• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు

TG: నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 15 శాతం ఓట్ల కోసం ఎంఐఎంకు ఎందుకు మద్ధతిస్తున్నారని మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి డేంజర్ సీఎం అని ఆరోపించారు. శ్రీధర్‌బాబు పేరును శ్రీధర్‌బాబాగా మార్చుకోవాలని హితవు పలికారు. అదేవిధంగా భట్టి పేరును భట్టి అక్రమ్‌గా మార్చుకోవాలని సూచించారు.

February 23, 2026 / 07:32 AM IST

మాజీ మంత్రి జోగి రమేష్‌ని కలిసిన మాజీ శాసనసభాపతి

NTR: ఇబ్రహీంపట్నంలో టీడీపీ శ్రేణులు పెట్రోల్ బాంబులతో దాడి చేసిన మాజీ మంత్రి జోగి రమేష్ నివాసాన్ని మాజీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ ఘటన గురించి వివరాలు తెలుసుకుని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

February 23, 2026 / 07:31 AM IST

దళిత్ యాక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షుడిగా రాజయ్య

PDPL: ఆల్ ఇండియా దళిత్ యాక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షుడిగా ముత్తారం మండలం సర్వారం గ్రామానికి చెందిన గౌరిశెట్టి రాజయ్య నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షులు రత్నం శైలేందర్ ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. తన నియామకానికి సహకరించిన జాతీయ అధ్యక్షులు డా.చిన్న రాముకు కృతజ్ఞతలు తెలిపారు. రిజర్వేషన్లు అందని వెనుకబడిన వర్గాల కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

February 23, 2026 / 07:30 AM IST

దోషులను కఠినంగా శిక్షించాలి: మంద నరేష్

WGL: నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో కులం పేరుతో రజక కుటుంబంపై జరిగిన దారుణ దాడిని ABSF జిల్లా అధ్యక్షుడు మంద నరేష్ ఖండించారు. ఆదివారం రాత్రి WGLలోని కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద ABSF ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన చేపట్టారు. రెండు నెలల పసికందును కాళ్లతో తన్ని హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

February 23, 2026 / 07:29 AM IST

సీసీఐ పత్తి కొనుగోళ్లకు గడువు పొడగింపు

ADB: ఆదిలాబాద్ జిల్లాలో సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లను ఈ నెల 27 వరకు పొడిగించినట్లు జిల్లా మార్కెటింగ్ అధికారి గజానంద్ తెలిపారు. రైతులు కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుకింగ్ చేసుకుని, సమీపంలోని సీసీఐ కొనుగోలు కేంద్రాలు, జిన్నింగ్ మిల్లుల్లో తమ పత్తిని విక్రయించుకోవాలని సూచించారు. అవకాశాన్ని జిల్లా రైతాంగం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

February 23, 2026 / 07:28 AM IST

జిల్లా వ్యాప్తంగా 82 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు

బాపట్ల జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షలకు మొత్తం 15,944 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. జిల్లా వ్యాప్తంగా 82 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేలా అన్ని వసతులు కల్పించామని అధికారులు తెలిపారు.

February 23, 2026 / 07:27 AM IST

కొండాపూర్‌ ఐటీ కారిడార్‌‌లో హైడ్రా కమిషనర్

RR: కొండాపూర్‌ ఐటీ కారిడార్‌కు సమీపంలోని ఖరీదైన ప్రాంతంలో ఆక్రమణలను హైడ్రా తొలగించింది. ఈ భూమిలో ప్రభుత్వ కళాశాల నిర్మాణానికి వెంటనే సన్నాహాలు ప్రారంభమయ్యాయి. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పర్యటనలో ప్రజలు ఆయన పనులను అభినందించారు. దశాబ్దాల సమస్యకు వేగంగా పరిష్కారం లభించిందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

February 23, 2026 / 07:27 AM IST

నేడు జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం

WGL: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నేడు ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. సత్య శారద తెలిపారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలు, వినతిపత్రాలను నేరుగా అధికారులకు అందజేయవచ్చని ఆమె పేర్కొన్నారు.

February 23, 2026 / 07:26 AM IST

నేడు యూనివర్సిటీలో సంత్ సేవాలాల్ 287వ జయంతి వేడుకలు

NZB: TU లోని ప్రధాన ప్రాంగణంలో SC, ST సెల్ ఆధ్వర్యంలో నేడు గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ 287వ జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు డైరెక్టర్ వాణి తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. బోధన, బోధనేతర సిబ్బందితో పాటు విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు రేపు ఉదయం 11గం.లకు ప్రాంగణంలోని హనుమాన్ ఆలయం వద్దకు చేరుకోవాలని ఆమె సూచించారు.

February 23, 2026 / 07:24 AM IST

CM రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేసిన మంత్రి సీతక్క

MLG: జిల్లాలో సాగునీటి సౌకర్యాల విస్తరణకు రాష్ట్ర మంత్రి సీతక్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇవాళ వినతిపత్రం సమర్పించారు. గోదావరి రైట్ బ్యాంక్‌పై కొత్త ఎత్తిపోతల పథకంతో పాటు, కన్నాయిగూడెం లక్ష్మీపురం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం పునరుద్ధరణకు అనుమతి కోరారు. రూ. 22 కోట్లతో 921 ఎకరాలకు సాగునీరు అందించే ప్రతిపాదనను వివరించగా, సీఎం సానుకూలంగా స్పందించారు.

February 23, 2026 / 07:22 AM IST

అనారోగ్య బాధితుని పరామర్శించిన ఎమ్మెల్యే

WNP: జిల్లా పెద్దమందడి మండలం కన్మనూరు గ్రామానికి చెందిన మీనిగ బాలయ్య నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ సందర్భంగా ఆదివారం కన్మనూరు గ్రామానికి వెళ్లి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న బాలయ్యను వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పరామర్శించి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

February 23, 2026 / 07:21 AM IST

పుంగనూరు బస్సు సెంటర్ వద్ద డెడ్ బాడీ..!

CTR: పుంగనూరు పట్టణం పుంగమ్మ చెరువు కట్టపై గల బస్సు షెల్టర్‌లో ఓ వ్యక్తి డెడ్ బాడీని స్థానికులు గుర్తించారు. అతడికి దాదాపు 40 ఏళ్లు ఉండవచ్చని తెలిపారు. ఈ మేరకు వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

February 23, 2026 / 07:21 AM IST

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కల్యాణోత్సవ పూజలు

ATP: గుత్తికొండలోని అతి పురాతనమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవం సందర్భంగా సోమవారం ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. స్వామివారికి వేకువజామున పవిత్ర గంగా జలాలతో అభిషేకాలు చేసి, బంగారు, వెండి ఆభరణాలతో పాటు ప్రత్యేక పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు.

February 23, 2026 / 07:20 AM IST

‘కాంగ్రెస్ నేతలు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు’

KNR: కాంగ్రెస్ నేతలు వీధి రౌడీల్ల ప్రవర్తిస్తున్నారని బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడికి నిరసనగా ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ పాలనలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందన్నారు.

February 23, 2026 / 07:20 AM IST

అనూరియా కేసులు.. మంత్రి కందుల కీలక సూచనలు

AP: రాజమహేంద్రవరం అనూరియా కేసులపై ప్రజలకు మంత్రి కందుల దుర్గేష్ కీలక సూచనలు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కలెక్టర్, వైద్యశాఖ అధికారులతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

February 23, 2026 / 07:19 AM IST