• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ.!

MDK: టేక్మాల్(మం) సంగ్య తండాలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి సర్పంచ్ సక్రు, కాంగ్రెస్ నాయకులు భూమిపూజ చేశారు. ఉపాధి హామీ పథకం(MGNREGS) కింద మంజూరైన రూ.20 లక్షలతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ఈ భవనం దోహదపడుతుందని పేర్కొన్నారు.

February 27, 2026 / 03:44 PM IST

జిల్లాలో ఎరువుల కొరత లేదు: వ్యవసాయ అధికారి

KRNL: 2025-26 రబీ సీజన్‌కు కర్నూలు జిల్లాలో ఎరువుల కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మీ శుక్రవారం తెలిపారు. జిల్లాకు 24,580 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అంచనా వేయగా, ప్రస్తుతం 25,635 మెట్రిక్ టన్నుల నిల్వ ఉందన్నారు. నానో యూరియా, నానో డీఏపీ కూడా అందుబాటులో ఉండటంతో రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

February 27, 2026 / 03:44 PM IST

వరంగల్ మార్కెట్లో చిరుధాన్యాల ధరలు ఇలా..!

వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కి శుక్రవారం చిరుధాన్యాలు తరలిరాగా, ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా మక్కలు (బిల్టీ) రూ. 1,905 ధర వచ్చింది. అలాగే, సూక పల్లికాయకు రూ. 10వేలు, పచ్చి పల్లికాయకు రూ. 5,400 ధర వచ్చింది. పసుపు క్వింటాకి కొత్తది రూ. 11,151 ధర వస్తే.. నం. 5 రకం మిర్చి రూ. 20,200, దీపిక మిర్చి రూ. 20వేలు ధర పలికాయని వ్యాపారస్థులు తెలిపారు.

February 27, 2026 / 03:43 PM IST

చిలకూరి బాలాజీ ప్రధాన అర్చకుడు మృతి

TG: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సౌందర్ రాజన్ చనిపోయారు. చిలుకూరులోని నివాసంలో సౌందర్ రాజన్ తుదిశ్వాస విడిచారు. చిలుకూరు బాలాజీ ఆలయ అభివృద్ధిలో, అక్కడి సంప్రదాయాలను కాపాడటంలో ఆయన పాత్ర ఎంతో కీలకమైనది. ఆయన మరణం భక్తులకు, ఆలయ కుటుంబానికి తీరని లోటు.

February 27, 2026 / 03:43 PM IST

బుచ్చిలో రేపు కౌన్సిల్ సమావేశం

NLR: బుచ్చిరెడ్డిపాలెం పురపాలక సంఘం కార్యాలయంలో శనివారం ఉదయం 11 గంటలకు ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ మురళి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరుగుతుందని నగర కమిషనర్ బాలకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో 15 అజెండాలు ప్రవేశపెడుతున్నామన్నారు. ఈ కార్యక్రమానికి కౌన్సిలర్లు కో ఆప్షన్ నెంబర్లు హాజరుకావాలని కోరారు.

February 27, 2026 / 03:41 PM IST

తల్లి నీ కష్టం ప్రభుత్వం తీర్చేనా..?

TPT: రేణిగుంట మేజర్ పంచాయతీలో జీతాలు రాక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పూట గడవక ప్రైవేట్ ఫంక్షన్ల వద్ద చిన్నపాటి పనులు చేస్తూ అక్కడే అన్నం తింటున్నామని వాపోతున్నారు. జీతం వస్తేనే కుటుంబాలు నడుస్తాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు ధర్నాలు నిర్వహించినా అధికారులు స్పందించలేదని ఆరోపిస్తున్నారు.

February 27, 2026 / 03:40 PM IST

ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం: డీఈ

W.G: సాగునీటి ఎద్దడి లేకుండా, ఆయకట్టు పరిధిలోని ప్రతి ఎకరానికీ నీరు అందేలా చర్యలు తీసుకుంటామని ఇరిగేషన్ డీఈ సీహెచ్ వెంకట్ నారాయణ రైతులకు భరోసా ఇచ్చారు. శుక్రవారం ఎల్.బి.చర్లలో రైతులతో కలిసి కాలువలు, పంట పొలాలను ఆయన పరిశీలించారు. సాగునీటి వృధాను అరికట్టేందుకు, నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా కాలువల పూడికతీత పనులు ఎప్పటికప్పుడు చేయిస్తున్నామని తెలిపారు.

February 27, 2026 / 03:40 PM IST

బ్రహ్మంగారి మఠం మాస కళ్యాణానికి విరాళం

KDP: బ్రహ్మంగారి మఠంలో నిర్వహించే స్వామివారి మాస కళ్యాణానికి మిర్యాలగూడకు చెందిన రామాచారి దంపతులు శుక్రవారం రూ.1,00,116 అందజేశారు. నూతన పీఠాధిపతి వెంకటాద్రి స్వాములవారి ఆదేశాలతో మఠం మేనేజర్ ఈశ్వర చారి వారికి స్వామి వారి దర్శన భాగ్యం కల్పించి, శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. ప్రతినెల శుద్ధ ద్వాదశి రోజున స్వామి వారి కళ్యాణం నిర్వహించనున్నారు.

February 27, 2026 / 03:40 PM IST

మక్కా మసీద్‌కు ఏసీ బహూకరణ

NLG: చిట్యాల మున్సిపాలిటీ 4వ వార్డ్‌లో గల మక్కా మసీదుకు స్థానిక మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్ గుండెబోయిన శ్రీలక్ష్మీ సైదులు యాదవ్ శుక్రవారం ఏసీని బహూకరించారు. ముస్లిం సోదరులు చేసిన విజ్ఞప్తి మేరకు వారు వెంటనే స్పందించి ఈవితరణకు పూనుకున్నారు. కార్యక్రమంలో వనమా వెంకటేశ్వర్లు, నిస్సార్, ఇబ్రహీం, ఫరీద్, సమీర్, జమీల్ అబ్దుల్, జానీ, జావిద్, పాష పాల్గొన్నారు.

February 27, 2026 / 03:39 PM IST

‘మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షకు రేపే లాస్ట్ డేట్’

PDPL: 2026- 27 విద్యా సంవత్సరం మోడల్ స్కూల్లో ప్రవేశాలకు రేపే చివరి తేదీ అని ధర్మారం మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ రాజ్ కుమార్ తెలిపారు. 6వ తరగతిలో పూర్తి సీట్లు, 7 నుంచి 10 తరగతులకు మిగిలిన సీట్లకు ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పాఠశాలలో ఆన్‌లైన్ చేయడానికి సహాయ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

February 27, 2026 / 03:39 PM IST

పిల్లలకు పౌష్టిక ఆహారం అందించండి: సర్పంచ్

BDK: లక్ష్మీదేవి పల్లి మండలం హమాలీ కాలనీ గ్రామపంచాయతీ సర్పంచ్ గుగులోత్ ప్రేమిందర్ నాయక్ MPPS పాఠశాలను సందర్శించారు. మధ్యాహ్నం భోజనం చేస్తున్న విద్యార్థులతో మాట్లాడి మెనూ వివరాలను అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు సరైన పౌష్టిక ఆహారం అందించాలని మధ్యాహ్న భోజన కార్మికులకు సూచించారు. అనంతరం విద్యార్థులకు ఏ సమస్య ఉన్న తనకు తెలియజేయాలని సూచించారు.

February 27, 2026 / 03:39 PM IST

కేజీహెచ్‌లో అరుదైన క్యాన్సర్ శస్త్రచికిత్స విజయవంతం

VSP: మడుగులకి చెందిన 43 ఏళ్ల పురుషుడు కేజీహెచ్ జనరల్ సర్జరీ S3 యూనిట్‌లో ప్రొఫెసర్ డా. బెండి తేజేశ్వరరావు ఆధ్వర్యంలో చేరాడు. పరీక్షల అనంతరం పెరియాంపుల్లరీ కార్సినోమా కారణమైన ఆబ్స్ట్రక్టివ్ జాండిస్‌గా నిర్ధారణైంది. ఆరోగ్యశ్రీ కింద సుమారు 5 గంటల పాటు విపుల్ (Whipple’s) శస్త్రచికిత్స శుక్రవారం విజయవంతంగా నిర్వహించారు.

February 27, 2026 / 03:36 PM IST

ఎక్కువ పండ్ల సాగు జరిగేది APలోనే: చంద్రబాబు

AP: రాయలసీమలో హార్టికల్చర్‌ను ప్రోత్సహిస్తున్నామని CM చంద్రబాబు అన్నారు. ‘దేశంలో ఎక్కువ పండ్ల సాగు జరిగేది APలోనే. ప్రకృతి సేద్యాన్ని 50 లక్షల ఎకరాలను విస్తరిస్తాం. వ్యవసాయంలో యాంత్రీకరణను పెంచుతున్నాం. రాష్ట్రంలో ఆక్వా సాగును మరింతగా ప్రోత్సహిస్తాం. ప్రపంచానికి ఏపీ ఆక్వా హబ్‌గా మారుతుంది. భూగర్భ జలాలు పెంచేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.

February 27, 2026 / 03:36 PM IST

ప్రతి సమస్య పరిష్కారానికి కృషి: గిరిధర్ రెడ్డి

నెల్లూరు: రూరల్ నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తున్నామని TDP నాయకులు గిరిధర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం నెల్లూరు రూరల్ MLA కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుత.. ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ, వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు

February 27, 2026 / 03:35 PM IST

ఏనుగుల నియంత్రణకు ‘ఆపరేషన్ గజ’

CTR: గుడిపాల(M) చిత్తపారలో విధ్వంసం సృష్టిస్తున్న అడవి ఏనుగుల నియంత్రణకు ఫారెస్ట్ అధికారులు చర్యలు చేపట్టారు. రామకుప్పం(M) ననియాల ఎలిఫెంట్ క్యాంపులోని శిక్షణ పొందిన ఏనుగు జయంత్ (55) సారథ్యంలో పలమనేరు ముసలిమడుగులో కర్ణాటక నుంచి వచ్చిన దేవా, అభిమన్యు, కృష్ణ ఏనుగులు ఆపరేషన్ గజలో పాల్గొననున్నాయి.

February 27, 2026 / 03:33 PM IST