• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

బాధిత మహిళకు సీఎం సహాయ నిధి చెక్కు పంపిణీ

అనంతపురంలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం అనారోగ్యంతో బాధపడుతున్న లక్ష్మీదేవికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కును ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ అందజేశారు. ఎల్లనూరు మండలం తిమ్మంపల్లికి చెందిన ఆమెకు చికిత్స ఖర్చుల నిమిత్తం రూ.50,462 మంజూరయ్యాయి. బాధితురాలి సమస్యను తెలుసుకున్న వెంటనే స్పందించి ఈ ఆర్థిక సాయం అందించినట్లు ఎంపీ తెలిపారు.

February 24, 2026 / 05:00 PM IST

సూర్యలంక బీచ్‌లో పర్యాటకుల అవస్థలు

BPT: సూర్యలంక బీచ్‌కు వచ్చే పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. విలువైన వస్తువులు దాచుకునేందుకు లాకర్ రూమ్ ఉన్నా అధికారులు దానిని ఇంకా తెరవలేదు. పంచాయతీ అధికారులు వేలం నిర్వహించకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో పర్యాటకులు తమ సామాన్లను ఇసుకలోనే ఉంచాల్సి వస్తోంది. కొన్నిసార్లు వస్తువులు చోరీకి గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

February 24, 2026 / 05:00 PM IST

మిత్రుడి కుటుంబానికి పూర్వ విద్యార్థుల భరోసా

SRPT: గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామానికి చెందిన రాంబాబు మృతి చెందడంతో ఆయన వృద్ధ తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలు, భార్య దిక్కులేని వారయ్యారు. ఈ విషాద సమయంలో తామున్నామంటూ భరోసా ఇస్తూ మిత్రులందరూ కలిసి ఇవ్వాళ రూ. 50 వేల ఆర్థిక సహాయాన్ని ఆ కుటుంబానికి అందజేశారు. ​ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు.

February 24, 2026 / 05:00 PM IST

ఆర్టీసీ ప్రైవేటీకరణపై ఎన్ఎంయూ ధర్నా

PLD: వినుకొండ ఆర్టీసీ డిపో వద్ద ఎన్ఎంయూ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా జరిగింది. 12 డిపోలను ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులకు అప్పగించడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. సంస్థే సొంతంగా బస్సులను కొనుగోలు చేసి, తమ సిబ్బందితో నడపాలని నేతలు శ్రీనివాసరావు, సౌభాగ్యరాజు డిమాండ్ చేశారు. విలువైన ఆర్టీసీ స్థలాలను ప్రైవేట్ పరం చేయొద్దన్నారు.

February 24, 2026 / 05:00 PM IST

బాన్సువాడలో భద్రతా ఏర్పాట్లపై ఎస్పీ సమీక్ష

KMR: బాన్సువాడ పట్టణంలో భద్రతా ఏర్పాట్లను ఎస్పీ రాజేశ్ చంద్ర మంగళవారం పరిశీలించారు. ప్రధాన కూడళ్లు, సున్నిత ప్రాంతాలను పరిశీలించి భద్రతా పరిస్థితులను సమీక్షించారు. ఎలాంటి చిన్న ఘటన కూడా చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా శాంతి భద్రతలు కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు.

February 24, 2026 / 05:00 PM IST

కోమరోలు మండలంలో రేపు పవర్ కట్

ప్రకాశం: కొమరోలు మండలంలో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ ఏ.ఈ శ్రీనివాసులు తెలిపారు. నూతన విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా మండలంలోని చింతలపల్లి సబ్ స్టేషన్ పరిధిలో గ్రామాలకు బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందన్నారు.ఈ అంతరాయానికి ప్రజలు సహకరించాలని కోరారు.

February 24, 2026 / 05:00 PM IST

అసెంబ్లీలో గళ మెత్తిన ఎమ్మెల్యే

కృష్ణా: అసెంబ్లీ సమావేశాల్లో మంగళవారం గన్నవరం MLA యార్లగడ్డ వెంకట్రావు రాష్ట్రంలో వెటర్నరీ వ్యవస్థను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి మండలానికి పశువైద్యశాల ఏర్పాటు చేసి తగిన డాక్టర్లను నియమించాలని అన్నారు. గన్నవరం విమానాశ్రయం ఎదురుగా ఉన్న NTR కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ప్రహరీ దుస్థితిలో ఉందని, నిధులు కేటాయించి ఆధునీకరించాలని కోరారు.

February 24, 2026 / 04:58 PM IST

‘ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువులకు అత్యుత్తమ చికిత్స’

PDPL: ప్రైవేటు ఆసుపత్రిలో నెలలు నిండక ముందు జన్మించిన నవజాత కవల పిల్లలకు PDPL ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో అత్యుత్తమ చికిత్స అందించి బాగు చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. శ్రీధర్ మంగళవారం తెలిపారు. ఈనెల 6న అడ్మిట్ చేసుకుని డా. వాసుదేవరావు నేతృత్వంలో చికిత్స అందించి ఇవాళ డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా డా. శ్రీధర్ వైద్యులను అభినందించారు.

February 24, 2026 / 04:57 PM IST

పులివెందుల చేరుకున్న జగన్

AP: మాజీ సీఎం జగన్ పులివెందుల చేరుకున్నారు. మూడు రోజులపాటు పులివెందులలో జగన్ పర్యటించనున్నారు. క్యాంప్ ఆఫీస్‌లో ప్రజాదర్బార్‌లో పాల్గొననున్నారు. రేపు నందిపల్లెలో జగన్ పర్యటించనున్నారు. శివాలయంలో విగ్రహ ప్రతిష్టలో పాల్గొననున్నారు.

February 24, 2026 / 04:51 PM IST

విద్యార్థులకు కనకమహాలక్ష్మి దర్శనం

VZM: గరివిడి మండలం శ్రీరామ్ నగర్‌లోని ఉమన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సెంటర్‌లో ఉన్న సుమారు 95 మంది బధిర విద్యార్థులకు చీపురుపల్లి DSP రాఘవులు ఆధ్వర్యంలో కనకమహాలక్ష్మి అమ్మవారి దర్శనం మంగళవారం కల్పించారు. దర్శనం అనంతరం ప్రసాదాలు అందించి, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని వారికి సూచించారు. విద్యార్థులను సురక్షితంగా తిరిగి సెంటర్‌కు చేర్చారు.

February 24, 2026 / 04:51 PM IST

BREAKING: పరీక్షల షెడ్యూల్ విడుదల

TG: టీజీపీఈ-సెట్ నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 2 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభంకానున్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు మే 5 వరకు దరఖాస్తు చేసుకొవచ్చని వెల్లడించారు. మే 31 నుంచి జూన్ 6 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.

February 24, 2026 / 04:51 PM IST

ఆర్టీసీ బస్టాండ్లలో దుకాణాల వేలం.. రేపే ఆఖరు తేదీ

సత్యసాయి జిల్లాలోని పలు ఆర్టీసీ బస్టాండ్లలో ఖాళీగా ఉన్న దుకాణాలను టెండర్ ద్వారా కేటాయించనున్నారు. ఆసక్తి గల వ్యాపారస్తులు రేపు ఆయా డిపోలకు వెళ్లి టెండర్ ఫారాలను తీసుకోవచ్చు. టెండర్ దరఖాస్తులు సమర్పించడానికి కూడా రేపే చివరి రోజు అని అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ప్రధాన బస్టాండ్లలోని ఖాళీ గదులు నుంచి స్టాళ్ల వరకు ఈ వేలంలో పాల్గొనవచ్చు.

February 24, 2026 / 04:50 PM IST

కమ్యూనిస్టు పార్టీ 100 ఏళ్ల జ్ఞాపిక సదస్సు పోస్టర్స్ విడుదల

ASF: భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఈనెల 27న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో CPI (ML) ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్లను కాగజ్ నగర్‌లో మంగళవారం విడుదల చేశారు. జిల్లా కార్యదర్శి ఎండీ చాంద్ పాషా మాట్లాడుతూ.. భూ, కార్మిక, రైతాంగ పోరాటాల్లో కమ్యూనిస్టు పార్టీ కీలక పాత్ర పోషించిందన్నారు.

February 24, 2026 / 04:49 PM IST

డయేరియా పై ఇంఛార్జ్ మంత్రి ఆరా..!

SKLM: జిల్లాలో నమోదైన డయేరియా కేసులపై జిల్లా ఇంఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందించారు. మంగళవారం అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే పలువురు బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి నిలకడగా ఉందని మంత్రికి వివరించారు.

February 24, 2026 / 04:47 PM IST

ప్రదీప్ చేతిలో 8 సినిమాలు.. రూ.25 కోట్ల పారితోషికం!

తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ క్రేజ్ మామూలుగా లేదు. ప్రస్తుతం ఆయన చేతిలో ఏకంగా 8 సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కో మూవీకి ప్రదీప్ రూ.25 కోట్ల వరకు పారితోషికం డిమాండ్ చేస్తున్నాడట. ఆయనకున్న యూత్ ఫాలోయింగ్‌తో నిర్మాతలు అడిగినంత ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా, వచ్చే రెండేళ్ల వరకు ప్రదీప్ డేట్లు ఖాళీ లేవట. ఆయన షెడ్యూల్ అంతలా లాక్ అయిపోవడం హాట్ టాపిక్‌గా మారింది. 

February 24, 2026 / 04:46 PM IST