• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘ప్రతిరోజూ పారిశుధ్య పనులు నిర్వహించాలి’

ASF: కాగజ్ నగర్ పట్టణంలో మున్సిపల్ కమిషనర్ తిరుపతి శనివారం పలు వార్డుల్లో పర్యటించి శానిటేషన్ పనులను స్వయంగా పర్యవేక్షించారు. డ్రైనేజీల శుభ్రత, చెత్త తొలగింపు ప్రక్రియను వేగవంతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రతి వార్డులోనూ ప్రతిరోజూ పరిశుభ్రత పనులు నిర్వహించాలని స్పష్టం చేశారు. పట్టణాన్ని క్లీన్ సిటీగా మార్చేందుకు ప్రజలు సహకరించాలన్నారు.

February 28, 2026 / 01:02 PM IST

సంత్ సేవాలాల్ శోభాయాత్ర ర్యాలీ

RR: గిరిజనుల ఆరాధ్యదైవం శ్రీసంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన, పరివార దేవతల విగ్రహ ప్రతిష్ఠాప, భోగ్ బండారో ప్రత్యేక పూజ కార్యక్రమం సందర్భంగా షాద్ నగర్ పట్టణంలో సంత్ సేవాలాల్ మహారాజ్ శోభాయాత్ర ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి పాల్గొన్నారు. ర్యాలీకి గిరిజన నాయకులు, మహిళలు, తండావాసులు తరలివచ్చారు.

February 28, 2026 / 01:01 PM IST

గచ్చిబౌలిలో అంతర్జాతీయ హాకీ సమరం

HYD: గచ్చిబౌలి హాకీ స్టేడియం మార్చి 8 నుంచి 14 వరకు జరగనున్న మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లకు సర్వం సిద్ధమైంది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో ఇండియా, ఇంగ్లండ్, కొరియా, ఇటలీ, ఆస్ట్రియా, స్కాట్‌లాండ్, ఉరుగ్వే, వేల్స్ సహా మొత్తం 8 దేశాలు తలపడనున్నాయి. మార్చి 8న ఉదయం 7.30 గంటలకు CM రేవంత్ రెడ్డి ఈ పోటీలను ప్రారంభించనున్నారు.

February 28, 2026 / 01:01 PM IST

ఆర్కే బీచ్‌లో యువతి ఆత్మహత్యాయత్నం

VSP: తల్లి తిట్టిందని మర్రిపాలెంకు చెందిన ఓ యువతి విశాఖ ఆర్కే బీచ్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. సముద్రంలోకి దూకే ముందు తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియో చిత్రీకరించి బంధువులకు పంపింది. వీడియో చూసిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. త్రీటౌన్ పోలీసులు సకాలంలో స్పందించి బీచ్‌కు చేరుకుని యువతిని రక్షించారు.

February 28, 2026 / 01:00 PM IST

బుడుమూరులో శాస్త్రవేత్తల చిత్రపటాలు ప్రదర్శన

SKLM: లావేరు మండలం బుడుమూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా CV రామన్ చిత్రపటానికి హెచ్ఎం పూర్ణచంద్రరావు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం పాఠశాల ఆవరణంలో 50 మంది శాస్త్రవేత్తలను పరిచయం చేస్తూ చిత్రపటాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల గోవిందరావు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

February 28, 2026 / 01:00 PM IST

‘కూటమి ప్రభుత్వంలో ప్రాణాంతకంగా మారిన పాలు’

VZM: రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజారోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. శనివారం తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలు, కలుషిత నీటి కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తరచుగా వెలుగు చూస్తున్నాయి అని పేర్కొన్నారు.

February 28, 2026 / 01:00 PM IST

కజ్జికాయ పెట్టలేదని పోలీసులకు చిన్న అల్లుడు ఫిర్యాదు

AP: అనంతపురం ఉరవకొండలో చంద్ర మౌళీశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా అత్తగారింటికి ముగ్గురు అల్లుళ్లు వెళ్లారు. మర్యాదల్లో భాగంగా మొదటి ఇద్దరు అల్లుళ్లకు అత్తింటి వారు కజ్జికాయలు పెట్టారు. అయితే మూడో అల్లుడు తనకు కజ్జికాయలు ఎందుకు పెట్టలేదు? ఇదేం మర్యాద? అని డయల్ 100కు ఫిర్యాదు చేశాడు. దీంతో కానిస్టేబుల్ వచ్చి ముగ్గురు అల్లుళ్లకి కజ్జికాయలు పంచడంతో కథ సుఖాంతం అయింది.

February 28, 2026 / 12:59 PM IST

అది భూభారతి కాదు.. భూ హారతి: హరీష్ రావు

TG: కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకం భూభారతి కాదని అది భూ హారతి మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. 22 ఏ కింద కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో ఎందుకు పెట్టారో ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. నిషేధిత భూముల జాబితాను ఎందుకు ఆన్లైన్లో పెట్టడం లేదని ప్రశ్నించారు. భూభారతిలో పెద్ద స్కాం జరుగుతోందని ఆరోపించారు.

February 28, 2026 / 12:59 PM IST

మహిళా పోలీసుల భారీ సైకిల్ ర్యాలీ

అనంతపురం నగరంలో శనివారం మహిళా పోలీసులు భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. మహిళా భద్రత, సాధికారతపై చైతన్యం కల్పించేందుకు పోలీస్ హెడ్‌క్వార్టర్స్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ఈ కార్యక్రమం సాగింది. మహిళలపై నేరాల నిరోధానికి పోలీస్ శాఖ కట్టుబడి ఉందని, అపదలో ఉన్నవారు శక్తి టీమ్స్ సేవలు వినియోగించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు.

February 28, 2026 / 12:58 PM IST

గ్యాస్ ఏజెన్సీపై వినియోగదారులు తీవ్ర అసంతృప్తి

KMM: వైరా మండలం సోమవారం గ్రామంలోని శ్రీ కానిపాకం విగ్నేశ్వర ఇండేన్ గ్యాస్ ఏజెన్సీపై వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కస్టమర్లతో సిబ్బంది సరైన విధంగా ప్రవర్తించడం లేదని ఆరోపిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ తీసుకున్న తరువాత వాచర్లు ఇవ్వడం లేదని, అడిగితే లేవని నిర్లక్ష్య సమాధానం ఇస్తున్నారని వినియోగదారులు చెబుతున్నారు.

February 28, 2026 / 12:55 PM IST

అధికారులను అభినందించిన చంద్రబాబు

AP: విజయనగరం జిల్లా చీపురుపల్లిలో HPV వ్యాక్సిన్  కార్యక్రమాన్ని CM చంద్రబాబు ప్రారంభించారు. గర్బాశయ క్యాన్సర్ రాకుండా బాలికలు వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. ఒకసారి వ్యాక్సిన్ వేసుకుంటే జీవితాంతం రక్షణ ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా బాలికలు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. చీపురుపల్లి CHC పరిశుభ్రంగా ఉందని అధికారులను అభినందించారు.

February 28, 2026 / 12:54 PM IST

దేవరకొండలో ఘనంగా టైలర్స్ డే

NLG: దేవరకొండలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో టైలర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలో ఉన్న కొంతమంది టైలర్స్ని శాలువాతో సత్కరించి అభినందించారు. టైలర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. టైలర్స్‌ను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని అన్నారు.

February 28, 2026 / 12:54 PM IST

రామయ్య నిత్య కళ్యాణం వైభవంగా

BDK: భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణ వేడుకను శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధనలు నిర్వహించారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి బేడ మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్లి, విశ్వక్సేన పూజ, కంకణధారణ తదితర కార్యక్రమాల మధ్య అర్చకులు నిత్య కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు.

February 28, 2026 / 12:53 PM IST

స్పీకర్ విచారణకు హాజరైన కడియం

TG: రాష్ట్ర రాజకీయాల్లో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ ఉత్కంఠ రేపుతోంది. ఇవాళ స్పీకర్ విచారణకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు. కడియం శ్రీహరి తరఫు అడ్వకేట్లను బీఆర్ఎస్ ఎమ్మెల్యే తరఫు అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామ్ చేయబోతున్నారు. ఇక దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై దాఖలైన పిటిషన్లపై మాత్రమే విచారణ పెండింగ్‍లో ఉంది. ఈ క్రమంలో నిన్నటి విచారణకు దానం గౌర్హాజరు అయ్యారు.

February 28, 2026 / 12:53 PM IST

FLASH: GHMC చట్టం స్థానంలో రానున్న కొత్త కోర్ అర్బన్ చట్టం

HYD: ORR పరిధి మూడు కార్పొరేషన్లకు వర్తించేలా GHMC చట్టం స్థానంలో కొత్త కోర్ అర్బన్ చట్టం రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్యం, రోడ్లు, వీధి దీపాలు, ఫుడ్ సేఫ్టీ, ఫైర్ సేఫ్టీ, వాటర్ హార్వెస్టింగ్, చెరువుల అభివృద్ధి పనులను 99 రోజుల కార్యాచరణలో ప్రాధాన్యంగా చేపట్టాలని సూచించారు.

February 28, 2026 / 12:50 PM IST