AP: YCP నేతలపై మంత్రి బాలవీరాంజనేయస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. వేంకటేశ్వరస్వామిని వైసీపీ రాజకీయాలకు వాడుకుంటోందని ఆరోపించారు. అసెంబ్లీలో చెప్పులు ధరించి వేంకటేశ్వరస్వామి ఫొటోలు పట్టుకుని వచ్చారని గుర్తు చేశారు. దేవుడి పేరుతో రాజకీయాలు చేయాలనుకుంటే పతనమైపోతారని హెచ్చరించారు.
CTR: రెట్టగుంట గ్రామంలోని శ్రీ సుందర వినాయకస్వామి ప్రత్యేక పూజా అభిషేక కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే తండ్రి, గురజాల చెన్నకేశవులు నాయుడు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు, ఆయనకు ఘన స్వాగతం పలికిపూలమాలలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన GJM చారిటబుల్ ఫౌండేషన్ తరపున ఆలయ అభివృద్ధికి రూ.50,000 ఆర్థిక సహాయం అందజేశారు.
కడప: జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయ నిర్మాణానికి శంఖస్థాపన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డి,కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ,మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్యతో పాటు రాష్ట్ర,పార్లమెంట్ కమిటీ నేతలు, జిల్లా పార్టీ నాయకులు హాజరయ్యారు.
ADB: గుడిహత్నూర్ మండల కేంద్రంలోని ఎక్స్ రోడ్ వద్ద ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఆదివారం ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. వాహన పత్రాలను పరిశీలించి, నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు. ఎస్సై మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, లైసెన్స్ కలిగి ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని హెచ్చరించారు.
NGKL: పదర మండలం రాయలగండి క్షేత్రంలో శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి కళ్యాణ మహోత్సవం కనులపండువగా జరిగింది. ఈ వేడుకలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్మాణంలో తన వంతుగా సొంత నిధులు కేటాయించడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. తనను ఆహ్వానించిన అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు.
AP: YCP అబద్ధాల పునాదులపై పుట్టిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. గత పాలకులు రాష్ట్రాన్ని అంధకారం చేసి వెళ్లారని తెలిపారు. ప్రజలు జగన్‌కు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదన్నారు. దేవుడిని రాజకీయాలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. మండలిలో చెప్పులతో దేవుడి ఫొటోలు తీసుకొచ్చారని ఆరోపించారు.
కోనసీమ: రామచంద్రపురం అంకం వారి వీధి వెంకటనగర్‌లో నూతనంగా నిర్మించిన లక్ష్మీ గణపతి స్వామివారి దివ్య విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం మంత్రి వాసంశెట్టి సుభాష్ చేతుల మీదుగా ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆరోగ్యంతో జీవించాలని ప్రార్థించినట్లు మంత్రి పేర్కొన్నారు.
అనంతపురం కలెక్టరేట్‌లో ఆదివారం వీరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని పర్యాటక శాఖ, ఆన్ సెట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి అటూరి మాలోల ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తొలి తెలుగు వీరుడు నరసింహారెడ్డి అని ఆయన కొనియాడారు.
వైవాహిక జీవితంలో గొడవలు చాలా కామన్. కానీ ఇవి ఎప్పుడో ఒకసారి వస్తేనే బాగుంటుంది. పదేపదే జరిగితే జీవితం మీద విరక్తి వస్తుంది. అందుకే భార్యభర్తల మధ్య వాదన పెరిగేకొద్ది దూరం మరింత పెరుగుతుంది. అందుకే వాదనలను పెంచకుండా ఉండండి. ఒకరి మాటను ఇంకొకరు వినండి. ఇద్దరూ కాస్త ప్రశాంతంగా ఉండండి. పురుషులు తమ భావాలను అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించాలి. ఇద్దరూ కలిసి మాట్లాడుకోండి.
GNTR: తెనాలిలో మ్యాట్రిమోనీ పేరుతో మహిళను మోసం చేసిన కొత్తూరులంకకు చెందిన అరవపల్లి వంశీని త్రీటౌన్ సీఐ సాంబశివరావు ఆదివారం అరెస్టు చేశారు. పెళ్లి పేరుతో రూ.12 లక్షలు వసూలు చేసి వివాహం చేయకుండా మోసం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
‘ది కేరళ స్టోరీ’ మూవీపై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఈ సినిమా కేరళ వాస్తవాలను ప్రతిబింబించడం లేదని పరోక్షంగా విమర్శించారు. ఆ రాష్ట్రపు అసలైన సంస్కృతిని రుచి చూడమని చెప్పారు. కేరళకు చెందిన ప్రసిద్ధ వంటకాలు ‘బీఫ్ ఫ్రై’, కొబ్బరితో చేసిన ‘బీఫ్ కర్రీ’ ఫోటోలను షేర్ చేశారు. ‘అసలైన కేరళ స్టోరీని రుచి చూడండి’ అంటూ తన SM వేద...
గుంటూరు నగరానికి రానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీసు శాఖ అప్రమత్తమైంది. బొమ్మిడాల నగర్‌లోని శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీలో ఇండియా పోస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న “డాక్ సేవక్ సమ్మేళన్” కార్యక్రమానికి సీఎం హాజరుకానున్న సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు.
కృష్ణా: నందివాడ మండలం రుద్రపాక జిల్లా పరిషత్ పాఠశాలలో 1989,1990 సంవత్సర 10వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దాదాపు 36 సంవత్సరాల క్రితం కలిసి చదువుకున్న విద్యార్థులు కలుసుకొని చిన్ననాటి జ్ఞాపకాలను వారు నెమరేసుకున్నారు. చదివిన సమయంలో చేసిన అల్లర్లు, ఉపాధ్యాయులతో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
KMR:ఆర్టీసీ సిబ్బంది మరోసారి తమ నిజాయితీని చాటుకున్నారు.ఆదివారం NZB రెండో డిపోకు చెందిన ఎలక్ట్రికల్ బస్సులో ప్రయాణించిన ఓ మహిళ తన స్మార్ట్ ఫోన్‌ను సీట్లోనే మర్చిపోయింది. బస్సు కామారెడ్డి చేరుకున్నాక ఫోన్‌ను గమనించిన కండక్టర్ నమ్రత, వెంటనే బస్టాండ్ పాయింట్ కంట్రోలర్ సమక్షంలో సదరు ప్రయాణికురాలికి దానిని అందజేశారు.
కృష్ణా: మచిలీపట్నం–విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ సీఐ నున్న రాజు రోడ్డు భద్రత నియమాలపై ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగించకుండా వాహనాలు నడిపితే జరిమానా విధిస్తామన్నారు.