్నివర్ణంతో కప్పేశాయి. పచ్చని చెట్ల మధ్య మెరిసే ఈ ఎర్ర పూలు గ్రామీణ ప్రాంతాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రతి ఏడాది మోదుగు పూలతో నార్నూర్ అరణ్యాలు హోలీకి సహజ రంగుల వేదికగా మారుతున్నాయి.
AP: ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో 8 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మందికి సాగునీరు, స్టీల్ ప్లాంటుకు నీరు ఇవ్వటమే లక్ష్యమని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం ఎడమ కాల్వ ద్వారా నీరు ఇవ్వాలన్నదే ఆలోచన అని పేర్కొన్నారు. ఫేజ్-1, 2 పనుల కోసం బడ్జెట్‌లో రూ.600 కోట్లు కేటాయించామని చెప్పారు. ఉత్తరాంధ్రలో మిగతా ప్రాజెక్టుల కోసం నిధులు కేటాయిస్తామన్నారు.
TG: పసుపు కొనుగోళ్ల జాప్యంపై ఎంపీ అర్వింద్ స్పందించారు. ఈ-నామ్ 2.0లో సాంకేతిక సమస్యలపై ఆరా తీశారు. ఢిల్లీలోని ఈ-నామ్ జాయింట్ సెక్రటరీ చిన్మయితో ఆయన మాట్లాడారు. పాత పద్ధతిలోనే పసుపు కొనుగోలు చేయాలని కోరారు. రైతులకు ఇబ్బందులు ఎదురు కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
JN: దేవరుప్పులలో అరైవ్-అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎస్సై సృజన్ కుమార్ మాట్లాడుతూ… వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రత నియమాలను పాటించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసులు, ప్రజలు పాల్గొన్నారు.
NGKL: కుమ్మెర బాధితులను పరామర్శించే తీరిక కాంగ్రెస్ నాయకులకు లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు విమర్శించారు. గురువారం తల్లోజు ఆచారితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాలపై కాంగ్రెస్కు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
KRNL: వైసీపీ పాలనలో రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని MLC బీటీ నాయుడు విమర్శించారు. శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో ఏఈ, డీఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో వ్యవస్థ కుదుటపడుతోందని స్పష్టం చేశారు.
AP: కర్నూలు జిల్లా ఆదోనిలో విరూపాక్షిస్వామి, వీణ వివాహం ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగింది. విరూపాక్షి స్వామి స్నేహితులతో కలిసి జనసేవ సామాజిక సంస్థ ఏర్పాటు చేసి, పదేళ్లుగా రక్తదానం, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వివాహ వేడుకల్లోనూ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అయితే, వివాహ వేడుకల్లో వరుడితోపాటు పెళ్లికి వచ్చిన అతిథుల్లో 27 మంది రక్తదానం చేశారు.
WGL: కరీమాబాద్ SRR తోటలో అక్రమంగా నిర్వహిస్తున్న మూడు ఇసుక డంపులపై ఇవాళ మిల్స్ కాలనీ CI రమేశ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. అక్రమంగా ఇసుక డంపు చేస్తున్న వారిని అదుపులో తీసుకొని MRO ముందు బైండ్ ఓవర్ చేశారు. అనంతరం CI రమేష్ మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా ఇసుక నిల్వ చేయడం, తరలించడం చట్ట రీత్యా నేరమని సీఐ హెచ్చరించారు.