• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు: SI

KDP: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సిద్ధవటం ఎస్సై పోకల హారిక హెచ్చరించారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆమె మాట్లాడుతూ.. మండలంలో కోడి పందేలు, జూదం,పేకాట నిర్వహిస్తే కఠినమైన చర్యలు తప్పవన్నారు. రౌడీ షీటర్లు పల్లెల్లో ప్రశాంతత వాతావరణం ఉండేటట్లు కలిసిమెలిసి ఉండాలన్నారు. అనుమానిత పల్లె ప్రాంతాలపై కొంతమందిపై నిఘా వేసి ఉంచామని తెలిపారు.

March 2, 2026 / 07:27 PM IST

ఘనంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం

SRCL: చందుర్తి మండలంలోని బండపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రథోత్సవం అత్యంత కన్నుల పండుగ సాగింది. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా ఆలయంలో నిత్యారాధన, రథహోమం, పూర్ణాహుతి, రథ బలిహరణ, పూజలను అర్చకులు శ్రీకాంతచార్యుల వేద పండితులు మంత్రోచ్ఛారణతో ఘనంగా నిర్వహించారు. ఉత్సవ మూర్తులను రథంపై ఊరేగించారు.

March 2, 2026 / 07:27 PM IST

అభివృద్ధి పనులపై రివ్యూ మీటింగ్

MDK: జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై కలెక్టర్ ప్రతిమా సింగ్ సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. నిర్మాణ దశలో ఉన్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై అన్ని శాఖల అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

March 2, 2026 / 07:24 PM IST

దూదిళ్ళ శ్రీపాదరావుకు పోలీస్ శాఖ నివాళి

WNP: ప్రజాసేవలో ఆయన చూపిన అంకితభావం ప్రతి ప్రజాప్రతినిధికి ప్రేరణ నిచ్చే దీప స్తంభం దూదిళ్ళ శ్రీపాదరావు అని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా పోలీస్ శాఖ కార్యాలయంలో మహానేత శ్రీపాదరావు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. శ్రీపాద రావు శాసనసభ్యుడిగా ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో కీలక పాత్ర పోషించారని అన్నారు.

March 2, 2026 / 07:23 PM IST

CC రోడ్లు, డ్రైనేజీ పనులను ప్రారంభించిన.. కాంగ్రెస్ నేతలు

MLG: రాష్ట్ర మంత్రి సీతక్క, DCC అధ్యక్షుడు అశోక్ ఆదేశాల మేరకు వెంకటాపూర్ మండలం రామానుజాపూర్ గ్రామంలో నూతన CC రోడ్లు, డ్రైనేజీ పనులు ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథిగా పంచాయతీరాజ్ డైరెక్టర్ భగవాన్ రెడ్డి, TPCC ప్రధాన కార్యదర్శి రాంరెడ్డి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశోక్, ఉప సర్పంచ్ రవి తదితరులు ఉన్నారు.

March 2, 2026 / 07:22 PM IST

‘ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటాం’

VKB: మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామని, అభివృద్ధి సంక్షేమం గడపగడపకు అందేలా కృషి చేస్తామని తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం మున్సిపల్ ఛైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ , వైస్ ఛైర్మన్ రజాక్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్ పర్సన్ ఛాంబర్‌లో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు

March 2, 2026 / 07:21 PM IST

ఆర్డీటీ సంస్థకు మద్దతు తెలపండి: రామాంజినేయులు

ATP: ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలు ఆర్డీటీ సంస్థపై తమకున్న అభిమానాన్ని చాటుకోవాలని బహుజన రాజ్యాధికార జేఏసీ కమిటీ ఛైర్మన్ జై భీమ్ రామాంజినేయులు కోరారు. సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. దీనిలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ బైకులు, కార్లు, ఇంటి గోడల పైన ‘సేవ్ ఆర్డీటీ’ అని రాసి మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు.

March 2, 2026 / 07:20 PM IST

కిక్ బాక్సింగ్ విజేతకు మంత్రి సుభాష్ అభినందనలు

కోనసీమ: న్యూఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ పోటీలలో సత్తా చాటిన ద్రాక్షారామ విద్యార్ది కె.విష్ణు వర్ధన్‌ను మంత్రి వాసంశెట్టి సుభాష్ సోమవారం ప్రత్యేకంగా అభినందించారు. ఏడవ తరగతి చదువుతున్న విష్ణువర్ధన్ ఒక స్వర్ణ, ఒక రజిత పథకాన్ని సాధించడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. మంత్రి విద్యార్థికి రూ.5 వేలు నగదు అందజేశారు.

March 2, 2026 / 07:20 PM IST

మద్నూర్‌లో ఆధార్ కేంద్రం ప్రారంభం

KMR: మద్నూర్ తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం కొత్తగా ఆధార్ కేంద్రాన్ని తహసీల్దార్ ముజీబ్ ప్రారంభించారు. మండలంలో కొత్త ఆధార్ కార్డులతో పాటు ఆధార్ కార్డులు ఉన్నవారు అందులో మార్పులు, చేర్పులు చేసుకోవాలని సూచించారు. ఆధార్ కార్డులకు సంబంధించిన ఎలాంటి సమస్య ఉన్న తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న ఆధార్ కేంద్రంలో సంప్రదించాలని ఆయన సూచించారు.

March 2, 2026 / 07:20 PM IST

‘కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యం’

RR: షాద్‌నగర్ నియోజకవర్గం నందిగామ మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న అంగన్ వాడీ, మహిళా సమాఖ్య భవన స్లాబ్ నిర్మాణానికి సర్పంచ్ కొమ్ము కృష్ణ పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలను ఆర్థిక స్వావలంబన దిశగా ముందుకు తీసుకెళ్లి వారిని కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ పాల్గొన్నారు.

March 2, 2026 / 07:20 PM IST

భూముల కేటాయింపులపై విమర్శలు

VSP: పెట్టుబడుల పేరిట ప్రభుత్వ భూములను తక్కువ ధరలకు ప్రైవేట్ కంపెనీలకు కేటాయిస్తున్నారని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కెకె రాజు ఆరోపించారు. తర్లువాడలో విలువైన భూమిని 99 పైసలకే సంస్థకు ఇచ్చిన నిర్ణయంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. భూములను బహిరంగ వేలం ద్వారా కేటాయిస్తే ప్రభుత్వానికి ఆదాయం పెరిగి, నగర అభివృద్ధి వేగవంతం అవుతుందని తెలిపారు.

March 2, 2026 / 07:20 PM IST

రేపు ‘వాసవి శాంతి ధామం’ మూసివేత

W.G: ఈనెల 3న చంద్రగ్రహణం సందర్భంగా పెనుగొండలోని వాసవి కన్యకా పరమేశ్వరి శాంతి ధామాన్ని మూసివేస్తున్నట్లు అఖిల భారత పెనుగొండ వాసవి ట్రస్ట్ ఛైర్మన్ గోవిందరాజులు తెలిపారు. గ్రహణం కారణంగా ఆలయ ద్వారాలు మూసి ఉంచుతామని, బుధవారం ఉదయం 8 గంటల నుంచి భక్తులకు అమ్మవారి పునర్దర్శనం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. భక్తులు ఈ మార్పును గమనించి సహకరించాలని ఆయన కోరారు.

March 2, 2026 / 07:20 PM IST

ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్సీ

ఇటీవల కాకినాడ జిల్లా వేట్లపాలెం గ్రామంలో బాణాసంచా ప్రమాదంలో మృతి చెందిన బాధితులను ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, పెద్దాపురం వైసీపీ ఇంఛార్జ్ దవులూరి దొరబాబు, ఎస్సీ సెల్ కార్యదర్శి పలివెల సుధాకర్‌లు సోమవారం సాయంత్రం పరామర్శించారు. రూ.50 లక్షలు నష్టపరిహారం 5 ఎకరాలు భూమి ఇల్లు అర్హులైన వారికి ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

March 2, 2026 / 07:20 PM IST

‘ఆహార నాణ్యత మెరుగుదలకు ప్రత్యేక దృష్టి పెట్టాలి’

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆహార నాణ్యతను మెరుగుపరచాలని ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి ఫుడ్ సేఫ్టీ కమిటీ సమావేశంలో విద్యాసంస్థలలో నాణ్యమైన భోజన సరఫరాపై అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 కింద న్యాయనిర్ణేత అధికారిగా చట్టాన్ని అమలు చేయాలన్నారు.

March 2, 2026 / 07:17 PM IST

హ్యాకథాన్ విజేతల‌కు కలెక్టర్ అభినందన

VZM: హ్యాక‌థాన్ పోటీల్లో గెలుపొందిన ఇద్ద‌రు సాంఘిక సంక్షేమ వ‌స‌తి గృహ విద్యార్ధినుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ రాంసుంద‌ర్ రెడ్డి కలెక్టరేట్‌లో సోమ‌వారం అభినందించారు. విద్యార్థులు యాల యోగేశ్వరి, దాసరి తేజశ్వని హ్యాక‌థాన్ పోటీల్లో సత్తా చాటి నగదు ప్రోత్సాహకాలు అందుకున్నారు. మరిన్ని విజయాలు సాధించాలని, ఉన్నత స్థానానికి చేరుకోవాలని కలెక్టర్ ప్రోత్సహి...

March 2, 2026 / 07:17 PM IST