• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

భగలాముఖి దేవిని దర్శించుకున్న అదనపు ఎస్పీ

MDK: శివంపేట శ్రీ భగలాముఖి దేవి శక్తి పీఠాన్ని దర్శించిన అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థాన అధికారులు, అర్చకులు సాదరంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వాదాలు పొందారు. జిల్లా ప్రజలు శాంతి, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఇందులో ఎస్ఐ మధుకర్ రెడ్డి పాల్గొన్నారు.

March 5, 2026 / 08:10 PM IST

T20 WC: తృటిలో సంజూ శాంసన్ సెంచరీ మిస్

ఇంగ్లండ్‌తో సెమీస్‌లో సంజూ శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 42 బంతుల్లోనే 89 పరుగులు చేశాడు. జాక్స్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించగా.. బౌండరీ దగ్గర సాల్ట్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. ఈ ఇన్నింగ్స్‌లో సంజూ 8 ఫోర్లు, 7 సిక్సర్లు కొట్టాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో టీమిండియాలో తను ఎంతటి విలువైన ఆటగాడో సంజూ మరోసారి నిరూపించుకున్నాడు.

March 5, 2026 / 08:08 PM IST

‘జీపీ కార్మికులను కాంగ్రెస్ మోసం చేసింది’

KNR: జీపీ కార్మికులను కాంగ్రెస్ మోసం చేసిందని, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కొప్పుల శంకర్ అన్నారు. ఆకునూరి సుధాకర్ అధ్యక్షతన హుజురాబాద్ హమాలీ యూనియన్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. జీపీ కార్మికులకు మూడు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వేతనాలు చెల్లించడం లేదని అన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన విధంగా పంచాయతీ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలన్నారు.

March 5, 2026 / 08:08 PM IST

వాహన తనిఖీలు నిర్వహించిన పోలీసులు

VZM: తెర్లాం పోలీసు స్టేషన్ కూడలిలో గురువారం సాయంత్రం ఎస్సై సాగర్ బాబు సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహించారు. శిరస్త్రాణం విధిగా ధరించాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడపకూడదని కోరారు. ప్రయాణ సమయాల్లో వాహన పత్రాలు వెంట ఉండాలన్నారు. ట్రిబుల్ రైడింగ్ చేయకూడదన్నారు. ట్రాఫిక్ పోలీసు నిబంధనలు పాటించాలని కోరారు.

March 5, 2026 / 08:08 PM IST

నీటిలో పడి గొర్రెల మృతి..!

NDL: బేతంచర్ల మండలం బుగ్గనపల్లె గ్రామానికి చెందిన 80 గొర్రెలు బనగానపల్లె మండలం చెరువుపల్లె సమీపంలో మేతకు వెళ్లి నీటిలో ఒకదానిపై ఒకటి పడి ఇవాళ మృతి చెందాయి. విషయం తెలుసుకున్న డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ సంఘటన స్థలానికి చేరుకుని రైతులను ఓదార్చారు. గొర్రెల మృతితో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలని సంబంధిత అధికారులను ఆమె కోరారు.

March 5, 2026 / 08:07 PM IST

“నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు”

కోనసీమ: జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా గురువారం అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు. జిల్లాలోని SHOలు, పోలీస్ సిబ్బంది అమలాపురం ప్రధాన కూడళ్లలో తనిఖీలు చేపట్టి, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అతి వేగంగా వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకున్నారు.

March 5, 2026 / 08:07 PM IST

‘ప్రైవేట్ లాడ్జీల నిర్వహకులు నిబంధనలు పాటించాలి’

SRCL: ప్రైవేటు లాడ్జిల నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని వేములవాడ పట్టణ సీఐ వీరప్రసాద్ సూచించారు. లాడ్జిలకు వచ్చే అతిధుల వద్ద పూర్తి ధృవీకరణ పత్రాలు తీసుకోవాలని, మైనర్లకు గదులు ఇవ్వవద్దని, లాడ్జీల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, రికార్డులు సరిగ్గా నిర్వహించాలని ఆయన సూచించారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

March 5, 2026 / 08:06 PM IST

అనారోగ్యంతో ఖమ్మం జిల్లా మాజీ జెడ్పీ ఛైర్మన్ మృతి

ఖమ్మం జిల్లా మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్ గోనెల విజయలక్ష్మి గురువారం అనారోగ్యంతో మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె పాల్వంచలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉన్న సమయంలో ఆమె ఖమ్మం జడ్పీ ఛైర్మన్‌గా పదవి స్వీకరించి అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించారు.

March 5, 2026 / 08:05 PM IST

రైలు హాల్టింగ్ కోరుతూ ఎంపీకి విన్నపం

GDWL: ఇటిక్యాల రైల్వే స్టేషన్లో తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ నిలపాలని కోరుతూ ఎంపీ డీకే అరుణకు గురువారం BJP శ్రేణులు, గ్రామస్థులు వినతిపత్రం సమర్పించారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ హాల్టింగ్ ఎంతో అవసరమని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, నేతలు కేకే రెడ్డి, జగదీశ్ రెడ్డి పాల్గొన్నారు.

March 5, 2026 / 08:05 PM IST

సాగు నీటిని అందించాలని రైతుల ధర్నా..!

SDPT: రంగనాయకసాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువ కింద ఉన్న ఎల్ఎస్ఎం – 2 కాలువ పనులు పూర్తి చేసి పంటలకు సాగునీరు అందించాలని మాచాపూర్ రైతులు, బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు గురువారం రంగనాయకసాగర్ వద్ద ఉన్న నీటిపారుదల శాఖ ఎస్ఈ కార్యాలయం ముందు ధర్నా చేశారు. అనంతరం వినతి పత్రం అందజేశారు. సాగు నీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని వారు తెలిపారు.

March 5, 2026 / 08:05 PM IST

వేం నరేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ

WGL: కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డి ఎంపికైయ్యారు. ఈ సందర్భంగా ఆయన్ని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో గురువారం వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మర్యాదపూర్వకంగా కలిశారు. రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైన సందర్భంగా పుష్ప గుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

March 5, 2026 / 08:05 PM IST

ఘనంగా భట్టి కుమారుడి పెళ్లి

TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడి పెళ్లి ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే, చిదంబరం, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్, ఏపీ మంత్రి నాదెండ్ల, వైఎస్ షర్మిల, విజయమ్మ, మాజీ మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, సోనూసూద్, మోహన్ బాబు తదితరులు హాజరయ్యారు.

March 5, 2026 / 08:04 PM IST

జమ్మలమడుగులో స్కానింగ్ సెంటర్లలో తనిఖీలు

KDP: జమ్మలమడుగులో గురువారం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్కానింగ్ సెంటర్లలో తనిఖీ చేశారు. DY DMHO డాక్టర్ గీత ఆధ్వర్యంలో హెల్త్ ఎడ్యుకేషన్ అధికారి వెంకటేశ్వర్లు, సీవో శ్రీనివాసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గీత మాట్లాడుతూ.. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమన్నారు.చట్టాన్ని అతిక్రమించి నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

March 5, 2026 / 08:04 PM IST

బెల్ట్ షాప్ నిర్వాహకుడిపై కేసు నమోదు

PDPL: ధర్మారం మండలం నరసింహులపల్లి గ్రామంలో గురువారం బెల్ట్ షాప్ నిర్వాహకుడు కొండ బత్తుల ప్రభాకర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు అతని దుకాణంలో తనిఖీ చేయగా 7.07 లీటర్ల లిక్కర్ లభ్యమైందని తెలిపారు. దీంతో లిక్కర్ సీజ్ చేసి, ప్రభాకర్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

March 5, 2026 / 08:04 PM IST

నిరుద్యోగులను చంద్రబాబు మోసం చేశారు: MLC

AP: నిరుద్యోగులను చంద్రబాబు నిలువునా మోసం చేశారని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ ధ్వజమెత్తారు. ‘జాబ్ క్యాలెండర్ అదిగో, ఇదిగో అంటూ నమ్మించి దగా చేశారని మండిపడ్డారు. చంద్రబాబు మాటలేమో మిలియన్స్‌లో ఉంటాయి, గ్రౌండ్‌లోనేమో అన్నీ వేకెన్సీలే కనబడుతున్నాయి. చంద్రబాబు ఏకంగా 6.28 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. వివరాలు ఇవ్వమంటే పారిపోతున్నారు’ అని విమర్శించారు.

March 5, 2026 / 08:03 PM IST