KNR: శాతవాహన విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగంలో పీహెచ్‌డీ ప్రవేశ మౌఖిక పరీక్షలు మార్చి 6వ, 7వ తేదీల్లో ఉదయం 10:30 నుంచి విభాగాధిపతి కార్యాలయంలో నిర్వహిస్తామని శాతవాహన విశ్వవిద్యాలయ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ సంచాలకులు డా. మహమ్మద్ జాఫర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్ సైట్‌లో చూడాల్సిందిగా కోరారు.
కోనసీమ: జనసేన ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు ప్రారంభం సందర్భంగా గురువారం బోడసకుర్రు BRK కన్వెన్షన్‌లో అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ నేతల సమావేశం జరిగింది. రాజానగరం MLA బలరామకృష్ణ, రాజోలు MLA దేవ వరప్రసాద్, కొత్తపేట ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్ పాల్గొన్నారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో రికార్డు స్థాయిలో సభ్యత్వాలు నమోదు చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.
సత్యసాయి: బీడుపల్లిలోని సంస్కృతి ఇంజనీరింగ్ కళాశాలలో మూడు రోజుల పాటు జరిగిన ‘జనగణన-2027’ రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులు గురువారంతో ముగిశాయి. ముగింపు సభలో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈసారి జనగణనలో అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని, క్షేత్రస్థాయిలో ఖచ్చితమైన గణాంకాలు సేకరించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాతీయ సెమినార్ నిర్వహణకు ముస్తాబవుతోంది. ఈనెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న జాతీయ సెమినార్ కోసం కళాశాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు.సెమినార్ ఏర్పాట్లలో భాగంగా కళాశాల ప్రవేశ ద్వారం వద్ద రోడ్డుకు ఇరువైపులా మట్టితో చదును చేసి సుందరీకరణ పనులు చేపట్టామన్నారు.
ATP: ఎమ్మెల్యే బండారు శ్రావణి అసెంబ్లీలో CM చంద్రబాబు నాయుడును కలిశారు. నియోజకవర్గంలోని సాగునీటి సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మిడ్ పెన్నారు దక్షిణ కాలువ ఆధునికీకరణ, నిలిచిపోయిన బైపాస్ కాలువ పనులను త్వరగా ప్రారంభించాలని కోరారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి ఎద్దడి రాకుండా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
KKD: బోద్దవరం గ్రామానికి చెందిన అదారి జయశ్రీ వెంకట సత్య సాయి రేణుక (21) అదృశ్యంపై కేసు నమోదైనట్లు SI రామకృష్ణ గురువారం తెలిపారు. మార్చి 7న వివాహం జరగాల్సి ఉండగా.. ఐదు తులాలు బంగారం, వెండి, రూ. 50 వేల నగదుతో ఆమె కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. విశాఖలో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న రేణుక ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆందోళన చెందుతున్నారు.
E.G: నిడదవోలు మండలం కంసాలిపాలెంలో శ్మశాన వాటిక అభివృద్ధికి కృషి చేస్తామని BJP జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర తెలిపారు. గురువారం పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పర్యటించారు. గ్రామంలోని ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కంసాలిపాలెంలో శ్మశాన వాటిక సమస్యను ఎంపీ పురందీశ్వరి దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
AP: అన్నమయ్య, శ్రీసత్యసాయి, ప్రకాశం జిల్లాల్లోని 37 మండలాల్లో ఉపాధిహామీ పథకం కింద 50 రోజుల అదనపు పనిదినాలు కల్పించనున్నట్లు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గ్రామీణ పేదల సంక్షేమం కోసం ఈ అవకాశం కల్పించినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెప్పారు. కాగా, వర్షాభావ పరిస్థితుల కారణంగా 2025 ఖరీఫ్‌లో రాష్ట్రప్రభుత్వం ఈ జిల్లాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించింది.
KDP: ఇటీవల నిర్వహించిన నాసా (ఎన్ఎస్‌వో) పరీక్షలో పులివెందుల విద్యార్థిని మెహరీన్ అంజు ప్రతిభను చాటుకుంది. రెండో తరగతి చదువుతున్న ఆమె రాష్ట్ర స్థాయిలో 98వ ర్యాంకు సాధించి పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది. ఇంతటి ప్రతిభ కనబరిచిన మెహరీన్ అంజు విజయానికి ఆమె కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల మార్గదర్శకం కీలకంగా మారాయి.
SRD: పటాన్ చెరువులో రూ.100 కోట్ల CSR నిధులతో నిర్మించి, ప్రారంభానికి సిద్ధంగా ఉన్న “పెద్ద దవాఖానకు పెద్దాయన డాక్టర్ కిషన్ రావు పేరుకై” తీవ్రంగా కృషి చేస్తానని, సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడుతానని మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జి నీలం మధు అన్నారు. జిల్లాకు 567 కోట్ల CSR నిధులు తెచ్చిన ఘనత డాక్టర్ కిషన్ రావుది అన్నారు.
అనకాపల్లిలో ప్రైవేట్ పాఠశాలలు కళాశాలకు విద్యార్థులను తీసుకువెళ్లే స్కూల్ బస్సులు, ఆటోలను గురువారం తనిఖీలు నిర్వహించారు. డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేశారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు ట్రాఫిక్ సీఐ వెంకటనారాయణ తెలిపారు. డ్రైవర్లకు రోడ్డు భద్రత నియమాలను వివరించారు.
NRPT: కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా పట్టణ అభివృద్ధి జరగాలని మంత్రి వాకిటి శ్రీహరి ఆకాంక్షించారు. గురువారం ఆత్మకూరు మున్సిపాలిటీలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అభివృద్ధికి ఎన్ని నిధులైనా తీసుకొస్తానని, అన్ని వార్డుల్లో సమానంగా పనులు జరగాలని అధికారులను ఆదేశించారు.
HNK: వరంగల్ రైల్వే స్టేషన్‌లో గురువారం అర్ధరాత్రి పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. స్టేషన్ ప్రాంగణం, ప్లాట్‌ఫామ్‌లపై ఉన్న ప్రయాణికుల సామాన్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టినట్లు ఆర్.ఐ తెలిపారు. అనుమానితుల వివరాలు సేకరించి, ప్రయాణికుల భద్రత కోసం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల సమీక్షా సమావేశానికి రాష్ట్ర కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య హాజరుకానున్నారు. ఈ మేరకు డీబీఎఫ్ (DBF) అధ్యక్షుడు దుబాసి సంజీవ్ తెలిపారు. ఈ సమావేశానికి జిల్లాలోని అంబేడ్కర్ యువజన సంఘాలు, దళిత ప్రజా సంఘాల నాయకులు, అట్రాసిటీ బాధితులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.
TG: న్యుమోనియాకు కొత్త టీకాను బిట్స్ పరిశోధకులు కనుగొంది. స్పెక్ట్రోస్కోపీ విధానం ద్వారా వ్యాక్సిన్‌ను అభివృద్ది చేశారు. ఇటీవలే ఎలుకలపై ప్రయోగించగా విజయవంతమైందని పరిశోధకులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి తర్వాత క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించనున్నారు.