• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మంచి చేసే వారికి భగవంతుడు అండగా ఉంటాడు: స్పీకర్

BHPL: మంచి చేసేవారికి భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. రేగొండ మండలం కోడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ పునఃప్రతిష్ఠ మహోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేవాలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.12.15 కోట్లు మంజూరు చేసిందని అన్నారు. చిన్న జీయర్ స్వామి, MLA గండ్ర ఉన్నారు.

February 21, 2026 / 04:59 PM IST

అర్ధరాత్రి క్యాబ్‌లో వెళ్తుంటే : ప్రియాంక

ప్రియాంక చోప్రా తన చిన్నతనంలో జరిగిన ఓ భయానక ఘటనను గుర్తుచేసుకుంది. ’11ఏళ్ల వయసున్నప్పుడు, ఢిల్లీలో అర్ధరాత్రి 11 గంటలకు తల్లితో కలిసి క్యాబ్‌లో వెళ్తుండగా డ్రైవర్ రూట్ మార్చాడు. వెంటనే అప్రమత్తమైన అమ్మ, డ్రైవర్ గొంతు పట్టుకుని హెచ్చరించి.. మరీ మెయిన్ రోడ్డుకు వచ్చేలా చేసింది. బిడ్డను రక్షించుకోవాలన్న తపనలో అమ్మ చూపిన ఆ ధైర్యం మరువలేనిది’ అని పేర్కొంది.

February 21, 2026 / 04:54 PM IST

YSR పేరు మార్పుపై అంబటి ఆగ్రహం

GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని ఇంజినీరింగ్ కాలేజీకి ఉన్న మాజీ సీఎం డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు మార్చడం దారుణమని వైసీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ అన్నారు. శనివారం ANUలో VC గంగాధరరావును కలిసి వినతిపత్రం ఇచ్చి, 2009 పాలకమండలి తీర్మానాన్ని గౌరవించాలని కోరారు.

February 21, 2026 / 04:53 PM IST

జగన్నాథపురం పాఠశాలలో మాతృభాష దినోత్సవ వేడుకలు

SRPT: మునగాల మండలం జగన్నాథపురం ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు భరత్ బాబు మాట్లాడుతూ.. మాతృభాషలో విద్యనభ్యసించడం వల్ల విద్యార్థులకు జ్ఞాన సముపార్జన సులువుగా జరుగుతుందని, తద్వారా సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని తెలిపారు.

February 21, 2026 / 04:50 PM IST

తగ్గేదే లే.. నా స్టైల్ ఇంతే: అభిషేక్ శర్మ

టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. వరుసగా విఫలమవుతుండటంతో తన ఫామ్‌పై వస్తున్న విమర్శలకు అభిషేక్ స్పందించాడు. తన బ్యాటింగ్ శైలిలో ఎలాంటి మార్పు ఉండబోదని అతను స్పష్టం చేశాడు. గత ఏడాదిన్నర కాలంగా తాను ఇదే దూకుడుతో ఆడుతున్నానని, భవిష్యత్తులో కూడా అదే ఆటతీరును కొనసాగిస్తానని ధీమా వ్యక్తం చేశాడు.

February 21, 2026 / 04:49 PM IST

ఘనంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు

GNTR: కృష్ణానగర్ 1వ లైన్‌లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శ్రీ లక్ష్మీనారాయణస్వామి 80వ వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. శనివారం హయగ్రీవ విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుల కల్యాణం వైభవంగా జరిగింది. విష్ణుసహస్రనామ పారాయణ, గరుడ వాహనంపై తిరువీధి ఉత్సవం భక్తులను ఆకట్టుకుంది.

February 21, 2026 / 04:49 PM IST

ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే

JN: చిల్పూరు మండలంలోని శ్రీపతిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటిని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. 85శాతం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించి ఉమ్మడి జిల్లాలోనే స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం మొదటి స్థానంలో ఉందన్నారు. నిరుపేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించే విధంగా ప్రభుత్వం అందరికీ ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేస్తున్నదని చెప్పారు.

February 21, 2026 / 04:48 PM IST

నిలిచిపోయిన ఎయిరిండియా విమానం

AP: గన్నవరం- షార్జా ఎయిరిండియా విమానం నిలిచిపోయింది. దీంతో గన్నవరం ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ప్రయాణికులు, ఎయిరిండియా సిబ్బంది మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. షార్జాలో వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాన్ని నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. షార్జా వెళ్లాల్సిన 163 మంది ప్రయాణికులు ఆగిపోవాల్సి వచ్చింది.

February 21, 2026 / 04:48 PM IST

కంప్యూటర్ సెక్షన్‌ను ప్రారంభించిన ఛైర్మన్

HNK: జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో అంధులకు(బ్రెయిలీ లిపి) వారికి కంప్యూటర్, బుక్స్ సెక్షన్స్‌ను గ్రంథాలయ ఛైర్మన్ అజీజ్ ఖాన్ ప్రారంభించారు. జిల్లాలోని అంధులకు కంప్యూటర్ నైపుణ్యం కలిగి ఉండాలనే ఉద్దేశంతో సెక్షన్స్ ప్రారంభించామని, అంధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ కార్యదర్శి శశిజాదేవి, తదితరులు పాల్గొన్నారు.

February 21, 2026 / 04:46 PM IST

విశాఖకు పెట్టుబడులు క్యూ కడుతున్నాయి: మంత్రి

AP: విశాఖ ప్రపంచస్థాయి నగరంగా మారుతోందని, ఇక్కడికి పెట్టుబడులు క్యూ కడుతున్నాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల అని, దానిని సాకారం చేసే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. విశాఖ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు.

February 21, 2026 / 04:46 PM IST

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన MLA

ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని భట్టుపల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని MLA హరీష్ బాబు శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న మెడికల్ ఆఫీసర్ ని ఆసుపత్రి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఔట్ పేషంట్ సేవలని విస్తరించాలని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.

February 21, 2026 / 04:46 PM IST

రైతులకు ఫార్మర్ ఐడీ తప్పనిసరి: ఏఈవో

MBNR: ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలంటే ప్రతి రైతుకూ ‘ఫార్మర్ ఐడీ’ తప్పనిసరని మూసాపేట మండల ఏఈవో శశిత తెలిపారు. రైతులు తమ ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ బుక్, ఫోన్ నెంబర్ రైతు వేదికకు వచ్చి వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. ఈ ఐడీ ఉంటేనే భవిష్యత్తులో ప్రభుత్వ సాయం నేరుగా అందుతుందని స్పష్టం చేశారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

February 21, 2026 / 04:45 PM IST

27 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

AKP: ఎలమంచిలి నియోజకవర్గ పరిధిలో 27 మందికి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ శనివారం స్థానిక జడ్పీ అతిథిగృహంలో సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. వీరికి రూ.13.76 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకున్న వారికి తన సిఫారసు మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు అయిందన్నారు. ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు.

February 21, 2026 / 04:45 PM IST

కొలువుదీరిన కొమ్ముగూడెం సొసైటీ నూతన పాలకవర్గం

W.G: తాడేపల్లిగూడెం రూరల్ మండలం కొమ్ముగూడెం గ్రామం విశాల సహకార పరపతి సంఘ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకార మహోత్సవం శనివారం జరిగింది. నూతన అధ్యక్షులుగా అబ్బిన వీర వెంకటరావు పదవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం టీడీపీ ఇంఛార్జ్ వలవల బాబ్జి మాట్లాడారు. సభ్యుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సంఘ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.

February 21, 2026 / 04:45 PM IST

అంతర్గత డ్రైనేజ్ సమస్యల పరిష్కారం

BDK: మణుగూరు మండలం, సమితి సింగారం గ్రామపంచాయతీ పరిధి,1వ వార్డు, వాగు మల్లారం గ్రామంలో సమితి సింగారం గ్రామపంచాయతీ సర్పంచ్ కలబోయిన మాధవరావు, ఉప సర్పంచ్ గాండ్ల సురేష్ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా అంతర్గత రోడ్లు, అంతర్గత డ్రైనేజీ సమస్యలను పరిశీలించి తక్షణమే పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు.

February 21, 2026 / 04:43 PM IST