VZM: చీపురుపల్లి ఇలవేల్పు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారుని ఆదివారం ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదెల శ్రీనివాసులు నాయుడు దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన ఆయనకి ఆలయ కమిటీ ఛైర్మన్ నాగరాజు, ఈవో నానాజీ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారికి వస్త్రాలు, పసుపు, కుంకుమ చెల్లించారు.
TPT: నకిలీ డీప్ ఫేక్ వీడియోలతో తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందని టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్. నాయుడు తెలిపారు. AI సాంకేతికతతో తయారైన ఈ వీడియోలు పూర్తిగా అసత్యమని, టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్రలో భాగమని తెలిపారు. దీని వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని ఆరోపిస్తూ, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
KMM: మార్చి 15 నాటికి వెలుగుమట్ల బాధితులలో అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలం ఇచ్చి, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వెలుగుమట్ల అంశాన్ని కొందరు రాజకీయాలకు వాడుతున్నారని, తాము ఈ అంశాన్ని కేవలం పేదల కోణంలోనే చూస్తున్నట్లు చెప్పారు. ఇంటి స్థలం కోసం ఎవరికి డబ్బులు ఇచ్చారో నిర్భయంగా పోలీసులకు చెప్పాలని సూచించారు.
AP: అనకాపల్లి జిల్లాలోని బాణసంచా కేంద్రాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. వేట్లపాలెం ప్రమాదం నేపథ్యంలో నిఘా పెంచారు. అనకాపల్లి, నర్సీపట్నం, పరవాడ డీఎస్పీలు తనిఖీలు ముమ్మరం చేశారు. అనధికారికంగా బాణసంచా తయారు చేసినా.. నిల్వ చేసినా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా హెచ్చరించారు.
పదేళ్ల క్రితం భారత్, వెస్టిండీస్ మధ్య టీ20 ప్రపంచకప్ 2016 సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ పోరులో విండీస్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రస్తుతం సూపర్-8లో వెస్టిండీస్‌తో టీమిండియా తలపడుతోంది. ఈ పోరులో ఎవరు గెలిస్తే వారే పోటీలో నిలుస్తారు. ఈ నేపథ్యంలో 2016 ఓటమికి ఇప్పుడు బదులు తీర్చుకోవాలని టీమిండియా ఎదురుచూస్తోంది.
KDP: జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు విజిబుల్ పోలీసింగ్‌ను విస్తృతంగా అమలు చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై తనిఖీలు పెంచి నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించారు. సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, అనుమానాస్పద సమాచారాన్ని డయల్ 112కు తెలియజేయాలని పోలీసులు సూచించారు.
MHBD: గార్ల మండల కేంద్రంలోని వర్తక సంఘ భవనంలో ఆదివారం మున్నేరు జల దోపిడి వ్యతిరేక రైతు సదస్సు నిర్వహించారు. మున్నేరు జలసాధన కమిటీ కన్వీనర్ గంగావత్ లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ.. పాత పద్ధతి ప్రకారమే మున్నేరు ప్రాజెక్టును నిర్మించాలని డిమాండ్ చేశారు. స్థానిక రైతులకు అన్యాయం జరిగేలా ప్రాజెక్టు అమలు చేయకూడదని, రైతులు ఉద్యమం ద్వారా అడ్డుకోవాలన్నారు.
MLG: రామప్ప ఆలయాన్ని చత్తీస్గఢ్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ గుజ్జు వెంకటేశ్వర్ సందర్శించారు. ఆలయ అధికారులు, అర్చకులు వారికి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం టూరిజం గైడ్ విజయ్, వారికి ఆలయ విశిష్టత, శిల్పకళ ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన వెంట ఎస్సై చల్ల రాజు పాల్గొన్నారు.
అన్నమయ్య: గూడరేవుపల్లి గ్రామానికి చెందిన బాధితులు ఎమ్మెల్యే కిషోర్‌ని కలిసి వినతిపత్రం సమర్పించారు. వైసీపీ నాయకుల మాటలు నమ్మి సర్వే నంబర్ 757/2, 757/3లోని ప్రభుత్వ భూములు కొనుగోలు చేసి మోసపోయామని తెలిపారు. 120 మందిలో 60 మంది ఇళ్లు నిర్మించగా, ఇటీవల రెవెన్యూ అధికారులు కొన్ని నిర్మాణాలు కూల్చివేశారు. ఈ విషయంపై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
KMR: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా ప్రజావాణిలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అధికారులు తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కారం చేస్తారన్నారు. ప్రజావాణిలో అన్ని శాఖల అధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు.
NZB: 2003 ఉద్యోగ ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వ మెమో 57 ఆధారంగా హైకోర్టు తీర్పును అమలు చేస్తూ పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. దేశంలోని సగం రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ మెమోను అనుసరిస్తూ పాత పెన్షన్ విధానాన్ని తమ ఉద్యోగులకు వర్తింపజేశారన్నారు. మార్చి 7న చలో HYD ఇందిరా పార్క్‌ను విజయవంతం చేయాలన్నారు.
టీమిండియాతో జరుగుతున్న కీలక పోరులో వెస్టిండీస్‌కు మళ్లీ షాక్ తగిలింది. బుమ్రా బౌలింగ్‌లో కీపర్ సంజూకు క్యాచ్ ఇచ్చి హెట్‌మయర్ (27) పెవిలియన్ చేరాడు. అదే ఓవర్‌లో ఓపెనర్ రోస్టన్ ఛేజ్ (40) సూర్యకు క్యాచ్ ఇచ్చాడు. గాల్లోకి ఎగిరి మరీ సూర్య క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో 14 ఓవర్లు ముగిసేసరికి విండీస్ 3 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది.
మరో రెండు రోజుల్లో రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించనున్నట్లు కాంగ్రెస్ అధిష్టానం వెల్లడించింది. అభ్యర్థుల ఖరారుపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ చర్చించినట్లు సమాచారం. తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న 2 స్థానాలను భర్తీ చేయనున్నారు. మార్చి 5 వరకు నామినేషన్ దాఖలు గడువు ఉంది. 10 రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 16న ఎన్నికలు జరగనున్నాయి.
BHNG: స్వర్ణకారులు అన్ని రంగాలలో ఎదగాలని స్వర్ణకార సంఘం యాదాద్రి జిల్లా అధ్యక్షుడు కొండపర్తి బాలా చారి అన్నారు . మోత్కూరు మండల స్వర్ణకార సంఘం ఎన్నికలను స్థానిక ఉన్నత పాఠశాలలో ఆదివారం ఏకగ్రీవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్వర్ణకారులు ఐక్యమత్యంతో రాజకీయ, విద్యా,సామాజిక ఆర్థిక రంగాలలో ఎదగాలని సూచించారు.
అన్నమయ్య: ముంబై గ్రాండ్ హయత్‌లో నిర్వహించిన ఇండియన్ సూపర్ గేమింగ్ లీగ్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ-స్పోర్ట్స్ రంగంలో ఉన్న అవకాశాలపై ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటులు అభిషేక్ బచ్చన్, రణబీర్ కపూర్ హాజరయ్యారు. లీగ్ ఫైనల్స్‌ను విశాఖపట్నంలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.