NZB: మోపాల్ మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న కారోబార్స్, పారిశుద్ధ్య సిబ్బంది పెండింగ్ వేతనాలను చెల్లించాలని నిజామాబాద్ కలెక్టర్కు సోమవారం వినతిపత్రాన్ని అందజేశారు. గ్రామపంచాయతీలో వేతనాలు లేక కుటుంబ పోషణ కష్టంగా మారిందని వారు తెలిపారు. కుటుంబ సర్వే నిర్వహించి సంవత్సర కాలం గడుస్తున్నా ఎన్యుమరేటర్లు గౌరవ వేతనం అందలేదన్నారు.
SRPT: అధికారిక పర్యటనలో భాగంగా సోమవారం కోదాడకు వచ్చిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సామాన్య ప్రజలతో కలిసిపోయారు. రాజేష్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం తిరిగి వెళ్తుండగా, దారిలో తల్లి ఒడిలో ఉన్న చిన్నారిని చూసి చిరునవ్వుతో పలకరించారు. పాప పేరు అడిగి తెలుసుకున్న కలెక్టర్, ఆమెను అంగన్‌వాడీకి పంపిస్తున్నారా లేదా అని ఆరా తీశారు.
NLR: ఇందుకూరుపేట మండలం పరిధి మైపాడు బీచ్ సమీపంలో అక్రమ మట్టి తవ్వకాలు జోరందుకున్నాయి. సముద్ర తీర ప్రాంతం నుంచే మట్టిని లారీలు, హిటాచీలతో లే-అవుట్లకు తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మార్వో సిబ్బందిని పంపించి విచారణ చేపడతామని తెలిపారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
AP: రాజమండ్రిలో కల్తీ పాల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనంగా మారింది. మరికొన్నిచోట్ల కల్తీ పాల దందా జరుగుతోందని వార్తలు వస్తున్నాయి. కాగా, రాజమండ్రిలో 100 లీటర్ల పాలలో 100 లీటర్ల నీరు, తెల్లటి నురగ కోసం 10 కేజీల యూరియా కలిపినట్లు సమాచారం. అయితే తెలుగురాష్ట్రాల్లో కల్తీ వ్యాపారులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
NLR: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విచారణ మళ్లీ వాయిదా పడింది. రెండు సార్లు పోలీసులు విచారణను వాయిదా వెయ్యగా ఈసారి మాజీ మంత్రి కాకాణి వంతు వచ్చింది. వ్యక్తిగత పనుల నిమిత్తం ఈ నెల 24న విచారణకు రాలేనంటూ ఆయన సోమవారం పోలీసులకు లేఖ రాశారు. 27వ తేదీన వస్తానని పేర్కొన్నారు. కొన్ని రోజుల కింద బాలిక మృతి ఘటనలో ఆయనపై కోవూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
NLG: జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఈనెల 25 నుంచి మార్చి 18 వరకు జరిగే పరీక్షల దృష్ట్యా కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్-163 సెక్షన్ అమలు చేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. జిల్లాలోని 45 కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు.
KKD: ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి గ్రామ శివార్లలో అక్రమంగా గుండాట ఆడుతున్న ఆరుగురిని సోమవారం సాయంత్రం ప్రత్తిపాడు SI లక్ష్మీ కాంతం అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడి చేసి నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి రూ. 15,700 నగదు, గుండాట ఫ్లెక్సీ, రెండు లెదర్ బౌల్స్, తొమ్మిది పాశాలను స్వాధీనం చేసుకున్నారు.
AP: అసెంబ్లీలో ఇవాళ కల్తీ నెయ్యిపై చర్చించనున్నారు. బడ్జెట్‌లో శాఖలవారీగా డిమాండ్లు, గ్రాంట్లపై చర్చ జరగనుంది. ఆయా శాఖల డిమాండ్ల ఆమోదం కోసం సభలో ప్రతిపాదించనున్నారు. అదేవిధంగా శాసనమండలిలో శాంతిభద్రతల అంశంపై చర్చించినున్నట్లు సమాచారం. మండలిలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఈనెల 26న చర్చ జరగనుంది.
SKLM: జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా స్థాయి సైక్లింగ్ లీగ్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి మహేష్ సోమవారం ప్రకటనలో తెలిపారు. కోడి రామ్మూర్తి స్టేడియంలో అండర్ 18 విభాగంలో బాలురు, బాలికలకు విడివిడిగా ఎంపికలు జరుగుతాయన్నారు. ఆసక్తిగల వారు https://sports.ap.gov.in వెబ్సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు.
ప్రకాశం: గిద్దలూరు మండలం బురుజుపల్లి తాండాకు చెందిన గణేష్ నాయక్ కృష్ణాజిల్లా పెనమలూరులో రైల్వే ట్రాక్‌పై అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. గణేష్ నాయక్ పెనమలూరులోని ఓ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. గణేష్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. గిద్దలూరులో గోబీ బండి నడుపుకుంటూ గణేష్ తల్లిదండ్రులు జీవనం సాగిస్తున్నారని స్థానికులు తెలిపారు.
MBNR: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి ఇంటిపై దాడికి కార్యకర్తలను ప్రేరేపించారని సోమవారం MBNR ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. కామారెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను ఎంపీ పరామర్శించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నిరాధార ఆరోపణలు చేయడం సులభమని, వాటిని రుజువు చేయాలేదంటే క్షమాపణ చెప్పాలన్నారు.
SKLM: చీపురుపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని మంగళవారం ఉదయం వేలాది నంది భక్తులు దర్శించారు. అనేక ప్రాంతాల నుంచి వంట పాత్రలతో చేరుకుని అన్నప్రసాదాలు స్వయంగా చేపట్టి స్వీకరిస్తారని స్థానికులు తెలిపారు. ఎంతో అద్భుతంగా అమ్మవారి అలంకరణ అందరిని ఆకట్టుకుంది.
NTR: ఇబ్రహీంపట్నం మండలం దాములూరు గ్రామంలో రూ.20 లక్షల మండల పరిషత్ నిధులతో నిర్మించనున్న త్రాగునీటి పైప్ లైన్ నిర్మాణానికి ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కృష్ణానది పరివాహక ప్రాంతం పక్కనే ఉన్నప్పటికీ దాములూరు గ్రామంలో ప్రజల ఇబ్బందులు పడుతున్నారని,వారి సమస్యకు శాశ్వత పరిష్కారంగా పైప్ లైన్ నిర్మిస్తున్నామన్నారు.
VKB: ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి నేడు ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆర్టీసీ డీఎం కృష్ణమూర్తి తెలిపారు. బస్సు సేవలు, ఇతర ఫిర్యాదుల కోసం ప్రయాణికులు ఉదయం నిర్ణీత సమయంలో 9959225253 నంబర్‌కు నేరుగా కాల్ చేసి సూచనలు ఇవ్వవచ్చని ఆయన పేర్కొన్నారు.
JN: లింగాల గణపురం మండలంలోని సిరిపురంలో విద్యుత్ షాక్‌తో రెండు మూగజీవాలు మృతి చెందాయని గ్రామస్థులు తెలిపారు. గ్రామంలోని హనుమాన్ ఆలయం వెనుక ఉన్న విద్యుత్ స్తంభం వద్ద బర్ల ఐలయ్యకు చెందిన ఒక మేక, ఒక గొర్రె మేత మేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే మరణించాయన్నారు.