• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

యాగంటి ఉమామహేశ్వర స్వామికి విశేష పూజలు

NDL: బనగానపల్లె మండల పరిధిలో శైవ పుణ్యక్షేత్రమైన యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయంలో పాల్గొనమాసం శుక్రవారం సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. ఆలయ ఈవో పాండురంగారెడ్డి వేద పండితులు ఆధ్వర్యంలో స్వామికి రుద్రాభిషేకం కుంకుమార్చన ప్రత్యేక పుష్పాలంకరణలో అలంకరించి మహా మంగళ హారతి ఇచ్చారు. అలాగే నందవరం చౌడేశ్వరి మాతకు విశేష పూజలు చేశారు.

February 20, 2026 / 08:12 AM IST

నేడు దివ్యాంగులకు అండగా స్వాభిమాన్ వేదిక

SKLM: దివ్యాంగుల సంక్షేమం, వారి సమస్యల తక్షణ పరిష్కారానికి ప్రతి నెల మూడవ శుక్రవారం నిర్వహించే ‘స్వాభిమాన్’ వేదికను శుక్రవారం నిర్వహించనున్నట్లు దివ్యాంగ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బొడ్డేపల్లి శైలజ తెలిపారు. ఈ మేరకు ఆమె గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు.

February 20, 2026 / 08:12 AM IST

నువ్వుల పంటపై రైతులకు అవగాహన కార్యక్రమం

JGL: మల్యాల మండలం తాటిపల్లిలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కరీంనగర్, మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గ్రామ రైతులకు నువ్వుల పంట సాగుపై అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. నువ్వుల సాగులో సరైన మోతాదులో ఎరువుల రకాలను సరైన సమయంలో వాడటం వలన ఉత్తమ ఫలితాలను సాధించవచ్చని శాస్త్రవేత్త హరికృష్ణ రైతులకు తగు సూచనలు, సలహాలు చేశారు.

February 20, 2026 / 08:10 AM IST

శివాజీ ఆశయాలను ఆచరణలో పెట్టాలి: ఎమ్మెల్యే

MBNR: జడ్చర్ల మండలంలోని పోలేపల్లి గ్రామంలో నిర్వహించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి, నివాళులర్పించారు. శివాజీ మహారాజ్ దేశభక్తి, ధైర్యసహసాలు, పరిపాలనా నైపుణ్యం, నేటి యువతకు ఆదర్శమని ఎమ్మెల్యే అన్నారు. శివాజీ మహారాజ్ సేవలు చిరస్మరణీయమని అన్నారు.

February 20, 2026 / 08:10 AM IST

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

VSP: పెదగంట్యాడ విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధి గాంధీనగర్, వినాయకనగర్ ఫీడర్ల నిర్వ హణ పనుల కారణంగా ఇవాళ పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని జోన్-2 ఈఈ బీకే నాయుడు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చిననడుపూరు, సీతానగరం, అయ్యప్ప టెంపుల్ రోడ్డులో విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

February 20, 2026 / 08:10 AM IST

ఘనంగా మదనాపురం జాతర మహోత్సవాలు

VZM: గంట్యాడ మండలం మదనాపురం గ్రామంలో రెండు రోజులపాటు జరిగిన శ్రీ బాల సాదు సన్యాసమ్మ తీర్థ మహోత్సవాలు గురువారం రాత్రితో ముగిశాయి. తీర్థ మహోత్సవంలో భాగంగా గురువారం గుర్రపు పందాలు ఎడ్ల పందాలు జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహించారు. స్థానికులు పెద్ద సంఖ్యలో ఈ పోటీలను తిలకించారు.

February 20, 2026 / 08:09 AM IST

పార్కు స్థలం కబ్జా చేసిన వ్యక్తిపై కేసు నమోదు

MDCL: పార్కులు ప్రజల ఉమ్మడి ఆస్తి అని వీటిని కొనుగోలు చేయడం, విక్రయించడం రెండు చట్ట విరుద్ధమని నాచారం పోలీస్ స్టేషన్      ఇన్‌స్పెక్టర్ ధనుంజయ తెలిపారు. మల్లాపూర్‌లోని బాబానగర్ కో-ఆపరేటింగ్ హౌసింగ్ సొసైటీ పరిధిలో ప్రజల వినియోగానికి కేటాయించిన పార్కు స్థలాలను కబ్జా చేసిన బొట్ల సాయిలు అనే ప్రధాన నిందితుడిపై  పోలీసులు కేసు నమోదు చేశారు.

February 20, 2026 / 08:08 AM IST

నేడు టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్

SKLM: ఆమదాలవలస పట్టణంలో గల స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే రవికుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆమదాలవలస టీడీపీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు ప్రజలు తమ సమస్యలను దరఖాస్తు రూపంలో అందజేయవచ్చునని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

February 20, 2026 / 08:08 AM IST

ప్రభాస్ కొత్త లుక్.. ఆ మూవీ కోసమేనా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కొత్త లుక్‌లో కనిపించాడు. కొత్త హెయిర్ స్టైల్, గడ్డం, ట్రెండీ డ్రెస్సింగ్‌లో సందడి చేశాడు. మిర్చి సినిమాలో ఉన్నట్లుగానే కనిపిస్తున్న ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ప్రభాస్ కొత్త లుక్స్ అదిరిపోయాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న ‘ఫౌజీ’ కోసమే ఈ స్టైల్ అని టాక్ వినిపిస్తోంది.

February 20, 2026 / 08:06 AM IST

నేడు ఛైర్మన్, వైస్ ఛైర్మన్ బాధ్యతల స్వీకరణ

వనపర్తి మున్సిపల్ ఆఫీసులో నేడు ఉదయం 10 గంటలకు నూతనంగా ఎన్నికైన ఛైర్మన్ మిడిదొడ్డి మాధవి రమేష్, వైస్ ఛైర్మన్ మధుసూదన్ గౌడ్ పదవి బాధ్యతలను స్వీకరిస్తారని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ బాధ్యులు తిరుపతయ్య తెలిపారు. మున్సిపల్ కౌన్సిలర్లు ఆయా వార్డు నుంచి పార్టీ శ్రేణులు పాల్గొంటారన్నారు. ఇందిరాపార్క్ నుండి ర్యాలీతో మున్సిపల్ ఆఫీస్ కు చేరుకుంటారు అని తెలిపారు.

February 20, 2026 / 08:05 AM IST

ప్రమాదాలు జరిగే స్పాట్లు గుర్తించండి: కలెక్టర్

SRD: జిల్లాను ప్రమాద రహిత జిల్లాగా మార్చేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రోడ్డు భద్రత సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు జరిగే స్పాట్లను గుర్తించాలని చెప్పారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

February 20, 2026 / 08:05 AM IST

ఉద్యోగాల భర్తీకి కర్నూలు కలెక్టర్ నిర్ణయం

KRNL: ఆదోని వన్ స్టాప్ సెంటర్‌లో 13 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఇవాళ వెల్లడించారు. అభ్యర్థుల వయస్సు 18-39 ఏళ్ల మధ్య ఉండాలని, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, వికలాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 24లోపు కలెక్టరేట్లోని ఐసీడీఎస్ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు.

February 20, 2026 / 08:04 AM IST

ఈనెల 23న కావలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం

NLR: ఈనెల 23న మధ్యాహ్నం 2 గంటలకు కావలి ట్రంక్ రోడ్డులోని రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి కళ్యాణ మండపంలో వైసీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.

February 20, 2026 / 08:03 AM IST

నేడు మిర్చి యార్డ్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం

GNTR: గుంటూరు మిర్చి యార్డ్ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం జరగనుంది. నూతన ఛైర్మన్‌గా కుర్రా అప్పారావు, వైస్ ఛైర్మన్‌ బిట్రగుంట మల్లిక, డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గుజ్జనగుండ్ల చేబ్రోలు హనుమయ్య ప్రాంగణంలో జరిగే కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఈ ఏర్పాట్లను పెదకూరపాడు MLA భాష్యం ప్రవీణ్ గురువారం పర్యవేక్షించారు.

February 20, 2026 / 08:02 AM IST

ప్రైవేట్ హాస్పిటల్స్ తనిఖీ చేసిన డీఎంహెచ్‌వో

కరీంనగర్ పట్టణంలోని పలు ప్రైవేట్ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్‌లు, అల్ట్రా సౌండ్ కేంద్రాలను డీఎంహెచ్‌వో అధికారి డాక్టర్ వెంకటరమణ, జిల్లా హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్ అథారిటీ తనిఖీ బృంద సభ్యులతో కలిసి నిన్న తనిఖీ చేశారు. జిల్లాలోని అన్ని ప్రైవేటు హాస్పిటల్స్ & నర్సింగ్ హోమ్ క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం-2010 ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలని సూచించారు.

February 20, 2026 / 08:02 AM IST