• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

వారి ఇళ్ల నిర్మాణానికి అదనపు ఆర్థిక సాయం: CM

AP: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఇళ్ల నిర్మాణానికి అదనపు ఆర్థిక సాయం అందిస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ‘ఇళ్ల నిర్మాణం ద్వారా పేదలకు భద్రత, భరోసా కల్పిస్తాం. 2019కి ముందు కట్టిన ఇళ్లను గత ప్రభుత్వం కక్షగట్టి ఆపేసింది. గత ప్రభుత్వం ఆపేసిన ఇళ్లనూ త్వరలోనే పూర్తి చేసి ఇస్తాం. 2029లోగా అందరికీ ఇంటిస్థలాలు, ఇళ్లు ఇస్తాం’ అని హామీ ఇచ్చారు.

February 27, 2026 / 05:01 PM IST

చెన్నూర్‌ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం: మంత్రి

MNCL: చెన్నూర్ మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్‌పర్సన్ పెద్దింటి పద్మ పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఛైర్‌పర్సన్‌తో పాటు పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. చెన్నూరు మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని మంత్రి పేర్కొన్నారు.

February 27, 2026 / 05:01 PM IST

ఆలయ వ్యవస్థాపకుడు మృతికి మంత్రి సంతాపం

KNR: చిలుకూరు బాలాజీ ఆలయ వ్యవస్థాపకుడు సౌందర్ రాజన్ మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సౌందరరాజన్ చిలుకూరి బాలాజీ ఆలయంలో ప్రధాన అర్చకులుగా పని చేశారు. ఆయన కృషి వల్ల బాలాజీ ఆలయం ప్రజలలో మరింత గౌరవం సంపాదించిందని అన్నారు.

February 27, 2026 / 05:01 PM IST

ఎంపీని కలిసిన నూతన కలెక్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనురాగ్ జయంతిని, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి నూతన మున్సిపల్ ఛైర్మన్ తంగళ్ల పల్లి శ్రీవాణి రవి కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. నూతన కలెక్టర్‌ను జిల్లా అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలి అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.

February 27, 2026 / 05:01 PM IST

హాలియాలో “Arrive Alive” కార్యక్రమం

నల్గొండ జిల్లాలోని హాలియా పట్టణంలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో “Arrive Alive” రోడ్డు భద్రతా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి MLA జై వీర్ రెడ్డి, SP శరత్ చంద్ర పవార్ హాజరై ప్రారంభించారు. డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. బీపీ, షుగర్ పరీక్షలు కూడా చేశారు.

February 27, 2026 / 05:01 PM IST

అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

VZM: కొత్తవలస మండలం చింతలపాలెంలో ఉపాధి హామీ నిధులతో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి శుక్రవారం పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును పరిశీలించి నాణ్యత ప్రమాణాలతో సకాలంలో పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

February 27, 2026 / 05:00 PM IST

నీటి ఎద్దడి నివారణకు చర్యలు: ఎమ్మెల్యే

ADB: వేసవికాలంలో ఆదిలాబాద్ పట్టణంలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. వార్డు నంబర్ 3 జీడీసీ కాలనీలో మంచినీటి బోర్ ఏర్పాటుకు పూజ చేసి పనులను ప్రారంభించారు. ఎన్నికల సమయంలో కాలనీలో ఉన్న నీటి సమస్యను తెలుసుకుని.. కౌన్సిలర్ నిషిద ఆదిత్య ఖండేష్కర్ బోర్ వేయించడం అభినందనీయం అన్నారు.

February 27, 2026 / 05:00 PM IST

ఇంటింటికి కొళాయి పనులు ప్రారంభం

AKP: జనసేన ఉత్తరాంధ్ర రాజకీయ వ్యవహారాల ప్రతినిధి సుందరపు సతీశ్ కుమార్ శుక్రవారం అచ్యుతాపురం మండలం ఎర్రవరంలో రూ. 15 లక్షల జిల్లా పరిషత్ నిధులతో చేపట్టే ఇంటింటి కుళాయి పనులను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత వైసీపీ హయాంలో పడకేసిన పథకాలను పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తుందని చెప్పారు.

February 27, 2026 / 05:00 PM IST

నందిగాం మండల పరిధిలో అగ్నికి ఆహుతైన గడ్డి కుప్పలు

SKLM: నందిగాం(M) కొత్త అగ్రహారం గ్రామ సమీపంలో శుక్రవారం జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న గడ్డికుప్పలు దగ్ధమయ్యాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగి గడ్డికుప్పలు కాలిపోవడంతో అలజడి నెలకొంది. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

February 27, 2026 / 05:00 PM IST

వృద్ధ దంపతులను సత్కరించిన ఎస్పీ

కృష్ణా: ఉయ్యూరులో ఇటీవల డిజిటల్ అరెస్టుకు గురైన వృద్ధ దంపతులను ఎస్పీ విద్యాసాగర్ నాయుడు శుక్రవారం శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. డిజిటల్ అరెస్ట్‌కు గురైనప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎవరైనా వీడియో కాల్ ద్వారా లేదా వాయిస్ కాల్ ద్వారా బెదిరింపులకు పాల్పడితే నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

February 27, 2026 / 04:59 PM IST

గుంటూరులో సహకార బ్యాంకుల మహాజన సభ

గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (జీడీసీసీబీ), జిల్లా కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ (జీడీఎంఎస్) ఆధ్వర్యంలో మహాజన సభ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జీడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, జీడీఎంఎస్ ఛైర్మన్ వడ్రణం హరిబాబు నిర్వహించారు. ఈ సమావేశంలో సహకార సంఘాల అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణపై వారు ప్రధానంగా చర్చించారు.

February 27, 2026 / 04:58 PM IST

3వ డివిజన్‌లో సొంత నిధులతో బోర్ వేయించిన కౌన్సిలర్

WGL: వర్ధన్నపేట మున్సిపల్ పట్టణ కేంద్రంలోని 3వ డివిజన్‌లో నీటి ఎద్దడిని నివారించేందుకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కౌన్సిలర్ గుజ్జ వీరరాఘవ రావు శుక్రవారం సొంత నిధులతో కాలనీలో బోరు తవ్వించి ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించారు. కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరించిన వార్డు సభ్యుడికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

February 27, 2026 / 04:58 PM IST

‘మహిళా సాధికారతే సమాజాభివృద్ధికి పునాది’

మహబూబ్ నగర్: అంబేడ్కర్ చౌరస్తా వద్ద ‘ఇందిర మహిళా శక్తి’ గ్రామ దుకాణాన్ని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం బాగుపడుతుందన్నారు. మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం ఇలాంటి దుకాణాలను ప్రోత్సహిస్తోందని తెలిపారు.

February 27, 2026 / 04:58 PM IST

20వ వార్డులో మురుగు కష్టాలకు చెక్

GDWL: పారిశుధ్యం, నీటి ఎద్దడి, విద్యుత్ సమస్యలు లేకుండా వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతాం అని కౌన్సిలర్ ఫర్హీన్ తబుసం మహబూబ్ పాష అన్నారు. డ్రైనేజీల్లో ఏళ్ల తరబడి నిలిచిన మురుగు, చెత్తను శుక్రవారం కార్యకర్తలు చేత తొలగించారు. పట్టణంలోని 20వ వార్డులో ఉన్నటువంటి ఇళ్ల తరబడి చెత్తను క్లీన్ చేయించి, శుభ్రంగా ఉంచుతామన్నారు.

February 27, 2026 / 04:57 PM IST

ఫేస్ వ్యాక్సింగ్‌ కోసం సహజ చిట్కాలు!

కొన్ని సహజ చిట్కాలతో ముఖంపై అవాంఛిత రోమాలను తొలగించుకోవచ్చు. చక్కెర, నిమ్మరసం, నీళ్ల మిశ్రమాన్ని మరిగించి, చల్లారాక రాసి అరగంట తర్వాత రుద్దుతూ కడగాలి. పండిన అరటిపండు, ఓట్‌మీల్ పేస్ట్‌ను రాసి 15 నిమిషాలు మర్దన చేసి కడగాలి. కార్న్‌స్టార్చ్, చక్కెర, గుడ్డు తెల్లసొన కలిపి అప్లై చేసిన, అది ఆరాక క్లీన్ చేయాలి.

February 27, 2026 / 04:56 PM IST