VKB: పరిగి-షాద్నగర్ వరకు నాలుగు లైన్‌ల రహదారి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. రహదారి ఇరువైపులా యంత్రాలతో విస్తృతంగా పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రత్యేకించి రాత్రి సమయంలో వెలుతురు తక్కువగా ఉండే ప్రదేశాల్లో జాగ్రత్తగా వాహనాలు నడపాలని కోరారు. సూచిక బోర్డులను వాహనదారులు గమనించాలని తెలిపారు.
SKLM: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తేజేశ్వరరావు, శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ నాగమణి పిలుపునిచ్చారు. ఆదివారం నరసన్నపేట ఎంపీడీవో కార్యాలయం వద్ద సీఐటీయూ విస్తృత సమావేశం జరిగింది. అంగన్వాడి, ఆశా, మధ్యాహ్నభోజనం, వివోఏ, తదితర స్కీం వర్కర్లకు వేతనాలు వెంటనే పెంచాలన్నారు.
SRPT: కోదాడ పట్టణంలోని 13వ వార్డులో ఆదివారం దోమల మందు పిచికారి కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు ఆదేశాల మేరకు, వార్డు కౌన్సిలర్ గురవమ్మ సైదిబాబు యాదవ్ పర్యవేక్షణలో సిబ్బంది ఫాగింగ్ చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు.
ప్రదీప్ రంగనాథన్, దర్శకుడు అశ్వత్ మారిముత్తు కాంబోలో వచ్చిన ‘డ్రాగన్’ మూవీ ఘనవిజయం సాధించి ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అశ్వత్ నెట్టింట పోస్ట్ పెట్టాడు ‘సెల్ఫ్ మేడ్ స్టార్ ప్రదీప్‌తో పనిచేయడం మర్చిపోలేను. త్వరలోనే తాము రెండోసారి తప్పకుండా వస్తాం’ అంటూ రాసుకొచ్చాడు. దీంతో ‘డ్రాగన్ 2’ సీక్వెల్ రాబోతుందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.
RR: కేశంపేట(మం) ఇప్పలపల్లి గ్రామానికి చెందిన అంజయ్య అనే వ్యక్తి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన యువనాయకుడు శ్రీనివాసులు స్పందించి అంజయ్య అంత్యక్రియలకు రూ.10,000 మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. అంజయ్య మృతి పట్ల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ప్రకాశం: రేపట్నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఆదివారం కొమరోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలను సీఐ రామకోటయ్య సందర్శించారు. పరీక్ష నిర్వహణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను పోలీస్ సిబ్బందికి, నిర్వహణ అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ప్రజలు గమనించి గుంపులుగా ఉండొద్దని చెప్పారు.
WNP: ఆర్థిక స్తోమత సరిగా లేక, సొంత ఇల్లు నిర్మించుకోలేక నానా అవస్థలు పడుతున్న నిరుపేదల సొంత ఇంటి కల నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో సకారం అవుతుందని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి తెలిపారు. ప్రతి ఇంటికి పెద్దన్నగా భరోసా కల్పిస్తూ నేనున్నానంటూ గృహప్రవేశానికి హాజరై నూతన వస్త్రాలు అందించారు. అందుకు ఎమ్మెల్యే మేఘారెడ్డికి వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
కృష్ణా: క్యాన్సర్‌ను సకాలంలో గుర్తించి చికిత్స పొందాలని నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. ఆదివారం చల్లపల్లి మండలం వక్కలగడ్డలో పీఏసీఎస్ చైర్మన్ మల్లుపెద్ది దుర్గామహేష్ ఆధ్వర్యంలో బసవతారకం ఇండో – అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వారిచే ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరాన్ని వెంకట్రామ్ ప్రారంభించారు.
NTR: విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా అబుల్ కలాం ఆజాద్ విద్యలో అనేక మార్పులు తీసుకువచ్చి, ప్రతి ఒక్కరూ చదువుకోవాలని సంకల్పంతో విధులు నిర్వహించారని కొనియాడారు.
కోనసీమ: అమలాపురం కలెక్టరేట్‌లో PGRS కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదివారం తెలిపారు. కలెక్టరేట్‌తో పాటు ఆర్డీవో, తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయాల్లోనూ ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి నిర్ణీత సమయంలో పరిష్కరించుకోవాలని కోరారు.
AP: విజయనగరం జిల్లా రాజాంలో పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర వైభవంగా జరుగుతుంది. ఈనెల 24 వరకు ఘనంగా అమ్మవారి జాతర మహోత్సవం జరగనుంది. ఈ క్రమంలో అమ్మవారి జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ప్రభుత్వం తరపున అమ్మవారికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పట్టువస్త్రాలను సమర్పించారు.
ADB: కామారెడ్డిలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకుల దాడిని ఖండిస్తూ బీజేపీ చలో కామారెడ్డికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ క్యాంప్ కార్యాలయం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని పాయల్ శంకర్ ఆందోళన వ్యక్తం చేశారు.
SRD: నారాయణఖేడ్ MLA సంజీవరెడ్డి కుమారుడి ఖేడ్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత విజయపాల్ రెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్ శివారులోని వట్టినాగులపల్లిలో గల వన్ కన్వెన్షన్ వేదికగా జరిగిన వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. దాంపత్య జీవితం ఆనందంతో ఉండాలి ఆకాంక్షించారు.
టీ20 ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా శ్రీలంక, సౌతాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. ఈ ఏడాది పల్లెకెలె స్టేడియంలో జరిగిన 6 మ్యాచ్‌ల్లో 5 సార్లు ఛేజింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి. అందుకే శ్రీలంక కెప్టెన్ కూడా ఛేజింగ్‌కే మొగ్గు చూపాడు. ఈ పిచ్‌పై సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు 177 పరుగులుగా ఉంది.