తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం ఏఎన్ఆర్ కమ్మపల్లిలో ఓ వ్యక్తి చనిపోయిన తన తల్లిదండ్రులపై ప్రేమచాటుకుంటున్నాడు. గ్రామానికి చెందిన హరి తండ్రి వెంకటరత్నం ఆచారి 2008లో, తల్లి లలితమ్మ 2012లో చనిపోయారు. గతంలోనే తండ్రి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా శుక్రవారం ఉదయం ఆ పక్కనే తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించి అభిషేకాలు నిర్వహించారు.
CTR: నిండ్ర మండలంలోని పాదిరి దళితవాడ నందు రాధా రుక్మిణి శ్రీకృష్ణ దేవాలయం కుంభాభిషేకం కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరి నియోజవర్గం ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ వారు ఘనంగా స్వాగతం పలికారు . అనంతరం స్వామి వారిని దర్శించుకుని, ఆయనకు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
కృష్ణ: మచిలీపట్నం పోర్ట్‌కు రైల్వే అనుసంధానం మరింత వేగంగా పూర్తయ్యేలా అవసరమైన ప్రతిపాదనలను తక్షణమే సమర్పించాలని కలెక్టర్ బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓడరేవు రాకపోకలకు ఉపయోగపడే రైల్వే ఓవర్, అండర్‌బ్రిడ్జిల నిర్మాణంపై స్పష్టమైన అంచనాలతో నివేదికలు ఇవ్వాలని సూచించారు.
VZM: కొత్తవలస మండల తహసీల్దార్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఎస్.రమాలక్ష్మీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారిని గురువారం మర్యాదపూర్వకంగా కలసి, పూల మొక్కను అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఆనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. రెవెన్యూ సేవలను ప్రజలకు మరింత చేరువయ్యేలా చూడాలన్నారు.
BDK: భద్రాద్రి రామనవమి వేడుకలు ఈసారి జిల్లా ఉన్నతాధికారులకు సవాల్‌గా మారనున్నాయి. బాధ్యతలు చేపట్టిన తర్వాత కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్ మృణాల్‌కు ఇదే తొలి కళ్యాణ వేడుక. వీరితో పాటు EO దామోదర్‌రావు తొలిసారిగా ఈ వేడుకలను పర్యవేక్షించనున్నారు. 2019 బ్యాచ్‌కు చెందిన కలెక్టర్ అంకిత్ ఇప్పటికే ఏర్పాట్లపై దృష్టి సారించారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ రూపొందించిన చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. తాజాగా ఈ సినిమా ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్ అయ్యింది. ఈ మూవీ డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. ఈ మేరకు పోస్టర్ విడుదల చేసింది. ఈ చిత్ర డిజిటల్ రైట్స్‌ను నెట్ ఫ్లిక్స్ ఏకంగా 80 కోట్ల భారీ ధరకు దక్కించుకున్నట్లు టాక్ వినిపిస్తుంది.
NTR: వీరులపాడు మండలం పెద్దాపురం గ్రామంలో సహకార సంఘం నందు కందులు,శనగల కొనుగోలు కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సహకార సంఘం ఛైర్మన్ నిమ్మల రాజేంద్ర మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రైతులు దళారుల వల్ల నష్ట పోకుండా పెద్దాపురం గ్రామంలోని సహకార సంఘం నందు కందులు, సెనగలు కొనుగోలు కేంద్రాన్ని గురువారం ప్రారంభించడం జరిగిందని తెలిపారు.
CTR: కేడర్ రిజిస్ట్రేషన్‌లో YCP నాయకులు మాజీ మంత్రి ఆర్కే రోజా ఆదేశాల మేరకు నగరి మున్సిపల్ పరిధి కేవీపీఆర్ పేట, సత్రవాడ, కరకంఠాపురం, ఏకాంబరకుప్పం హరిజనవాడ ప్రాంతాల్లో ఉత్సాహంగా నిర్వహించారు. ప్రతి వార్డుకు చెందిన పార్టీ కార్యకర్తలను గుర్తించి, వారి వివరాలను YCP కేడర్ పోర్టల్లో అధికారికంగా నమోదు చేశారు.
కర్నూలు జిల్లా వ్యాప్తంగా గురువారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 293 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆచ్ఐవో లాలప్ప తెలిపారు. మొత్తం 21,428 మందిలో 21,135 మంది పరీక్షలకు హాజరయ్యారని చెప్పారు. పరీక్షలపై సందేహాలుంటే ఆర్ఎవో కార్యాలయ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని సూచించారు. నిబంధనల మేరకు పరీక్షలు సజావుగా నిర్వహించామన్నారు.
SDPT: ఫోరం ఆఫ్ ఫిజికల్ సైన్స్ నిర్వహించిన రాష్ట్రస్థాయి భౌతిక రసాయన శాస్త్ర ప్రతిభా పరీక్షలో పీఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ జక్కాపూర్ విద్యార్థి అశ్విత్ రెడ్డి సత్తా చాటాడు. 33 జిల్లాల నుంచి సుమారు 100 మంది పాల్గొన్న ఈ పోటీలో 9వ తరగతి చదువుతున్న అశ్విత్ 50కి 35 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు కైవసం చేసుకున్నాడు.
MDCL: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లంపేట్ గ్రామంలో అర్ధరాత్రి దారుణం జరిగింది. ఇంటి బయటకు వచ్చిన ఇమ్రాన్ (27) అనే వ్యక్తిపై బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఒక్కసారిగా దాడి చేశారు. ఈ క్రమంలో నిందితులు ఇమ్రాన్ కడుపులో కత్తితో పొడవడంతో ఆయనకు తీవ్ర రక్తస్రావమైంది. బాధితుడిని వెంటనే చికిత్స నిమిత్తం నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సింది.
SRD: జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. వాహనదారులు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ముఖ్యంగా రోడ్డుపై పాదచారులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
ATP: విజయవాడ సెక్రటేరియట్‌లోని ముఖ్యమంత్రి ఛాంబర్‌లో నారా చంద్రబాబు నాయుడిని లేబర్ బోర్డ్ ఛైర్మన్ వెంకట శివుడు యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గుంతకల్లు నియోజకవర్గంలోని పలు కీలక అభివృద్ధి అంశాలపై ఆయనతో చర్చించారు. నియోజకవర్గ సమస్యలను వివరించగా సీఎం సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు.
సత్యసాయి జిల్లా MJP గురుకుల పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను వివిధ తరగతుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ ఆర్. జమునా బాయి తెలిపారు. దరఖాస్తుకు చివరి తేదీ వచ్చే నెల 4తో ముగుస్తుందన్నారు. 5వ తరగతి ప్రవేశ పరీక్ష మార్చి 12న ఉంటుందని, 6, 7, 8 తరగతుల ప్రవేశ పరీక్ష మార్చి 19న (మధ్యాహ్నం) ఉంటుందన్నారు.
HYD: నగరంలోని మణికొండ సమీపంలో ఉన్న మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్‌లో ప్రకృతి ప్రేమికుల కోసం తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ(TGFDC)ప్రత్యేక ‘రాక్ బే నేచర్ క్యాంప్’ ఆఫర్ చేస్తోంది. ఫిబ్రవరి 28 సాయంత్రం నుంచి మార్చి 1 ఉదయం వరకు జరిగే ఈ క్యాంప్‌లో ట్రెకింగ్, క్యాంప్ ఫైర్, బర్డ్ వాచింగ్ వంటివి ఉన్నాయి. ప్రకృతి ప్రేమికులు నిపుణులతో కలిసి పక్షుల లోకాన్ని చూడొచ్చు.