కృష్ణా: తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై అసెంబ్లీలో చర్చ జరిగిందని MLA యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. తిరుమల పవిత్రతకు భంగం కలిగించే చర్యలు క్షమించరానివని అన్నారు. స్వామివారి నైవేద్యంలో కల్తీపై గత పాలకుల పాత్రపై విచారణ జరపాలని, తిరుమల తిరుపతి దేవస్థానాలు స్వయంగా ఆవులను పెంచి నెయ్యి చేయాలని సూచించారు.
BPT: అన్న క్యాంటీన్ నిర్వహణపై మంగళవారం ట్రస్ట్ సీఈవో వాసుదేవ్ సమీక్షించారు. పేదలకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించాలన్నారు. ఇటీవలి సర్వేలో ఇక్కడి సేవలపై 91 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇదే ప్రమాణాలు కొనసాగించాలని సిబ్బందికి సూచించారు. నాణ్యత, పరిశుభ్రతలో రాజీ పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
SRPT: మానవ తప్పిదాలే రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమని జిల్లా ఎస్పీ కె. నరసింహ అన్నారు. ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం సూర్యాపేటలో ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ప్రాణకవచాలని, మైనర్ డ్రైవింగ్ ప్రమాదకరమని హెచ్చరించారు. ప్రమాద బాధితులను కాపాడి ‘రహదారి హీరోలు’ కావాలని పిలుపునిచ్చారు.
E.G: రాజమండ్రిలో గణేశ్వరరావు నుంచి కొనుగోలు చేసిన పాలు, ఇతర పాల ఉత్పత్తులను వినియోగించరాదని కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం స్పష్టం చేశారు. అతడు సరఫరా చేసిన పాలు కల్తీ అయినట్లు గుర్తించామన్నారు. ఈ పాలు, వాటి ద్వారా తయారైన పెరుగు, కోవా, నెయ్యి, మీగడ వంటి పదార్థాలు ఎక్కడ నిల్వ ఉన్నా వెంటనే తొలగించి, సురక్షితంగా నాశనం చేయాలని ఆదేశించారు.
NLG: చేనేత కార్మికుల రుణమాఫీని పూర్తిస్థాయిలో అమలు చేయాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం ప్రకటించి 20 నెలలైనా హామీ నెరవేరలేదని, పొదుపు పథకం నిధులు విడుదల చేయాలని కోరారు. షరతులు లేకుండా చేనేత భరోసా, పెండింగ్‌లో ఉన్న నేతన్న బీమా చెల్లించాలన్నారు.
ATP: శింగనమల మండల కేంద్రంలోని శివపురం పెద్దమ్మ గుడి వద్ద మంగళవారం ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో బస్సులోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆర్టీసీ బస్సు అనంతపురం నుంచి తార్పర్తి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
W.G: ప్రముఖ పారిశ్రామికవేత్త, గౌతమి సాల్వెంట్స్ కర్మాగారం అధినేత మల్లిన రామచంద్రరావు(90) మంగళవారం సాయంత్రం మృతి చెందారు. గత కొంతకాలంగా అస్వస్థతకు గురైన రామచంద్రరావు ఇవాళ సజ్జాపురంలోని ఆయన స్వగృహంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రామచంద్రరావు మృతి పట్ల ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్‌తో పాటు పలువురు సంతాపం తెలిపారు.
SKLM: జిల్లాలో డయేరియా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే శంకర్ సతీమణి స్వాతి శంకర్ మంగళవారం రిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి, వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచుతామని బాధితులకు భరోసా కల్పించారు.
PPM: కురుపాం మండలం తోటగూడ గ్రామానికి చెందిన ఆరిక లక్ష్మణరావు ఆత్మహత్య చేసుకున్నాడు. నిత్యం మద్యం సేవిస్తూ ఉండటంపై తండ్రి మందలించడంతో మనస్థాపానికి గురై గడ్డి మందు తాగాడు. కుటుంబ సభ్యులు తొలుత కురుపాం ఆసుపత్రికి, అనంతరం విజయనగరం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఏలూరు: జిల్లాను నేరరహితంగా తీర్చిదిద్దేందుకు పోలీసు అధికారులంతా సమిష్టిగా కృషి చేయాలని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆదేశించారు. మంగళవారం సబ్ డివిజనల్ పోలీసు అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. నమోదైన కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయాలని, పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.
AP: మంత్రి లోకేష్ పనితీరును హైకోర్టు ప్రశంసించింది. కస్తూర్బా పాఠశాలల టీచర్ల జీతం పెంచుతామన్న ప్రకటనను అభినందించింది. పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తామని మంత్రి ప్రకటన చేశారని వ్యాఖ్యానించింది. ప్రజా సమస్యలపై మంత్రి లోకేష్ వెంటనే స్పందించి పరిష్కరిస్తున్నారని తెలిపింది. హాస్టల్ విద్యార్థులను ఎలుకలు కరిచిన ఘటనపై వెంటనే స్పందించారని హైకోర్టు కితాబిచ్చింది.
NDL: ఆళ్లగడ్డలో నిరుద్యోగులను మోసగించిన ‘ఓ సొల్యూషన్ స్కీమ్’ సంస్థపై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఉద్యోగాల పేరుతో రూ. 35 కోట్లు వసూలు చేసిన నిర్వాహకుల ఆస్తులను జప్తు చేస్తూ మంగళవారం హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నిందితులు బాధితుల సొమ్ముతో కొనుగోలు చేసిన స్థిర, చరాస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది.
MHBD: మహబూబాబాద్ పట్టణంలోని పోనుగోడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎదుట రోగి మంగళవారం బంధువులు రాస్తారోకో నిర్వహించారు. గర్భాశయ గడ్డ శస్త్రచికిత్సలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మూత్రనాళాలు దెబ్బతిని రోగి పరిస్థితి విషమించిందని వారు ఆరోపించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై కఠిన చర్యలు తీసుకొని బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
AP: జగన్ హయాంలో ఆలయాలపై దాడులకు రాజకీయ లబ్ధి వచ్చేది ఎవరికి? అని మాజీమంత్రి పేర్నినాని ప్రశ్నించారు. ‘2014-19 మధ్య విజయవాడలో ఆలయాలు కూలగొట్టారు. హిందూ మతం పట్ల గౌరవం ఉంటే ఆలయాలు కూలుస్తారా? కూటమి ప్రభుత్వం వచ్చాక కాశినాయన క్షేత్రం కూల్చింది ఎవరు? శ్రీకాకుళం కూర్మలో ఆలయానికి నిప్పు పెట్టింది ఎవరు’ అని పేర్నినాని నిలదీశారు.
KDP: వియన్‌పల్లె మండలం ఐ కొత్తపల్లి గ్రామానికి చెందిన రైతు శివ నాగేశ్వర్ రెడ్డి చీని తోటలో పవర్ గ్రిడ్ సిబ్బంది తన అనుమతి లేకుండా చెట్లు తొలగించారని ఆరోపిస్తూ మహిళలతో కలిసి నిరసన తెలిపారు. చిన్న పిల్లలలా పెంచుకున్న చెట్లను నష్టపరిహారం లేకుండా పీకివేయడం బాధాకరమని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం పై అధికారులు తక్షణం స్పందించి న్యాయం చేయాలని కోరారు.