• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నిడుబ్రోలులో టీడీపీ సీనియర్ నేత మృతి

GNTR: నిడుబ్రోలు 11వ వార్డు రామ మందిరం ప్రాంతానికి చెందిన టీడీపీ సీనియర్ నేత జాగర్లమూడి నాగేశ్వరావు సోమవారం మృతి చెందారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. నాగేశ్వరావు మృతికి ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, కూటమి నేతలు, శ్రేణులు సంతాపం తెలిపారు. అంతిమ కార్యక్రమం మంగళవారం ఉదయం నిర్వహించనున్నారు.

February 23, 2026 / 09:30 PM IST

ఈ వారం థియేటర్ విడుదల చిత్రాలు ఇవే

➢ ‘విష్ణు విన్యాసం’ : FEB-27➢ ‘ది రైజ్ ఆఫ్ అశోక’ : FEB-27➢ ‘ది కేరళ స్టోరీ 2’ : FEB-27➢ ‘సన్ ఆఫ్’ : FEB-27➢ ‘ఉత్తుత్త హీరోలు’ : FEB-27

February 23, 2026 / 09:30 PM IST

T20 WCలో హెట్మేయర్ అరుదైన రికార్డ్

జింబాబ్వేపై హెట్మేయర్ 34 బంతుల్లోనే 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 85 పరుగులు బాదాడు. ఈ క్రమంలోనే ప్రస్తుత WCలో మొత్తంగా 17 సిక్సర్లు కొట్టాడు. దీంతో సింగిల్ T20 WC ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్ల జాబితాలో పూరన్‌(17)తో కలిసి హెట్మేయర్ అగ్రస్థానంలో నిలిచాడు. అయితే, ఈ మెగాటోర్నీ పూర్తయ్యేలోపు అతడు ఈ రికార్డును మరింతగా మెరుగుపరుచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

February 23, 2026 / 09:23 PM IST

‘గ్రంథాలయాల అభివృద్ధి కోసం కృషి చేస్తాం’

BDK: జిల్లాలోని పలు గ్రంధాలయాల అభివృద్ధికి రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి ఇటీవల 50 లక్షల రూపాయలు మంజూరు చేశారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ పసుపులేటి వీరబాబు సోమవారం వారిని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రతి గ్రంథాలయాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు ఆయన తెలిపారు.

February 23, 2026 / 09:18 PM IST

పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ అప్పగింత

PDPL: కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పందిళ్ల గ్రామానికి చెందిన దబ్బేట శ్రీకాంత్ ఇటీవల తన మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న నేపథ్యంలో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు సీఈఐఆర్ సాంకేతికత ద్వారా ఫోన్ ఉన్న చోటును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐ నీలిమా బాధితుడు శ్రీకాంత్‌ను పిలిపించి ఫోన్‌ను అందజేశారు.

February 23, 2026 / 09:16 PM IST

కృష్ణా మండల ఉపాధ్యాయుల సముదాయ సమావేశం

NRPT: కృష్ణా మండలంలో నిర్వహించిన ఉపాధ్యాయుల సముదాయ సమావేశంలో MEO నిజాముద్దీన్ పాల్గొన్నారు. వచ్చే రెండు నెలల్లో విద్యార్థులకు తెలుగు, ఆంగ్లం, గణితం సబ్జెక్టులను సమర్థంగా బోధించేందుకు సరైన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని సూచించారు. సమావేశం స్థానిక ప్రధానోపాధ్యుడు కిషోర్ అధ్యక్షతన జరిగింది.

February 23, 2026 / 09:15 PM IST

KDP: కారు ఢీకొని జింక మృతి

KDP: చెన్నూరు-కాజీపేట సరిహద్దులోని సీ. కొత్తపల్లి సమీపంలో సోమవారం రోడ్డు దాటుతున్న ఓ జింకను గుర్తుతెలియని కారు ఢీకొనడంతో అది అక్కడికక్కడే మృతి చెందింది. ఆహారం కోసం కొండ ప్రాంతం నుంచి జాతీయ రహదారిపైకి వచ్చిన జింక, వేగంగా వస్తున్న వాహనానికి బలయ్యింది. సమాచారం అందుకున్న ఖాజీపేట అటవీ అధికారులు జింక కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు.

February 23, 2026 / 09:15 PM IST

GOOD NEWS: మార్చిలో 10 రోజులు సెలవులు

మార్చి నెలలో విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులకు 10 రోజులు సెలవులు రానున్నాయి. ఈ నెలలో 5 ఆదివారాలు ఉండటం విశేషం. వీటితో పాటు మార్చి 4న హోలి పండుగ, మార్చి 14న రెండో శనివారం సెలవులు ఉంటాయి. మార్చి 19న ఉగాది, మార్చి 20న రంజాన్, మార్చి 26న శ్రీరామనవమి ప్రభుత్వ సెలవులు ఉండనున్నాయి. మార్చి 31న మహావీర్ జయంతి ఆప్షనల్ హాలీడే.

February 23, 2026 / 09:15 PM IST

రాష్ట్రస్థాయికి ఎంపికైన బొమ్మనపల్లి విద్యార్థులు

KNR: చిగురుమామిడి మండలం జడ్పీహెచ్ఎస్ బొమ్మనపల్లికి చెందినటువంటి విద్యార్థులు తాళ్ల రిచిత, బొల్లి విజయ విద్యార్థులు సీఎం కప్లో ఖోఖో పోటీలకు ఎంపికయ్యారని పీటీ పీ. జ్యోతి తెలిపారు. నల్లగొండ జిల్లాలో 20, 21 తేదీల్లో జరిగిన సీఎం కప్ క్రీడల్లో పాల్గొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పోలాడి లక్ష్మణ్ రావు, ఎంఈవో జయప్రద, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులను అభినందించారు.

February 23, 2026 / 09:12 PM IST

‘ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి’

SRCL: ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని వీర్నపల్లి ఎస్సై వేముల లక్ష్మణ్ సూచించారు. వీర్నపల్లి మండల కేంద్రంలో రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. హెల్మెట్ ధరించడం కేవలం ట్రాఫిక్ నిబంధన మాత్రమే కాదని, అది మీ ప్రాణాలకు భరోసా అని పేర్కొన్నారు. ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించాలని, వాహన పత్రాలు వెంట ఉంచుకోవాలన్నారు.

February 23, 2026 / 09:09 PM IST

OTRపై TGPSC కీలక అప్‌డేట్

TG: ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియను వేగవంతం చేసేందుకు TGPSC కీలక సంస్కరణ చేపట్టింది. దరఖాస్తులో వన్ టైమ్ రిజిస్ట్రేషన్(OTR) చేసుకున్న వారు తమ ID సహాయంతో తాజా వివరాలు అప్‌డేట్ చేసుకోవాలి. ఇందుకు సంబంధించిన ప్రక్రియను టీజీపీఎస్సీ మార్చి 25 వరకు పొడిగించింది. ఈ వివరాల ఆధారంగానే భవిష్యత్ నియామక పరీక్షకు దరఖాస్తులకు అర్హత లభిస్తుంది.

February 23, 2026 / 09:07 PM IST

బాధితులకు అండగా జిల్లా పోలీసు వ్యవస్థ: SP

ADB: బాధితుల పట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సోమవారం పోలీసు ముఖ్య కార్యాలయంలో గ్రీవెన్స్ డే సందర్భంగా ప్రజా ఫిర్యాదులను నేరుగా స్వీకరించారు. బాధితుల సమస్యల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, త్వరితగతిన పరిష్కారానికి కృషి చేయాలని సంబంధిత సిబ్బందికి తెలియజేశారు.

February 23, 2026 / 09:06 PM IST

T20 WC: వెస్టిండీస్.. రికార్డులే రికార్డులు

జింబాబ్వేతో మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. 20 ఓవర్లలో ఏకంగా 254/6 పరుగులు బాదారు. దీంతో 2026-T20 WC చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా వెస్టిండీస్ నిలిచింది. అలాగే, T20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన రెండో జట్టుగా రికార్డు నమోదు చేసింది. 260/6 పరుగులతో శ్రీలంక (vs కెన్యా, 2007) తొలి స్థానంలో కొనసాగుతోంది.

February 23, 2026 / 09:05 PM IST

ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే

అమెజాన్ ప్రైమ్ వీడియో : ఇక్కీస్ (FEB-26), హనీ (FEB-27); నెట్‌ఫ్లిక్స్ : అక్యూజ్డ్ (FEB-27); జియో హాట్‌స్టార్ : రోస్లిన్ (సిరీస్ FEB-27), సీక్రెట్ స్టోరీస్ (FEB-27), బుగోనియా (FEB-28); జీ5 : క్రాంతి జ్యోతి విద్యాలయ్ (FEB-27), రాక్షస (FEB-27), డాటర్ ఆఫ్ ప్రసాదరావు సిరీస్ (FEB-27); ఈటీవీ విన్: శ్రీ చిదంబరం గారు (FEB-26)

February 23, 2026 / 09:05 PM IST

BREAKING: మార్చి 20న బడ్జెట్

TG: రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మార్చి 16 నుంచి 30 వరకు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. మార్చి 16న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం, మార్చి 20న రాష్ట్ర బడ్జెట్ పెట్టేందుకు మంత్రివర్గం ఆమోదించింది.

February 23, 2026 / 09:02 PM IST